Ads
ఎలక్షన్స్ సమీపిస్తున్న కొద్ది రాజకీయ సమీకరణాలు జోరందుకున్నాయి. పవన్ కళ్యాణ్ విషయానికి వస్తే ఆయన ఎమ్మెల్యేగా బరిలోకి దిగుతారా లేదంటే పార్లమెంటుకి పోటీ చేస్తారా లేదంటే అసెంబ్లీకి పోటీ చేస్తే ఏ స్థానాన్ని ఎంచుకుంటారు లేదంటే గత ఎన్నికలలో భీమవరం నుంచి ఓటమిపాలైన పవన్ ఈసారి కూడా అక్కడ నుంచే పోటీ చేసి సత్తా చాటుతారా అనే చర్చ జరుగుతుంది. అయితే ఇప్పుడు భీమవరంలో రాజకీయ సమీకరణాలు మారుతున్నాయి. పులపర్తి రామాంజనేయులు భీమవరం సీటు కోసం పట్టుబడుతున్నారు. అందుకోసం సీటు ఇస్తే జనసేన తరపు నుంచి అయినా పోటీ చేస్తాను అంటున్నారు. అయితే జనసేన కూడా భీమవరం సీటుని ఆశిస్తోంది.
Video Advertisement
అయితే గత కొంతకాలంగా టీడీపీ కి దూరంగా ఉంటున్న పులపర్తి ఆ పార్టీ కార్యక్రమంలో ఎక్కడా పాల్గొనటం లేదు. ఇటీవల పవన్ కళ్యాణ్ తో భేటీ అయిన ఆయన భీమవరం సీట్ విషయంపై సుదీర్ఘంగా చర్చించారు. పవన్ పోటీ చేయకపోతే తనకి ఆ అవకాశం ఇవ్వాల్సిందిగా ఆయనను కోరినట్లు తెలిపారు. టీడీపీ నుంచి సీటు కష్టమని భావించిన పులపర్తి రామాంజనేయులు గత కొంతకాలంగా జనసేనతో టచ్ లో ఉంటున్నారు. తాడేపల్లి లో జరిగిన జండా సభలో కూడా వేదికపై జనసేనకు కేటాయించిన సీట్లలోనే కూర్చున్నారు.
దీంతో ఆయన జనసేనలో చేరి వచ్చే ఎన్నికల్లో ఆ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు చర్చ జరుగుతుంది. అయితే భీమవరం నుంచి పవన్ కళ్యాణ్ పోటీ చేయాలని కోరుకున్న జనసైనికులు వేరే వారికి అయితే సహకరించేది లేదు అని చెప్తున్నారు. పులపర్తికి టికెట్ ఇవ్వద్దు అంటూ కోరుకుంటున్నారు. దీంతో ఈ సీట్ విషయంలో టీడీపీ, జనసేన కూటమి ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది అనేది ఆసక్తికరంగా మారింది.
అయితే పులపర్తి రామాంజనేయులు కి భీమవరంలో మంచి పట్టు ఉంది. 2009 ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి తొలిసారి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. తర్వాత 2014 ఎన్నికలకు ముందు పులపర్తి టీడీపీ లో చేరి ఆ పార్టీ తరపు నుంచి పోటీ చేసి గెలిచారు. 2019లో మాత్రం టీడీపీ తరఫున పోటీ చేసినప్పటికీ మూడో స్థానంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది.వైసీపీ నుంచి పోటీ చేసిన గ్రంధి శ్రీనివాస్ 2019 ఎన్నికలలో 70,642 ఓట్లు సాధించి 22000 కన్నా ఎక్కువ ఓట్ల మెజారిటీ తో విజయాన్ని అందుకున్నారు. పవన్ కళ్యాణ్ కి 62285 ఓట్లు, పులపర్తి రామాంజనేయులు గారికి 54037 ఓట్లు వచ్చాయి. టిడిపి జనసేన కలిసి పోటీ చేయలేదు కాబట్టి ఓట్లు చీలాయి అని కొందరు అనుకుంటున్నారు. 2019 లోనే టీడీపీ జనసేన కలిసి పోటీ చేసుంటే భీమవరంలో పవన్ కళ్యాణ్ తప్పక గెలిచి ఉండేవారు అని జనసైనికులు అభిప్రాయపడుతున్నారు. మరి ఈసారి ఏం జరుగుతుందో చూడాలి.
End of Article