ఈ 11 మంది హీరోయిన్లు వేయించుకున్న టాటూలు చూసారా? వాటికి అర్ధం ఏంటంటే?

ఈ 11 మంది హీరోయిన్లు వేయించుకున్న టాటూలు చూసారా? వాటికి అర్ధం ఏంటంటే?

by Anudeep

Ads

మనకి ఏదైనా మరచిపోని జ్ఞాపకాలు ఉంటే వాటిని టాటూ రూపంలో ఆ సందర్భం ఎప్పుడూ మనతోనే ఉండేలాగా చేసుకుంటాం. అలాగే మన హీరోయిన్ల లో కూడా వాళ్ళ జీవితంలో ముఖ్యమైన సందర్భాలు లేదా ముఖ్యమైన మనుషులు కోసం, లేదా ఇష్టంతో టాటూ వేయించుకున్న వాళ్లు ఎంతో మంది ఉన్నారు. వాళ్ళలో కొంతమంది ఎవరో, ఆ టాటూ అర్థం ఏమిటో ఇప్పుడు చూద్దాం.

Video Advertisement

#1 తాప్సీ

తాప్సీకి కాలు మీద ఒక అమ్మాయి టాటూ ఉంటుంది. ఆ టాటూ తన స్వేచ్ఛగా ఆలోచించే తత్వాన్ని సూచిస్తుందట.

 

#2 అనసూయ

అనసూయ కి మెడ మీద నిక్కు అని రాసి ఉంటుంది. నిక్కు తన భర్త సుశాంక్ భరద్వాజ్ నిక్ నేమ్. అలాగే ఎడమ చేతిమీద కలోన్ అని ఉంటుంది. కలోన్ అనేది ఒక గ్రీకు పదం. అందం, ఇంకా ఎవరిని అనుసరించకుండా తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు ఏర్పరుచుకోవడం, అన్అపాలొజిటిక్ అని అర్థం.

 

#3 శృతిహాసన్

శృతి హాసన్ కి మెడపై వెనుక భాగంలో లో తమిళ్ లో తన పేరు రాసి ఉంటుంది. అంతేకాకుండా చేతిపై ఒక గులాబీ పువ్వు టాటూ ఉంటుంది. అలాగే తన భుజంపై, మెడపై, కాలి మీద కూడా టాటూలు ఉంటాయట. మొత్తం కలిపి శృతిహాసన్ కి ఐదు టాటూలు ఉంటాయి.

#4 సమంత

సమంత మెడపై వై ఎం సి అక్షరాలు రాసి ఉంటాయి. అది తన మొదటి సినిమా ఏం మాయ చేశావే టాటూ అని అర్థం. చేతి పై రెండు వి అక్షరాలు ఉంటాయి. పాజిటివ్ గా ఆలోచించాలి అనేదానికి ఆ టాటూ గుర్తు అట. నడుము పై చై (chay) అని ఉంటుంది. అంటే నాగచైతన్య పేరు అని అర్థమట.

#5 రష్మిక మందన్న

రష్మిక చేతిమీద ఇర్రీప్లేసబుల్ అని ఉంటుంది. ఆ టాటూ రష్మిక తన కోసమే వేయించుకుంది. తన స్థానాన్ని ఎవరు భర్తీ చేయలేనంత వ్యక్తిత్వం గల మనిషి అని ఆ టాటూ అర్థం.

#6 నయనతార

నయనతార ఇంతకుముందు ప్రభుదేవాతో ప్రేమలో ఉన్నప్పుడు తన చేతి మీద ప్రభు పేరును టాటూ వేయించుకుంది. కానీ తర్వాత వాళ్ళిద్దరు విడిపోవడంతో ఆ టాటూ ని కొంచెం మార్చి పాజిటివిటీ అని అర్థం వచ్చేలాగా వేయించుకుంది.

#7 ఇలియానా

ఇలియానా చేతిమీద ఇన్స్పిరేర్ అని ఉంటుంది. అది ఒక లాటిన్ పదం. ఇన్స్పిరేర్ అంటే స్ఫూర్తి అని అర్థం. అంతేకాకుండా చేతికి మరొకవైపు మూడు చుక్కలు ఉంటాయి. ఆ చుక్కలు తన సిస్టర్స్ ని సూచిస్తాయట. కాలి మీద ఒక కన్ను టాటూ ఉంటుంది. అలాగే మరొక కాలు మీద డ్రీమ్ క్యాచర్ టాటూ ఉంటుంది. వీపుమీద ఒక పక్షి రెక్కలు విప్పుకొని ఎగురుతున్నట్టు ఉండే ఒక టాటూ ఉంటుంది.

#8 త్రిష

త్రిష మెడ మీద నీమో టాటూ ఉంటుంది. వీపుపై తనకి నటనపై ఉన్న ఇష్టాన్ని చూపించడానికి క్లాప్ బోర్డ్ టాటూ వేయించుకుంది. అంతేకాకుండా తన మణికట్టుపై తన రాశి అయిన వృషభం గుర్తు కూడా టాటూ గా వేయించుకుంది.

#9 నిహారిక కొణిదెల

నిహారిక వీపుపై ఒక పక్షి టాటూ ఉంటుంది.  ఆ టాటూ కి స్వేచ్ఛ అనే అర్థం వస్తుందట .

#10 నమ్రతా శిరోద్కర్

నమ్రత చేతిమీద మహేష్, గౌతమ్, సితార పేర్లు టాటూ గా ఉంటాయి.

#11 లక్ష్మీ మంచు

లక్ష్మి మంచు వీపు పై ఒక టాటూ ఉంటుంది. రూమీ రాసిన వాట్ యు సీక్ ఈజ్ సీకింగ్ యు. అంటే నువ్వు ఏమి ఇష్టపడుతున్నావో అది నిన్ను కూడా ఇష్టపడుతోంది అని ఆ టాటూ అర్థం.

#12 షాలిని పాండే

షాలిని పాండే కాలిపై 2 మాస్కులు మధ్యలో ఒక మ్యూజిక్ నోట్ ఉన్నట్టు టాటూ ఉంటుంది. అంటే ఆ రెండు ముఖాల్లో ఒక ముఖం ఒక వ్యక్తిని మరొక ముఖం ఆ వ్యక్తి  తెర మీద ప్రదర్శించే నటనను సూచిస్తుంది.


End of Article

You may also like