Ads
కొన్ని సినిమాలు విడుదలకు ముందే చాలా క్రేజ్ సంపాదించుకుంటాయి. దాంతో సినిమా విడుదలయ్యే ముందు నుంచి ప్రేక్షకులు చాలా ఆసక్తిగా ఎదురు చూస్తారు. అలా ఎన్నో అంచనాలతో వచ్చిన సినిమాలు కొన్ని అంచనాలను అందుకున్నాయి. కొన్ని అందుకోలేకపోయాయి. అయితే ఇటీవల అలాగే భారీ అంచనాలతో విడుదలయ్యి సూపర్ హిట్ సాధించిన సినిమా ఉప్పెన.
Video Advertisement
డైరెక్టర్ సుకుమార్ శిష్యుడు అయిన బుచ్చిబాబు సానా ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం అయ్యారు. ఈ సినిమాతోనే పంజా వైష్ణవ్ తేజ్, కృతి శెట్టి హీరో హీరోయిన్లుగా ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు. ఈ సినిమాకి ఒక మేజర్ ప్లస్ పాయింట్ దేవి శ్రీ ప్రసాద్ అందించిన సంగీతం. ఈ సినిమాలోని నీ కన్ను నీలి సముద్రం పాట విడుదలయ్యి దాదాపు సంవత్సరం పైనే అయ్యింది.
ఈ పాట విడుదల అయిన వెంటనే ఈ సినిమా లవ్ స్టోరీ అని ప్రేక్షకులకు అర్థమైపోయింది. తర్వాత ప్రతి ఒక్క పాటకి సినిమాపై ఎక్స్పెక్టేషన్స్ పెరిగాయి. ఈ సినిమాలో అన్ని పాటలు సూపర్ హిట్ అయ్యాయి. ఇందులో ముఖ్యంగా చెప్పుకోవాల్సిన మరొక పాట జల జల జలపాతం నువ్వు. నీ కన్ను నీలి సముద్రం తర్వాత అంత హిట్ అయిన పాట ఇదే.
అయితే ఈ పాటకు సంబంధించిన ఒక విషయం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అదేంటంటే ఈ పాట మధ్యలో 1:22 వచ్చే బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ మెసేజ్ నోటిఫికేషన్ టోన్ లాగా ఉంది. ఒకసారి మీరు కూడా వినండి. మీకు కూడా అలానే అనిపించింది కదా? ఏదేమైనా ఇలాంటి సిమిలర్ ట్యూన్స్ ఉండడం అనేది జరుగుతూనే ఉంటుంది. కానీ ప్రస్తుతం ఈ పాట ట్రెండింగ్ లో ఉండడంతో ఈ పాటకు సంబంధించిన ఈ విషయం కూడా ట్రెండింగ్ లో ఉంది.
watch video :
End of Article