‘బాలీవుడ్’ లో వాళ్ళకి తిరుగులేదు అక్కడ సూపర్ స్టార్స్ కానీ టాలీవుడ్ లో కలిసి రాలేదు !

‘బాలీవుడ్’ లో వాళ్ళకి తిరుగులేదు అక్కడ సూపర్ స్టార్స్ కానీ టాలీవుడ్ లో కలిసి రాలేదు !

by Anudeep

Ads

హీరోయిన్లు దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలన్న సామెతను అక్షరాలా పాటిస్తారు. అందుకే వారికి అవకాశం ఉన్నంతమేరకు ఇతర భాషా చిత్రాలలో కూడా నటించడానికి ఆసక్తి కనబరుస్తారు. అయితే.. ఇతర భాషల్లో ఒక్కోసారి సక్సెస్ కాలేకపోయారు. అలా.. బాలీవుడ్ లో టాప్ హీరోయిన్లు గా వెలుగొంది.. టాలీవుడ్ కి వచ్చేసరికి ఫెయిల్ అయిన హీరోయిన్ల లిస్ట్ పై ఓ లుక్ వేయండి.

Video Advertisement

#1 శ్రద్ధా కపూర్ – సాహో:

1 sradda
శ్రద్ధా కపూర్ బాలీవుడ్ లో ఎంత తోప్ అన్న సంగతి మనకి తెలుసు. ఆమె తెలుగు సినిమాల్లో నటించక ముందే ఆమె కు తెలుగునాట ఫాన్స్ ఉన్నారు. కానీ, ఆమె నటించిన సాహో సినిమా మాత్రం బాక్స్ ఆఫీస్ వద్ద ఫెయిల్యూర్ గా నిలిచింది

#2 బిపాషా బసు – టక్కరి దొంగ:

2 bipasa
బిపాషా బసు కూడా బాలీవుడ్ లో టాప్ హీరోయిన్. కానీ, తెలుగు నాట మాత్రం ఆమె సక్సె కాలేకపోయారు. టక్కరి దొంగ సినిమా తరువాత ఆమెకు అంతగా అవకాశాలు రాలేదు.

#3 కంగనా రనౌత్ – ఏక్ నిరంజన్:

3 kanganaకంగనా రనౌత్ నేటికీ టాప్ హీరోయిన్ గా వెలుగొందుతున్నారు. ఏక్ నిరంజన్ సినిమా తో ఆమె తెలుగు వారికి పరిచయమైనా.. ఆ తరువాత పెద్ద గా అవకాశాలు రాకపోవడం తో బాలీవుడ్ లో తన అదృష్టాన్ని పరీక్షించుకుంది.

#4 విద్యాబాలన్ – ఎన్టీఆర్ కథానాయకుడు:

4 vidya balanవిద్యాబాలన్ కు తెలుగునాట కూడా మంచి ఫాలోయింగ్ ఉంది. కానీ, ఆమెకు కధానాయకుడు సినిమా హిట్ ఇవ్వలేదు. ఆ తరువాత ఆమెకు పెద్ద గా అవకాశాలు కూడా రాలేదు.

#5 సుష్మితా సేన్ – రక్షకుడు:

5 susmita senసుష్మితా సేన్ తెలుగు లో రక్షకుడు సినిమా లో నటించారు. తెలుగు నాట పెద్ద గా సక్సెస్ కాలేకపోవడం తో ఆమె బాలీవుడ్ కు వెళ్లిపోయారు.

#6 ప్రియాంక చోప్రా – తుఫాన్:

6 priyanka chopraబాలీవుడ్ టాప్ హీరోయిన్స్ లిస్ట్ లో కచ్చితం గా ఉండే పేరు ప్రియాంక చోప్రా. కానీ, ఆమె తెలుగు లో నటించిన తుఫాన్ సినిమా డిజాస్టర్ గా నిలిచింది. ఈ సినిమా తరువాత ఆమెకు పెద్దగా అవకాశాలు రాలేదు.

#7 అమృతా రావు – అతిధి:

7 amrutharaoఅతిధి సినిమా లో హీరోయిన్ గా నటించిన అమృతా రావు గుర్తుందా..? ఆ సినిమా తరువాత అమృతా రావు కు అవకాశాలేవీ రాకపోవడం తో ఆమె బాలీవుడ్ కు వెళ్ళిపోయింది.

#8 కత్రినా కైఫ్ – అల్లరి పిడుగు:

8 katrinaమల్లీశ్వరి సినిమా తో కత్రినా కైఫ్ తెలుగు వారికీ పరిచయమైంది. మల్లీశ్వరి మంచి విజయాన్నే అందించింది. అయితే కత్రినా కైఫ్ నటించిన అల్లరి పిడుగు సినిమా మాత్రం హిట్ అవ్వలేదు. దానితో ఆమె బాలీవుడ్ లో సెటిల్ అయిపోయారు.

#9 ట్వింకిల్ ఖ‌న్నా – శ్రీను:

9 twinkle khannaవెంకటేష్ సినిమా శ్రీను లో ట్వింకిల్ ఖ‌న్నా హీరోయిన్ గా నటించారు. ఆ తరువాత ఆమె టాలీవుడ్ లో ఏ సినిమాలోనూ నటించలేదు. బాలీవుడ్ లోనే సెటిల్ అయిపోయారు.

#10 అయేషా టాకియా – సూపర్:

10 ayeshaఅయేషా టాకియా సూపర్ సినిమా లో నాగ్ తో కలిసి నటించారు. ఆమె యువతను బాగా ఆకట్టుకున్నా.. అవకాశాలు రాకపోవడం తో.. ఆమె బాలీవుడ్ కు వెళ్లిపోయారు.

 


End of Article

You may also like