“విరాటపర్వం” కూడా ఓటిటి రిలీజేనా..? రానా నా మాట వినడు అంటూ క్లారిటీ ఇచ్చేసిన సురేష్ బాబు..!

“విరాటపర్వం” కూడా ఓటిటి రిలీజేనా..? రానా నా మాట వినడు అంటూ క్లారిటీ ఇచ్చేసిన సురేష్ బాబు..!

by Anudeep

Ads

నిర్మాత సురేష్ బాబు ఇటీవల కీలక వ్యాఖ్యలు చేసారు. ఆయన బ్యానర్ లో వచ్చిన “నారప్ప” సినిమా ను ఓటిటి రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. ఈ విషయమై సినిమాను థియేటర్ లోనే రిలీజ్ చేయాలంటూ ఎగ్జిబిటర్లు సూచించినా… సినిమా ఎక్కడ రిలీజ్ చేయాలనేది పూర్తిగా నిర్మాత ఇష్టమంటూ పేర్కొన్నారు. ఫ్యూచర్ మొత్తం ఓటిటిదేనని, ఫ్యూచర్ లో తానూ ఓ ఓటిటి ని స్టార్ట్ చేస్తానని వెల్లడించారు.

Video Advertisement

suresh babu

ఈ క్రమం లో నారప్ప ఓటిటి లోనే రిలీజ్ అయింది. దీనితో.. ఇదే బ్యానర్ పై రూపొందించబడ్డ సినిమాలు విరాటపర్వం, దృశ్యం సినిమాలు కూడా ఓటిటి లోనే విడుదల అయ్యే అవకాశాలున్నాయని టాలీవుడ్ వర్గాలు భావిస్తున్నాయి. ఈ క్రమం లో స్పందించిన సురేష్ బాబు ఈ సినిమా ఓటిటి రిలీజ్ కి ఇబ్బందులు ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయన్నారు. ఎందుకంటే.. ఈ సినిమాలు ఇతరులతో కలిసి సంయుక్తం గా నిర్మించామని, అందువల్ల ఇబ్బందులు వచ్చే అవకాశం ఉందని అన్నారు.

suresh babu 3

ఈ సందర్భం గా ఆయన రానా గురించి కూడా ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు. రానా కి ఎలాంటి సినిమాలు చేయాలో తాను చెప్పనని.. ఒకవేళ చెప్పినా.. రానా వినిపించుకోదని.. చెప్పడం వేస్ట్ అని అన్నారు. రానా ఏమి చేసినా చెప్పి చేస్తాడు. తన నిర్ణయాలు తానే తీసుకుంటాడన్నారు. ఇక.. విరాటపర్వం, దృశ్యం సినిమాలను ఓటిటి లో రిలీజ్ చేయాలంటే.. పార్టనర్స్ గురించి కూడా ఆలోచించాలన్నారు. కాబట్టి ఈ విషయమై ఇప్పుడే ఏమి చెప్పలేనన్నారు. విరాటపర్వం ఇంకా ఐదు రోజుల షూటింగ్ పెండింగ్ ఉందని అన్నారు.

suresh babu 2

దృశ్యం మూవీ ఓటిటి లో చూసాకే తెలుగు రైట్స్ కొన్నానని అన్నారు. అక్కడ కూడా నిర్మాత చాలా డబ్బులు పెట్టి సినిమాను తీసారని.. కానీ థియేటర్ లో రిలీజ్ కాలేదన్నారు. ఓటిటి లో సినిమా రిలీజ్ అంటే.. ఆ పెయిన్ నాకు కూడా ఉంటుందని.. ఎందుకంటే నాకు కూడా థియేటర్స్ ఉన్నాయి.. ఎగ్జిబిటర్స్ లో ఫ్రెండ్స్ కూడా ఉన్నారని చెప్పుకొచ్చారు. కానీ.. భయం ఉన్నప్పుడు ప్రేక్షకులు థియేటర్ కి వస్తారా లేదా? అన్నది అనుమానమేనన్నారు. నేనే థియేటర్స్ కి వెళ్ళను అని.. ఇక ఇతరుల్ని థియేటర్ కి వెళ్ళమని చెప్పలేనన్నారు. ప్రతికూల వాతావరణం ఉన్నపుడు ఓటిటి లే బెస్ట్ అని సురేష్ బాబు అభిప్రాయపడ్డారు.


End of Article

You may also like