ఎంత ఇష్టపడి పెళ్లి చేసుకున్నానో..? ఎందుకు పెళ్లి చేసుకున్నానా అనిపిస్తోంది.. నా సమస్యకి పరిష్కారం చెప్పగలరా…?

ఎంత ఇష్టపడి పెళ్లి చేసుకున్నానో..? ఎందుకు పెళ్లి చేసుకున్నానా అనిపిస్తోంది.. నా సమస్యకి పరిష్కారం చెప్పగలరా…?

by Anudeep

Ads

ప్రేమ అంటే అనిర్వచనీయమైనదంటూ మనం కాలేజీల్లో చదువుకునే రోజుల్లో గొప్ప గా చెప్పుకుంటుంటాం.. కానీ పెళ్లి అయ్యాక అది మీనింగ్ లెస్ అంటూ ఫీల్ అయిపోతూ ఉంటాం. కాలేజీలో చదువుకునే రోజుల్లో చలం బాపతు కవితల్ని రాస్తూ.. నేనో కాళిదాసునన్నట్లు ఫీల్ అయిపోతుండేవాడిని. కానీ పెళ్లి అయ్యాకా..అసలు జీవిత సత్యం బోధ పడింది. నా స్టోరీ చదివి.. నాకో సలహా ఇస్తారని ఆశిస్తున్నాను.

Video Advertisement

husband

నా పేరు అనిల్. ప్రతి చిన్న విషయాన్నీ చూసి ఆనందించే మనస్తత్వం నాది. నా దృష్టిలో ప్రేమ ఎంతో ఉన్నతమైనది. నా లైఫ్ లోకి వచ్చే అమ్మాయిని ఇలా చూసుకోవాలి.. అంత ప్రేమ గా చూసుకోవాలి అని అనుకుంటూ.. గొప్పగా కలలు కన్నాను. కాలేజీ లో ఎందరు అమ్మాయిల్ని చూసినా నా మనసుకేమి పట్టలేదు.. చదువైపోయి.. మంచి జాబ్ లో సెటిల్ అయిపోయి నా జీవితం లోకి రాబోయే మహారాణి కోసం ఎదురు చూస్తూ ఉన్న సమయం లో మా ఇంట్లో వాళ్ళు నన్ను పెళ్లి చూపులకు తీసుకెళ్లారు. తొలిచూపులోనే ఆమె నాకు బాగా నచ్చేసింది. పెద్ద ఇబ్బందులేవీ లేకుండానే మా పెళ్లి జరిగిపోయింది. పెళ్లి చూపులోనే ఆమెతో ప్రేమలో పడిపోయాను..

husband 2

ఆమె గురించి తెలుసుకోవాలని, ఆమెతో కలిసి సమయం గడపాలని, ఊసులాడుకోవాలని ఇలా ఎన్నో కలలు కన్నాను. తీరా పెళ్లి అయిన నెల రోజులకే నా కలలన్ని కల్లలని తెలిసొచ్చింది. పైకి విరబూసిన తామరపువ్వు లోపలేమో కుళ్లిపోయిన ఆకులాంటి మనస్తత్వం తనది. మాట కి మాట..చివరకు గొడవలు తప్ప మా సంసారం లో సంతోషమే లేదు. ఇద్దరిదీ ఒకే ఊరు కావడం తో ప్రతి చిన్న విషయానికి, ఆమె ఇల్లు వదిలి పుట్టింటికి వెళ్లిపోయేది. నా పైనా.. నా తల్లితండ్రులపైనా అందరికీ లేని పోనీ చాడీలు చెబుతుండేది. చివరకు మా ఇంటికి ఎవరైనా చుట్టాలు వచ్చినా.. వారిని కూడా మా ముందే అనరాని మాటలు అనేది.

 

ఎందుకిలా చేస్తున్నావ్ అని నిలదీస్తే.. మా పై గృహ హింస చట్టం కింద కేసు పెడతానని బెదిరించేది. తనని దారికి తెచ్చుకోవాలని ప్రయత్నించి..ఇప్పటికి నాలుగేళ్లు గడిచిపోయింది. కాపురమే చెయ్యని అమ్మాయితో పిల్లలని కనడం సాధ్యమేనా.. ఇరుగు పొరుగు అంతా… పెళ్ళై నాలుగేళ్లవుతున్నా పిల్లలు లేరేంటి..? అన్న ప్రశ్నలు వేస్తుంటే భరించలేకపోతున్నాను.

పోనీ ఇష్టం లేని పెళ్లి ఎందుకు అని..విడాకులు అడిగాను.. అందుకు కూడా ఆమె ఒప్పుకోలేదు. ఇటు సంసారము చెయ్యదు.. అటు విడాకులూ ఇవ్వదు.. ఎంత ఇష్టపడి పెళ్లి చేసుకున్నానో.. అసలెందుకు పెళ్లి చేసుకున్నానా అని అనిపించేలా చేసింది. అసలు ఈ పరిస్థితుల్ని, ఈ సంసారాన్ని వదిలేసి, బయటపడి ప్రశాంతం గా బతకాలని ఉంది.. ఇందుకు నేను ఏమి చేయాలి.. నాకు ఏదైనా సలహా ఇవ్వగలరు.

NOTE: All the images used in this article are just for representative purpose only. But not the actual characters.


End of Article

You may also like