ఫేస్ మాస్క్ తో పాటు ముక్కుపుడక కూడా తప్పనిసరి అయినప్పుడు ఏమి చేయాలి..? ఇదిగో ఇలా చేయాలి.. చూసి నవ్వుకోండి..!

ఫేస్ మాస్క్ తో పాటు ముక్కుపుడక కూడా తప్పనిసరి అయినప్పుడు ఏమి చేయాలి..? ఇదిగో ఇలా చేయాలి.. చూసి నవ్వుకోండి..!

by Anudeep

Ads

స్వేచ్ఛగా గాలి పీల్చుకుని బతికే మనకు మాస్క్ పెట్టుకుని తిరగడం మొదట్లో ఇబ్బందిగానే ఉండేది. కానీ.. పరిస్థితి విషమిస్తోంది. మాస్క్ ధరించడం తప్పనిసరి. మన ప్రాణాలను కాపాడుకోవడం కోసం మాస్క్ పెట్టుకోక తప్పదు. మరి మహిళలు అలంకార ప్రియులు అన్న సంగతి తెలిసిందే. మహిళలు అందం గా ఉండడం కోసం ముక్కెర తగిలించుకుంటూ ఉంటారు.

Video Advertisement

mask

చిన్న వి అయితే పర్లేదు కాదు.. పెద్ద ముక్కెరలు ధరించాల్సి వచ్చినపుడు ఆ పైన మాస్క్ ధరించడం ఇబ్బంది గా ఉంటుంది. అయితే.. దానికి ఈ మహిళా ఓ సొల్యూషన్ కనిపెట్టేసింది. ఏకం గా మాస్క్ పైనే ముక్కెరను ధరించింది. ఆమె పేరు కవిత. ఇటీవల ఆమె ఓ వివాహ వేడుకకు హాజరు అయింది. ఈ సందర్భం గా ఆమె మాస్క్ పైనే అలంకారం చేసుకుంది. ఈ సందర్భం గా ఆమె తీసుకున్న ఫోటో నెట్టింట్లో వైరల్ అవుతోంది. ఆమె ఫోటో ను ఐపీఎస్ అధికారి దీపాంశు కబ్రా ట్విట్టర్ లో షేర్ చేసారు.

mask 1

ఈ ఫోటో వైరల్ కావడం తో స్పందించిన కవిత.. తానూ ఇంటికి పెద్దదాన్ని అని.. కచ్చితం గా సంప్రదాయం ప్రకారం ముక్కెర ధరించాలని ఆమె పేర్కొంది. తానేమీ షో కోసం ధరించలేదని.. అయితే.. మాస్క్ లోపల ధరించడానికి ఇబ్బందిగా ఉన్న కారణం గా మాస్క్ పైనే ధరించినట్లు” చెప్పుకొచ్చింది..


End of Article

You may also like