Ads
ఒక సినిమా హిట్ అయ్యింది అంటే అది ప్రేక్షకులను అలరించింది అని అర్థం. ఒక పర్టిక్యులర్ జానర్ సినిమా హిట్ అయితే అది మిగిలిన ఫిలిం మేకర్స్ కి ఒక ఉత్సాహం ఇస్తుంది. దీనికి ఉదాహరణ ప్రేమకథాచిత్రం. ఇది హారర్ కామెడీ సినిమా. ప్రేమకథా చిత్రం విడుదలై విజయం సాధించిన తర్వాత, హారర్ కామెడీ సినిమాలు ఎన్ని వచ్చాయో మనందరికీ తెలుసు. అయితే, ఒక సినిమా హిట్ అయిన తర్వాత ఇంకొంతమంది ఫిల్మ్ మేకర్స్ మాత్రం దానికి సీక్వెల్ తీద్దామని నిర్ణయించుకుంటారు. అలా మన తెలుగులో కూడా కొన్ని సినిమాలకి సీక్వెల్స్ వచ్చాయి. కానీ అవి ముందు సినిమాలు ఇచ్చిన ఫలితాలను ఇవ్వలేకపోయాయి. ఆ సినిమాలో ఏవో ఇప్పుడు చూద్దాం.
Video Advertisement
#1 ఆర్య – ఆర్య 2
చాలా మంది ఇప్పటికి కూడా ఈ సినిమా ఎందుకు ఫ్లాప్ అయ్యిందో అని అనుకుంటూ ఉంటారు.
#2 మంత్ర – మంత్ర 2
మంత్ర అలరించిన అంతగా మంత్ర 2 ప్రేక్షకులను అలరించలేకపోయింది.
#3 కిక్ – కిక్ 2
హీరోలోని గ్రే షేడ్ మరీ ఎక్కువగా చూపించడంతో సినిమా అనుకున్న ఫలితాన్ని ఇవ్వలేదు. కానీ మ్యూజిక్ పరంగా టెక్నికల్ పరంగా అయితే కిక్ 2 కి వంక పెట్టడానికి లేదు.
#4 అవును – అవును 2
మొదటి పార్ట్ కి కొనసాగింపుగా సెకండ్ పార్ట్ నడిచినా కూడా, ఈ సినిమా అనుకున్న ఫలితాలను ఇవ్వలేదు.
#5 శంకర్ దాదా ఎంబిబిఎస్ – శంకర్ దాదా జిందాబాద్
రెండవ పార్ట్ కి దర్శకులు మారడం వల్ల మొదటి పార్ట్ లోని పాత్రలు మాత్రమే కంటిన్యూ అయ్యాయి. కానీ సినిమా ఫ్లేవర్ మాత్రం కొంచెం వేరే గానే ఉంటుంది.
#6 సత్య – సత్య 2
శర్వానంద్ హీరోగా వచ్చిన సత్య 2 మిక్స్డ్ టాక్ తెచ్చుకుంది.
#7 మనీ – మనీ మనీ – మనీ మనీ మోర్ మనీ
మనీకి సీక్వెల్ మనీ మనీ ఈ సినిమాకి థర్డ్ పార్ట్ మనీ మనీ మోర్ మనీ. మొదటి రెండూ ఆకట్టుకున్న అంతగా మూడవ భాగం ప్రేక్షకులని ఆకట్టుకోలేకపోయింది.
#8 గబ్బర్ సింగ్ – సర్దార్ గబ్బర్ సింగ్
ఈ సినిమాకి కూడా మొదటి పార్ట్ హరీష్ శంకర్ డైరెక్ట్ చేయగా, రెండవ పార్ట్ బాబి డైరెక్ట్ చేశారు.
#9 మన్మధుడు – మన్మధుడు 2
ఈ సినిమా గురించి మీ అందరికీ తెలిసిందే. ప్రత్యేకంగా మాట్లాడడానికి ఏమీ లేదు.
#10 గాయం – గాయం 2
జగపతి బాబు, రామ్ గోపాల్ వర్మ కాంబినేషన్ లో వచ్చిన గాయం సినిమాకి సీక్వెల్ అయిన గాయం 2 అనుకున్న ఫలితాలను ఇవ్వలేకపోయింది.
#11 ఎవడి గోల వాడిది – బురిడి
రెండు సినిమాలు ఈవీవీ సత్యనారాయణ గారి దర్శకత్వంలోనే వచ్చాయి. సీక్వల్ అయిన బురిడి ఆశించిన ఫలితాలు ఇవ్వలేదు.
#12 పోలీస్ స్టోరీ – పోలీస్ స్టోరీ 2
సాయి కుమార్ బ్లాక్ బస్టర్స్ లో ఒకటైన పోలీస్ స్టోరీకి సీక్వెల్ గా వచ్చిన పోలీస్ స్టోరీ 2 ప్రేక్షకులని ఆకట్టుకోలేకపోయింది.
#13 రఘువరన్ బీటెక్ – విఐపి 2
ఇది డైరెక్ట్ తెలుగు సినిమా కాకపోయినా కూడా, మొదటి సినిమా ఇచ్చిన ఇంపాక్ట్ వల్ల సీక్వెల్ కోసం తెలుగు ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూశారు. కానీ సినిమా అనుకున్న ఫలితాలను ఇవ్వలేదు.
End of Article