Ads
దర్శకుడు సుకుమార్ దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా తెరకెక్కిన బ్లాక్ బస్టర్ సినిమా ‘రంగస్థలం’. వై.రవి శంకర్, వై.నవీన్, సి.వి.మోహన్ లు కలిసి నిర్మించిన ఈ సినిమా మార్చి 30న 2018లో రిలీజ్ అయ్యింది. ఈ మార్చి 30కి ఈ సినిమా రిలీజ్ అయ్యి ఐదు సంవత్సరాలు అయ్యింది. 1985 లో ఉభయ గోదావరి జిల్లాల రాజకీయాలు, అక్కడ ఉండే వాతావరణం, నేపథ్యం, అణగదొక్కడం వంటి అంశాలతో ఈ సినిమాని దర్శకుడు సుకుమార్ తీర్చిదిద్దాడు.
Video Advertisement
ఈ సినిమాపై మొదట్లో అంచనాలు అంతగా లేవు. రామ్ చరణ్, సమంత జంటగా నటించిన ఈ మూవీ రిలీజ్ అయ్యాక తొలి షోతోనే బ్లాక్ బస్టర్ టాక్ వచ్చింది. దాంతో భారీ వసూళ్ళు సాధించింది ఈ సినిమా. వినికిడి సమస్యతో ఉన్న చిట్టిబాబు అనే పాత్రలో రామ్ చరణ్ నటన మూవీకే హైలెట్ అని చెప్పవచ్చు. ఈ సినిమాలో నటించిన నటినటులందరికి కూడా ప్రశంసలు వచ్చాయి. అలాంటి ఈ సినిమాని కొంత మంది పాపులర్ నటీనటులు మిస్ చేసుకున్నారు. మరి ఆ యాక్టర్స్ ఎవరో ఇప్పుడు చూద్దాం..
1. రాజశేఖర్ :
రంగస్థలం సినిమాలో జగపతి బాబు నటించిన ప్రెసిడెంట్ క్యారెక్టర్ కు ఎంతటి పేరు వచ్చిందో తెలిసిందే. అయితే ఈ పాత్రకు మొదట అనుకుంది జగపతి బాబును కాదు. సుకుమార్ ఈ పాత్ర కోసం హీరో రాజశేఖర్ కి కథ చెప్పారంట. అయితే ఆయన ఒప్పుకోలేదంట.2. అనుపమ పరమేశ్వరన్ :
ఈ సినిమాలో హీరోయిన్ గా మొదట అనుకుంది సమంతని కాదంట. సుకుమార్ అనుపమ పరమేశ్వరన్ ను హీరోయిన్ గా తీసుకున్నారు. అయితే ఆమె కొన్ని కారణాలతో ఈ సినిమా నుండి తప్పుకుంది. దాంతో సమంతను తీసుకున్నారు. 3. రాశి :
ఈ చిత్రంలో మరో కీలకమైన పాత్ర రంగమ్మత్త. ఈ క్యారెక్టర్ లో అనసూయ నటించింది. ముందుగా ఈ క్యారెక్టర్ కోసం సీనియర్ హీరోయిన్ రాశిని అడిగారంట. అయితే ఆ రాశికి ఆ క్యారెక్టర్ వస్త్రాలంకరణ నచ్చకపోవడంతో చేయనని చెప్పింది.4.పృథ్వీ రాజ్ :
ఈ సినిమాలో కమెడియన్ 30 ఇయర్స్ పృథ్వీ నటించారు. అయితే సినిమా నిడివి ఎక్కువ అవడడంతో కొన్ని సన్నివేశాలను ఎడిటింగ్ లో తొలగించారంట. వాటిలో పృథ్వీ నటించిన సీన్స్ కూడా ఉన్నాయి.
Also Read: లవకుశ సినిమాలో “అంజలీదేవి” నుండి ఆదిపురుష్ సినిమాలో “కృతి సనన్” వరకు… సినిమాల్లో “సీతా దేవి” పాత్రలో నటించిన 8 హీరోయిన్స్..!
End of Article