Ads
అందరి జీవితం లోను పెళ్లి ఎంతో ముఖ్యమైన ఘట్టం.. పెళ్లి తరువాత ఏ జంట అయినా తమకు కలగబోయే సంతానం పై కోటి ఆశలు పెట్టుకుంటుంది. సాధారణం గా మనకు తెలిసిన కపుల్స్ లో కూడా పిల్లలు ఎప్పుడు అని అడుగుతూనే ఉంటాం. అదొక క్యూరియాసిటీ అంతే. అదే సెలెబ్రిటీల విషయం లో ఆ క్యూరియాసిటీ మరింత ఎక్కువ గా ఉంటుంది. ఏ సెలబ్రిటీ జంట అయినా తమ మ్యారేజ్ గురించి ప్రకటించాక, ఆటోమేటిక్ గా వారి కిడ్స్ గురించి కూడా మనం క్యూరియాసిటీ గా ఉంటాం. అలా 2020 లో పేరెంట్స్ గా ప్రమోషన్ పొందిన సెలబ్రిటీ కపుల్స్ ఎవరో చూద్దాం రండి..
Video Advertisement
1. అమృతా రావు
అమృత రావు ‘అతిధి’ సినిమాలో మహేష్ సరసన నటించి అలరించారు. రేడియో జాకీ ఆర్జే అన్మోల్ ను ప్రేమ వివాహం చేసుకున్న ఆమె 2020 నవంబర్ 1 న పండంటి మగబిడ్డకు జన్మనిచ్చి అమ్మ గా ప్రమోషన్ పొందింది.
2. అనిత
‘నువ్వు నేను’ ఫేమ్ అనిత అందరికి గుర్తుండే ఉంటుంది. పెళ్లి అయ్యాక అంత గా లైమ్ లైట్ లోకి రాని అనిత, తన బేబీ బంప్ ఫోటో ను పోస్ట్ చేసి ఒక్కసారి గా వార్తల్లోకొచ్చింది.
3. అనుష్క శర్మ- విరాట్ కోహ్లీ
బాలీవుడ్ మోస్ట్ లవబుల్ కపుల్ అనుష్క శర్మ, విరాట్ కోహ్లీ తాము తల్లితండ్రులు కాబోతున్నాం అని ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. జనవరి లో అనుష్క కు డెలివరీ కానున్న నేపధ్యం లో విరాట్ ఆస్ట్రేలియా టూర్ నుంచి భారత్ కు వచ్చేసాడు. తొందరలోనే వీరికి పండంటి బిడ్డ పుట్టనుంది.
4. ఎమ్మా రాబర్ట్స్ – గారెట్ హెడ్‌ల్యాండ్
ఎమ్మా రాబర్ట్స్ – గారెట్ హెడ్‌ల్యాండ్ లు తొందరలోనే పండంటి బిడ్డకు జన్మనివ్వనున్నారని అమెరికన్ సోషల్ మీడియా లో వార్తలు హల్ చల్ చేస్తున్నాయి.
5. హార్దిక్ పాండ్యా – నటాషా
ప్రముఖ క్రికెటర్ హార్దిక్ పాండ్య తన ప్రేయసి తో నిశ్చితార్ధం చేసుకున్నాక ఆ ఫోటోలను అభిమానులతో పంచుకున్నాడు. అయితే, కరోనా కారణం గా వివాహం వాయిదా పడింది. అయితే, ఇంతలోనే తన ప్రేయసి నటాషా, తానూ తల్లి తండ్రులు కాబోతున్నట్లు హార్దిక్ పాండ్య తెలిపాడు.
6. కరీనా కపూర్
కరీనా కపూర్ సైఫ్ అలీఖాన్ లకు ఇప్పటికే తైమూర్ జన్మించిన సంగతి తెలిసిందే. తైమూర్ కి కూడా గట్టి గానే ఫాలోయింగ్ ఉంది. తాజాగా, లాక్ డౌన్ టైం లో కరీనా తానూ రెండో సారి తల్లి కాబోతున్నట్లు ప్రకటించింది.
7. కిట్ హారింగ్టన్ – రోజ్ లెస్లీ
కిట్ హారింగ్టన్ ,రోజ్ లెస్లీ దంపతులు కూడా తాము తల్లితండ్రులం కాబోతున్నట్లు ప్రకటించారు.
8. వాకిన్ ఫీనిక్స్ – రూనీ మారా
రూనీ మారా, విజేత వాకిన్ ఫీనిక్స్ తమ జీవితం లోకి ఓ బుజ్జి అతిధి రాబోతున్నాడని సోషల్ మీడియా ద్వారా ప్రకటించారు.
9. క్రికెటర్ జహీర్ ఖాన్ – సాగరిక గాడ్జే
క్రికెటర్ జహీర్ ఖాన్ భార్య సాగరిక గాడ్జే కూడా తాము తల్లితండ్రులు కాబోతున్నట్లు తెలిపారు.
10. స్నేహ
తెలుగింటి రాధమ్మ “స్నేహ” మరో సారి తల్లయింది. కిందటి ఏడాది జనవరి 24 పండంటి ఆడపిల్లకు జన్మనిచ్చింది.
11.సంఘవి
ఒకప్పటి టాలీవుడ్ తార సంఘవి..ప్రస్తుతం సినిమాలకు దూరం గా ఉంటోంది. తన 42 సంవత్సరాల వయసు లో ఓ ఆడబిడ్డకు జన్మనిచ్చింది. ఆమె ఫోటో లు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి.
12. శిల్పాశెట్టి
శిల్పాశెట్టి దాదాపు ఎనిమిది సంవత్సరాల తరువాత రెండో సారి మాతృత్వాన్ని అనుభవిస్తోంది. సరోగసి పధ్ధతి ద్వారా ఓ ఆడబిడ్డ కు శిల్పాశెట్టి జన్మనిచ్చింది.
End of Article