Ads
పిల్లల రేపటిని తీర్చిదిద్దాలనే తాపత్రయం తండ్రిది…అందుకే పిల్లలు ఫాదర్స్ డే సంబరాల్లో ఉన్నా కూడా..తను డ్యూటీకి హాజరై తన పిల్లల భవిష్యత్తుకు భరోసాగా నిలుస్తున్నాడు…ప్రేమ,భయం రెండూ మొదట మనకు పరిచయం అయ్యేది తండ్రి ద్వారానే..కానీ ఆ తండ్రి మనసు మనం అనుకున్నంత కరుకు కాదు,తనలో కూడా ఒక చిన్నపిల్లాడు ఉన్నాడు అని మనకు తెలిసే లోపు..ప్రేమ మాయం అయిపోతుంది..ఎందుకో.. కొడుకు ప్రేమకు దూరం అయిన ఒక తండ్రి కథ..
Video Advertisement
వాడికి ఐదేళ్ల డ్యూటీనుండి అర్దరాత్రి ఇంటికొస్తూ .. కలాకండ్ ప్యాకెట్ పట్టుకెళ్తే ఎంత నిద్రలో ఉన్నా లేచి పరిగెత్తుకొచ్చి హగ్ చేసుకుని బుగ్గ మీద ముద్దిచ్చి ,కలాకండ్ కోసం చేయి చాచేవాడు.. ఒల్లో కూర్చోపెట్టుకుని నేనే నా చేత్తో తినిపించేవాడిని..ఎంత సంబరపడేవాడో..తిని..వాళ్లమ్మ తెచ్చిన మంచినీళ్లు తాగి ఒళ్లోనే నిద్రపోయేవాడు.. తెల్లవార్లు గుండెల మీదే పడుకునేవాడు…ఉదయం నేను మళ్లీ డ్యూటీకి వెళ్లడానికి నిద్ర లేచేవరకు..
పదేళ్ల వయసులో వాళ్లమ్మతో పేచీ పెడుతున్నాడని తెలిసింది..నాన్నెప్పుడూ డ్యూటీ డ్యూటీ అంటూ వెళ్తూ ఉంటారు అని..నాకూ నిజమే అనిపించింది..డ్యూటీది ఏముందని వాడిని ,వాళ్లమ్మని ఊరంతా తిప్పుకొచ్చా.. ఆరోజు కూడా వాడి ముఖంలో సంబరం మర్చిపోలేను..
ఇలా వాడి జీవితంలో వాడు కోరుకున్న ప్రతిసారి వాడికి నచ్చింది చేస్తూ వచ్చా..వాడికి పదహారేళ్లప్పుడనుకుంటా మొదటి సారి తప్పు చేసాడని నా దృష్టికి వస్తే చెంపదెబ్బ కొట్టాను..వాడిని కొట్టనైతే కొట్టాను కానీ ఆ రోజు నా జీవితంలో మర్చిపోలేను నాపై నాకు కోపం వచ్చిన సందర్భం ఏదైనా ఉందా అంటే అదే..
తర్వాత రోజు వాడి రూం కి వెళ్లి వాడితో మాట్లాడానికి ప్రయత్నిస్తే..ముఖం తిప్పుకున్నాడు.. సారీ చెప్పి, ఆ తప్పు వలన కలిగే నష్టాలు చెప్పి.. చక్కిలిగింతలు పెట్టి నవ్వించా..వాడిని బయటికి తీసుకెళ్లి ఇద్దరం జాలీగా తిరిగొచ్చాం..ఆరోజు వాడు నేను కొట్టిన దెబ్బకన్నా,వాడిపై నాకున్న ప్రేమ రెట్టింపు అని గుర్తించాలని.. అనుకున్నట్టుగానే గుర్తించాడు.. వాడు చేసిన తప్పుకి సారీ చెప్పి ఇంకెప్పుడూ చేయనని చెప్పాడు..మళ్లీ వాడిని దగ్గరకు తీసుకుని వాడి భుజం పై చేయి వేసి తప్పటడుగులు వేయకుండా వాడికి నాన్న ఉన్నాడనే భరోసా ఇచ్చాను..
చదువు ముగిసింది..మంచి ఉద్యోగంలో చేరాడు..పెళ్లి చేసుకున్నాడు.పిల్లలు పుట్టారు.. అంతా సాఫిగా సాగిపోతుంది అనుకున్న టైంలో నా భార్య చనిపోయింది.. అప్పటివరకు నా అవసరాలు, నా బాగోగులు అన్ని తనే చూసేది..తను లేని లోటు తను వెళ్లిపోయాక కాని గుర్తించలేకపోయా.. ఎక్కడో చదివా..భార్యలు సుమంగలిగా పోవాలనుకుంటారు కానీ..భార్యలకంటే ముందే భర్తలు పోవాలట..ఎందుకంటే మలి దశలో భార్య లేకుండా భర్తలు బతకడం అసాధ్యం..నా విషయంలో అదే జరిగింది..
నా పనులు చూసే తీరిక నా కొడుకు ,కోడలికి లేదు..దానికి నేను వారిని నిందించను..నాకు ఒక సర్వంట్ ని పెట్టే స్తోమత ఉన్నా కూడా ఎందుకో నాకే అది ఇష్టం లేదు..నా భార్య ఉన్నప్పుడు కుటుంబంతో వాడు బయటికి వెళ్తే నేను నా భార్య కాలక్షేపం చేసేవాళ్లం ఇప్పుడు తను లేదు..వాడి ఫ్యామిలితో వాడు బయటకు వెళ్లాలన్నా..ఇంట్లో నా పనులు చూడాలన్నా ఇబ్బందిపడ్డారు..చివరికి ఒక రోజు ఉదయం వాడు నా దగ్గరకి వచ్చి నాన్నా ఓల్డేజ్ హోం లో జాయిన్ అవుతావా అని అడిగాడు..వాడు నా దగ్గరకు వచ్చి ఒక్కసారి హగ్ చేసుకుని నాన్నా నీకు నేనుంటాను అని అడుగితే బాగున్నని మనసు కోరుకుంది..కానీ వాడు ఓల్డేజ్ హోం కన్నా అడగడానికన్నా ముందే నేను వాడితో అదే చెప్దామనుకున్నాను.. ఇంతలో వాడే అడగడంతో సరే అన్నాను..
అంతా మన మంచికే అని అనుకోవడం అలవాటైన నాకు ఇది కూడా నా మంచికే అనిపించింది..కానీ ఓల్డేజ్ హోంలో జాయిన్ చేసినప్పటికి.. పిల్లల్ని హాస్టల్లో జాయిన్ చేస్తే వారానికి ఒకసారో నెలకి ఒకసారో పిల్లల్ని ఇంటికి తీసుకెళ్లినట్టు …నా దగ్గరకి నా కొడుకు వస్తాడనుకున్నాను.. కానీ ఏడాదికి ఒకసారే నా కొడుకు నా దగ్గరకు వచ్చేవాడు.. అది ఫాదర్స్ డే నాడు.. వచ్చి నాతో ఒక సెల్ఫీ దిగి వాట్సప్ స్టాటస్ పెట్టి సంబరపడేవాడు..అప్పుడు కూడా నా కొడుకు ముఖంలో సంబరం చూసే నేను సంతోషపడేవాడిని..
అమ్మలకు ఒక రోజు..నాన్నలకు ఒకరోజు..ప్రేమికులకు ఒకరోజు ఏంటో అంటూ ఒకప్పుడు తిట్టుకునేవాడిని..కానీ ఇప్పుడు కనీసం నా కొడుకుకి ఈ సంధర్బంగా అయినా నేను గుర్తొచ్చినందుకు సంతోషపడుతున్నాను.. వాడుజీవితంలో పడిపోయిన ప్రతిసారి దగ్గరకు తీసుకుని ధైర్యం చెప్పాను..ఇక కొంతకాలం అయితే జీవితమే ఉండని నాకు వాడు ధైర్యం చెప్పలేకపోయాడు..తండ్రయ్యాడు కదా..వాడు వాడిపిల్లల గురించి ఆలోచిస్తున్నాడు.. అని సర్దిచెప్పుకుంటున్నా..
End of Article