ఆన్ లైన్ క్లాస్ లు వినడానికి ఒక్క మొబైల్ కోసం ఈ పాప ఎంత కష్టపడుతోందో చూడండి.. ఆ వీడియో వైరల్ అయ్యాక ఏమైందంటే..?

ఆన్ లైన్ క్లాస్ లు వినడానికి ఒక్క మొబైల్ కోసం ఈ పాప ఎంత కష్టపడుతోందో చూడండి.. ఆ వీడియో వైరల్ అయ్యాక ఏమైందంటే..?

by Anudeep

Ads

ప్రస్తుతం కరోనా మహమ్మారి కారణం గా అన్ని పనులు ఇంట్లో నుంచే జరుగుతున్నాయి. పాఠశాలలు కూడా బంద్ అయ్యి.. చివరికి పాఠ్యాంశాలను కూడా ఆన్ లైన్ లోనే బోధించాల్సిన పరిస్థితి ఏర్పడింది. కొందరు పిల్లలకు ఇంట్లో స్మార్ట్ ఫోన్ లేదా లాప్ టాప్ సౌకర్యాలు ఉండడం వలన ఇబ్బందులు లేవు.

Video Advertisement

jamshedpur kid 4

కానీ, చాలా మందికి ఈ అవకాశం లేదు. కొందరు మొబైల్ ఫోన్ లు లేక, ఆన్ లైన్ క్లాస్ లు వినలేక చాలా ఇబ్బందులు పడుతున్నారు. జంషెడ్‌పూర్‌లోని 11 ఏళ్ల తులసి కుమారి అనే బాలిక తనకు ఫోన్ లేకపోవడం తో, ఆన్ లైన్ క్లాస్ లు వినలేక ఇబ్బందులు పడుతోంది. అయితే.. మొబైల్ ఫోన్ ను ఎలాగైనా కొనుక్కోవాలన్న సంకల్పం తో ఆమె మామిడిపండ్ల అమ్మకాన్ని ప్రారంభించింది. ఓ వ్యక్తి ఆమె చేస్తున్న పని ని వీడియో తీసి సోషల్ మీడియా లో పోస్ట్ చేసారు. ఆమె పరిస్థితిని వివరించారు.

jamshedpur kid 2

అయితే.. ఈ పోస్ట్ వైరల్ కావడం తో.. ఆమెకు చాలా రెస్పాన్స్ వచ్చింది. “ఆర్ధిక ఇబ్బందుల వల్లనే తాను చదువుకోలేకపోతున్నానని.. మామిడి పండ్లు అమ్మి, వచ్చిన డబ్బుతో మొబైల్ ఫోన్ కొనుక్కుని ఆన్ లైన్ క్లాస్ లు వినాలని అనుకుంటున్నానని” తులసి చెప్పుకొచ్చింది. ఆమె వీడియో ను చూసి చలించిపోయిన ముంబైకి చెందిన వాల్యుబుల్ ఎడ్యుటైన్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ ఆమెకు సాయం చేసింది.

jamshedpur kid 3

ఆమె వద్ద డజన్ మామిడి పండ్లను రూ .1.2 లక్షలకు కొనాలని నిర్ణయించుకుంది. ఒక్కొక్క మామిడి పండుకు పదివేల రూపాయల చొప్పున చెల్లించాలని నిర్ణయించింది. దీనితో తులసి ఇప్పుడు చాలా సంతోషం గా ఉంది.. “తనకు సొంత మొబైల్ ఉండడం వలన ఎంతో సంతోషం గా ఉందని, నా ఆన్ లైన్ క్లాస్ లకు క్రమం తప్పకుండ అటెండ్ అవుతున్నానని తులసి హర్షం వ్యక్తం చేసింది.

jamshedpur kid 1

సదరు సంస్థ ఆ మొత్తాన్ని తులసి తండ్రి ఖాతా కు జమ చేసారు. చదువు పట్ల తన కుమార్తె ఎంతో చురుకు గా ఉంటుందని.. సరైన మార్గదర్శకం లభిస్తే.. ఆమె తప్పకుండ ఉన్నతం గా ఎదుగుతుందని ఆ తండ్రి ఆశాభావం వ్యక్తం చేసాడు. తులసి తల్లి పద్మిని దేవి కూడా ఈ సాయం పట్ల ఎంతో సంతోషం వ్యక్తం చేసింది. చదువు పట్ల తమ కుమార్తె చూపిన పట్టు దల కి కూడా ఆమె ఎంతో సంతోషించింది.


End of Article

You may also like