Ads
మనకి ఏమైనా విషయం గురించి తెలియాల్సి ఉంటే పక్క వాళ్ళని అడగడం కంటే ముందు మనం చేసే పని ఇంటర్నెట్ లో వెతకడం. ఇంటర్నెట్ ప్రతి విషయాన్ని కరెక్ట్ గా చూపిస్తుంది అని అంత నమ్మకం ఉంటుంది. కానీ కొన్ని సార్లు ఇదే నమ్మకం తప్పు అని కూడా రుజువు అయ్యింది.
Video Advertisement
అది కూడా కొన్ని పెద్ద పెద్ద విషయాల్లో. సెలబ్రిటీలకి సంబంధించిన విషయాలు అన్ని ఇంటర్నెట్ లో దాదాపు కరెక్ట్ గానే ఉంటాయి. కానీ కొన్ని కొన్ని సార్లు తప్పు అవుతూ ఉంటాయి. అలా కొంత మంది బతికి ఉన్న సెలబ్రిటీలని మరణించినట్లు చూపించింది ఇంటర్నెట్. ఆ సెలబ్రిటీలు ఎవరో ఇప్పుడు చూద్దాం.
#1 మాధురి దీక్షిత్
బాలీవుడ్ నటి మాధురీ దీక్షిత్ మరణించారు అని అప్పుడు వార్తలు వచ్చాయి.
#2 అమితాబ్ బచ్చన్
బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ గారిపై కూడా అప్పట్లో ఇలాంటి రూమర్స్ వచ్చాయి.
#3 ఆయుష్మాన్ ఖురానా
బాలీవుడ్ స్టార్ ఆయుష్మాన్ ఖురానా కూడా ఒక ట్రిప్ కి వెళ్ళినప్పుడు చనిపోయారు అనే వార్తలు వచ్చాయి.
#4 రజనీకాంత్
రజినీకాంత్ గారిపై కూడా ఇలాంటి వార్తలు వచ్చాయి. దీనిపై రజినీకాంత్ గారి పబ్లిసిస్ట్ కూడా క్లారిఫికేషన్ ఇచ్చారు.
#5 కత్రినా కైఫ్
2013లో కత్రినా కైఫ్ చనిపోయారు అని ఒక ఫేస్ బుక్ పేజ్ షేర్ చేసింది. ఫాన్స్ కూడా సంతాపం ప్రకటించడం మొదలుపెట్టారు. తర్వాత తాను క్షేమంగా ఉన్నట్లు అధికారికంగా ఒక స్టేట్మెంట్ విడుదల చేశారు కత్రినా కైఫ్.
#6 లతా మంగేష్కర్
బాలీవుడ్, అలాగే ఇంకా ఎన్నో భాషల్లో ఎన్నో పాటలు పాడిన లతా మంగేష్కర్ గారిపై కూడా ఇలాంటి రూమర్స్ వచ్చాయి. హార్ట్ఎటాక్ వచ్చి లతా మంగేష్కర్ గారు చనిపోయినట్టు పుకార్లు వచ్చాయి. అప్పుడు లతా మంగేష్కర్ గారు స్పందించి అవన్నీ పుకార్లే అని చెప్పారు.
#7 సిద్ధార్థ్
హీరో సిద్ధార్థ్ మీద కూడా ఇలాగే ఒక యూట్యూబ్ ఛానల్ యుక్త వయసులో చనిపోయిన సెలబ్రిటీలు అంటూ సిద్ధార్థ్ ఫోటో ఉన్న థంబ్ నెయిల్ వేసింది. సిద్ధార్థ్ ట్విట్టర్ లో రెస్పాండ్ అయ్యి ఇదంతా తప్పు అని చెప్పారు.
#8 శేఖర్ మాస్టర్
గూగుల్ లో శేఖర్ మాస్టర్ అది కొడితే వచ్చే సజెషన్ లో శేఖర్ మాస్టర్ చనిపోయినట్టు చూపించారు. కానీ గూగుల్ లో అలా చూపించే సజెషన్ శేఖర్ మాస్టర్ ది కాదు వేరే ఒక నటుడిది అని తర్వాత తెలిసింది.
#9 షారుఖ్ ఖాన్
హీరో షారుఖ్ ఖాన్ కి కూడా ప్లేన్ క్రాష్ లో ప్రమాదం జరిగినట్టు వార్తలు వచ్చాయి.
#10 జాకీ చాన్
మార్చ్ 2011లో జాకీచాన్ కి హార్ట్ ఎటాక్ వచ్చి చనిపోయారు అనే వార్తలు వచ్చాయి. అప్పుడు జాకీచాన్ టీం అదంతా తప్పు అని, ఆయనకు ఎటువంటి హార్ట్ఎటాక్ రాలేదు అని, అవన్నీ పుకార్లు అని చెప్పారు.
వీరిపై మాత్రమే కాకుండా ఇంకా ఎంతో మంది సెలబ్రిటీల మీద ఇటువంటి రూమర్స్ వచ్చాయి.
End of Article