చంద్రబాబు నాయుడు గారి తల్లిదండ్రులని చూశారా..? వారి పేర్లు ఏంటంటే..?

చంద్రబాబు నాయుడు గారి తల్లిదండ్రులని చూశారా..? వారి పేర్లు ఏంటంటే..?

by Mohana Priya

Ads

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఇటీవల నారా చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేశారు. నారా చంద్రబాబు నాయుడు గారు తెలుగు దేశం పార్టీకి కూడా అధినేతగా ఉన్నారు. ఏప్రిల్ 20 వ తేదీ, 1950 లో తిరుపతి జిల్లాలో ఉన్న నారావారి పల్లెలో చంద్రబాబు నాయుడు గారు పుట్టారు. నారా చంద్రబాబు నాయుడు గారికి నారా రామమూర్తి నాయుడు అనే తమ్ముడు కూడా ఉన్నారు. అంతే కాకుండా ఇద్దరు చెల్లెళ్ళు కూడా ఉన్నారు. తనుండే ఊర్లో స్కూల్ లేకపోవడంతో, చంద్రబాబు నాయుడు గారు శేషాపురంలో ఉన్న ప్రాథమిక పాఠశాలలో ఐదవ తరగతి వరకు చదివారు.

Video Advertisement

chandrababu naidu parents names

చంద్రగిరి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పదవ తరగతి వరకు చదువుకున్నారు. తిరుపతిలో ఉన్న శ్రీ వెంకటేశ్వర ఆర్ట్స్ కాలేజీలో 1972 లో బిఏ డిగ్రీ చేశారు. 1974 లో ప్రొఫెసర్ డా. డి.ఎల్.నారాయణ గారి మార్గదర్శకత్వంలో పి.హెచ్.డి చేయడం మొదలుపెట్టారు. ప్రొఫెసర్ ఎన్ జీ రంగా గారి ఎకనామిక్ ఐడియాస్ అనే అంశం మీద పి.హెచ్.డి చేయడం మొదలుపెట్టారు కానీ ఆ తర్వాత అది పూర్తి కాలేదు. శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీలో మాస్టర్స్ డిగ్రీ చదువుతున్నప్పుడే స్టూడెంట్ యూనియన్ లీడర్ గా నారా చంద్రబాబునాయుడు గారు విధులు నిర్వహించారు. 1975 లో ఇండియన్ యూత్ కాంగ్రెస్‌లో చేరారు. అక్కడ పులిచెర్ల స్థానిక చాప్టర్‌కు అధ్యక్షుడు అయ్యారు. ఆ తర్వాత అంచలంచలుగా ఎదుగుతూ ఇప్పుడు ఈ స్థాయికి చేరారు.

చంద్రబాబు నాయుడు గారి ప్రయాణం మన అందరికీ తెలుసు. అయితే చంద్రబాబు నాయుడు గారి తల్లిదండ్రుల గురించి ఎక్కువ మందికి తెలియదు ఏమో. చంద్రబాబు నాయుడు గారి తండ్రి పేరు నారా ఖర్జూర నాయుడు గారు. చంద్రబాబు నాయుడు గారి తల్లి పేరు అమ్మణమ్మ గారు. చంద్రబాబు నాయుడు గారు ఒక వ్యవసాయ కుటుంబంలో పుట్టారు. చంద్రబాబు నాయుడు గారి తల్లిదండ్రుల ఫోటో కూడా చాలా మందికి తెలియదు. పైన ఉన్న ఫోటో చంద్రబాబు నాయుడు గారి తల్లిదండ్రులది. ఇన్ని సంవత్సరాలు రాజకీయ రంగంలో తాను చేసిన కృషికి చంద్రబాబు నాయుడు గారు ఎన్నో అవార్డులు కూడా అందుకున్నారు.


End of Article

You may also like