19 ఏళ్ల వయసులో లగ్జరీ బైకులపై షికార్లు.. ఇప్పుడేమో పోలిసుల అదుపులో.. అసలు ఏమి జరిగిందంటే..?

19 ఏళ్ల వయసులో లగ్జరీ బైకులపై షికార్లు.. ఇప్పుడేమో పోలిసుల అదుపులో.. అసలు ఏమి జరిగిందంటే..?

by Anudeep

ఈ అమ్మాయి వయసు నిండా పందొమ్మిదేళ్ళు కూడా ఉండవు. కానీ.. ఈ అమ్మాయి చేస్తున్న పనుల గురించి తెలిస్తే షాక్ అవ్వకుండా ఉండలేరు. బైక్స్ పై మోడరన్ గా ఎంతో అందంగా కనిపిస్తున్న ఈ అమ్మాయి గురించి షాకింగ్ విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఆమె గురించి తెలిస్తే.. ఈమె కనిపించినంత అమాయకురాలేమి కాదు అని మీరే అంటారు.

Video Advertisement

ఇంతకీ.. ఈ అమ్మాయి అసలు స్టోరీ ఏంటో చూద్దాం. ఈ అమ్మాయి పేరు రేఖా మీనా. రాజస్థాన్‌లోని కరౌలీ ప్రాంతానికి చెందిన అమ్మాయి. ఆమె చిన్న వయసులో ఉండగానే తల్లి మరణించడంతో ఆమె తండ్రి అల్లారుముద్దుగా పెంచాడు.

rekha meena new

ఓ ప్రైవేట్ స్కూల్ లో కూడా జాయిన్ చేసాడు. కానీ, ఈ అమ్మాయి తండ్రి కోరిక మీద చదువు సాగించలేదు. చదువుపై ఆసక్తి సన్నగిల్లడంతో ఆమె దారి తప్పింది. తప్పుడు మార్గాలను ఎంచుకుని చిన్న వయసులోనే నేరస్తురాలిగా మారిపోయింది. లగ్జరీ బైక్స్ పై తిరగడానికి ఎక్కువ ఆసక్తి కనబరిచింది.

rekha meena 2

ఈమెని పట్టుకోవడానికి పోలీసులకు రెండున్నర నెలలకు పైనే పట్టింది. తప్పుడు మార్గాన్ని ఎంచుకుని నేరాలు చేయడమే కాదు.. సోషల్ మీడియాలో కూడా కొన్ని వీడియోస్ పోస్ట్ చేస్తూ ఆక్టివ్ గా ఉండేది. ఓసారి గన్ తో బాలీవుడ్ పాటకి రీల్స్ ని చేసి ఆ వీడియోస్ కూడా పోస్ట్ చేసింది. ఈ వీడియోస్ కి చాలానే రెస్పాన్స్ వచ్చింది. చాలా మంది రేఖా మీనాకు అనుచరులుగా మారారు. దీనితో ఆమె సెటిల్మెంట్స్ చేయడం కూడా మొదలుపెట్టింది. అందులో వచ్చిన డబ్బుతో జల్సాలు చేయడం మొదలుపెట్టింది. ఖరీదైన లగ్జరీ బైక్స్ ని కొని వాటిపై తిరుగుతూ ఎంజాయ్ చేసేది.

rekha meena 1

అయితే ఆమె సెటిల్ మెంట్స్ తీవ్ర స్థాయికి చేరారు. రేఖా అనుచరులు ఓ వ్యక్తిపై దాడి చేసారు. అతని కుటుంబ సభ్యులని కూడా చావబాదారు. దీనితో పోలీసులు రంగంలోకి దిగారు. ఆమె కోసం అన్ని చోట్ల గాలించారు. దాదాపు రెండున్నర నెలల పాటు శ్రమించి ఆమెని పట్టుకున్నారు. ఆమె వద్ద నుంచి దాదాపుగా 15 తుపాకీలను స్వాధీనం చేసుకున్నారు. ఆమె పై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి, అరెస్ట్ చేసారు.


You may also like