మహిళల కోసం ప్రత్యేకంగా ఆ సెలవులు.. మార్పుతో ముందుకొచ్చిన ఈ 10 కంపెనీలని మెచ్చుకోకుండా ఉండలేరు..!

మహిళల కోసం ప్రత్యేకంగా ఆ సెలవులు.. మార్పుతో ముందుకొచ్చిన ఈ 10 కంపెనీలని మెచ్చుకోకుండా ఉండలేరు..!

by Megha Varna

Ads

పూర్వకాలంలో పీరియడ్స్ అంటే ఎన్నో మూఢనమ్మకాలని అనుసరించేవారు. గుడ్డిగా పెద్దలు చెప్పే కఠినమైన పద్ధతులని కూడా అనుసరిస్తూ ఉండేవారు. కానీ ఇప్పుడు మాత్రం దీనిపై ఆలోచించే విధానం మారింది. ఎక్కువ పీరియడ్స్ గురించి మాట్లాడడం వలన కూడా దానిపై చాలా మార్పు కూడా వచ్చింది. కేవలం బ్లడ్ లాస్ మాత్రమే కాదు తల నొప్పి, కడుపు నొప్పి, కళ్ళు తిరగడం, ఇబ్బందిగా ఉండటం వంటి ఎన్నో సమస్యలు వస్తాయి.

Video Advertisement

దీంతో నెలలో ఆ మూడు రోజులు భరించడం కష్టమవుతుంది. అయితే వీటిని దృష్టిలో పెట్టుకుని చాలా కంపెనీలు మహిళా ఉద్యోగులకు పీరియడ్స్ సెలవులు కూడా ఇవ్వడం మొదలుపెట్టారు. ఇలాంటి చిన్న మార్పు వలన మహిళకి మంచి జీవితాన్ని ఇస్తుంది. పైగా ఈ మార్పు చాలా అవసరం మరియు ఉపయోగం కూడా. మరి ఆ కంపెనీల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.

#1 కల్చర్ మిషన్:

బొంబాయి బేస్డ్ డిజిటల్ మీడియా స్టార్టప్ మొట్టమొదట పీరియడ్స్ లీవ్ పాలసీని తీసుకువచ్చింది. అయితే ఈ పాలసీ ద్వారా మహిళా ఉద్యోగులు వాళ్ల పీరియడ్స్ లో మొదటి రోజు సెలవు పెట్టొచ్చు. పైగా పీరియడ్స్ మీద కూడా అవగాహన వీళ్ళు కల్పించారు.

#2 గజూప్:

ఇది మహిళా ఉద్యోగులకి ఆ సమయంలో సెలవు ఇస్తుంది. పైగా పీరియడ్స్ రోజులో సెలవు పెట్టినా శాలరీని కట్ చేయడం జరగదు. ఇక్కడ మహిళా ఉద్యోగులు పీరియడ్స్ మొదటి రోజు సెలవు తీసుకోవచ్చు.

#3 స్విగ్గి:

ఇక్కడ మహిళా ఉద్యోగులు రెండు రోజుల పాటు పీరియడ్స్ సమయంలో సెలవు తీసుకోవచ్చు. సాధారణంగా మహిళలకి డెలివరీ చేయడం, ఎక్కువ శ్రమ పడడం చాలా కష్టం అవుతుంది. ముఖ్యంగా ఇలాంటి సమయాల్లో మహిళలు చాలా ఇబ్బందులు ఫేస్ చేయాల్సి వస్తుంది. అందుకని స్విగ్గీ ఈ నిర్ణయం తీసుకుంది. పైగా పేమెంట్ ని కూడా కట్ చేయడం జరగదు.

 

#4 మాతృభూమి:

మలయాళం మీడియా ఆర్గనైజేషన్ మాతృభూమి కూడా 2017 లో కల్చర్ మెషిన్ తీసుకొచ్చిన పాలసీని చూసి కంపెనీ ఈ పాలసీని తీసుకువచ్చింది. పీరియాడ్స్ లో ఉండే మహిళలు మొదటి రోజు సెలవు తీసుకోవచ్చు.

#5 మాగ్జ్టర్:

ఈ చెన్నై బేస్డ్ డిజిటల్ మ్యాగజీన్ ప్లేట్ ఫామ్ కల్చర్ మెషిన్ మరియు గజూప్ తో పాటు పీరియడ్ లీవ్ పాలసీని మహిళా ఉద్యోగుల కోసం తీసుకు వచ్చింది. పీరియడ్స్ లో ఏదో ఒక రోజు సెలవు తీసుకోచ్చు.

 

#6 వెట్ అండ్ డ్రై:

ఫీమేల్ హైజీన్ ప్రొడక్ట్స్ ని ఈ కంపెనీ చేస్తుంది. మహిళల అవసరాలని తెలుసుకుని పీరియడ్స్ సమయంలో రెండు రోజులు సెలవు తీసుకునే అవకాశం ఇచ్చింది. అలానే పీరియడ్స్ సమయం లో వర్క్ ఫ్రమ్ హోమ్ ఫెసిలిటీని కూడా కల్పించింది.

 

#7 జొమాటో:

జొమాటోలో చాలా మంది మహిళలు పని చేస్తున్నారు. ఈ పాపులర్ ఫుడ్ ఏజెన్సీ ఏడాదికి పది పీరియడ్ సెలవులని మహిళా ఉద్యోగులకి ఇస్తుంది.

#8 ఇండస్ట్రీ ARC:

ఇది మార్కెట్ రీసెర్చ్ అండ్ స్ట్రాటజిక్ కన్సల్టింగ్ స్టార్ట్-అప్ హైదరాబాద్ లో వుంది. ఒక రోజు లేదా రెండు రోజులు ఈ కంపెనీ మెన్స్ట్రుల్ లీవ్ పాలసీని తీసుకొచ్చింది. అయితే ఒకవేళ పెండింగ్ వర్క్ ఏదైనా ఉంటే తరవాత పూర్తి చేసేయాలి.

#9 iVIPAVAN :

మహిళలు పని చేసేటప్పుడు ఆరోగ్యకరమైన వాతావరణాన్ని కల్పించాలని ఈ కంపెనీ పీరియడ్ లీవ్ పాలసీ ని లాంచ్ చేసింది. ఈ పాలసీ కింద ఏడాదికి మహిళా ఉద్యోగులకి 12 సెలవులు ఉంటాయి.

 

#10 బైజూస్:

బాగా పాపులర్ అయిన ఎడ్యుకేషన్ యాప్ బైజూస్. ఇది కూడా తాజాగా పాలసీని లాంచ్ చెయ్యడం జరిగింది. ఈ పాలసీ కింద మహిళా ఉద్యోగులు పన్నెండు రోజులు ఏడాదికి సెలవు తీసుకోచ్చు. ఇక్కడ పని చేసే మహిళా ఉద్యోగులు నెలకి ఒక రోజు లేదా రెండు రోజులు సెలవు తీసుకోచ్చు.

 

 

 

 

 


End of Article

You may also like