Ads
హైదరాబాద్ లో బోనాల ఉత్సవాలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ ఏడాది కూడా కరోనా భయం ఉన్నప్పటికీ.. భక్తులు బోనాలెత్తుతున్నారు. మొదటగా గోల్గొండ కోటాలో బోనాలు మొదలయ్యాయి.. ఆ తరువాత హైదరాబాద్ లో పలుచోట్ల బోనాల ఉత్సవాలు జరుగుతూ వస్తున్నాయి. అయితే.. సికిందరాబాద్ లో జరిగే రంగానికి నగరవ్యాప్తం గా ప్రాముఖ్యత ఉంది.
Video Advertisement
రంగం లో స్వర్ణలత భవిష్యవాణి వినిపిస్తారు. గతేడాది చేయలేకపోయినా , ఈ ఏడాది భవిష్యవాణి లో ఏమి చెప్తారు అన్న ఉత్సుకత నగర ప్రజల్లో నెలకొంది. కొద్దిసేపటి క్రితమే సికందరాబాద్ ఉజ్జయిని మహంకాళి దేవాలయం లో రంగం మొదలైంది. ఈ సందర్భం గా కరోనా గడ్డుకాలం లోను భక్తులు జరుపుతున్న బోనాల ఉత్సవాలతో అమ్మవారు సంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలిపారు. అలాగే.. కరోనా నుంచి అందరు భక్తులను కాపాడతానని.. నా ఆశీర్వాదం భక్తులకు ఎప్పటికి ఉంటుందని అమ్మవారు తెలిపారు. వర్షాల వలన కొంత ఇబ్బందిపడినా.. నేను మీ వెంట ఉండి కాపాడతానని అమ్మవారు చెప్పారు.
End of Article