Ads
భారతదేశంలో రోడ్ల గురించి చెప్పాల్సిన అవసరం లేదు. స్పీడ్ బ్రేకర్లు ప్రత్యేకంగా పెట్టాల్సిన అవసరం లేకుండానే సహజంగానే ఏర్పడతాయి. అంటే ఇదేమి మ్యాజిక్ కాదు. మట్టి రోడ్లు ఆ విధంగా ఉంటాయి అని అర్థం. సరే అని ఒకవేళ రోడ్లు వేయించినా కూడా మన ప్రజలు రూల్స్ ఫాలో అవకుండా వాళ్లే వాళ్లకి సౌకర్యంగా ఉండేలా రూల్స్ ఏర్పాటు చేసుకుంటారు.
Video Advertisement
ఫోన్లో మాట్లాడుతూ డ్రైవింగ్ చేయడం, దాంతో బండ్లు అదుపు తప్పడం, ఒక బండి మోసే బరువు కంటే ఎక్కువ బరువు దానిమీద పెట్టడం. రాష్ డ్రైవింగ్, ఇంకా బస్సుల లో అయితే మనుషులు పట్టకపోయినా ఇరుక్కొని మరి ఎక్కుతారు. ఫుట్ బోర్డింగ్ కూడా చేస్తారు. ఎప్పుడైనా నిండి ఉన్న బస్సు ను చూశారా. బరువు వల్ల ఒక వైపుకి ఒంగిపోయి ఉంటుంది.
ఇవన్నీ ప్రమాదకరం. ప్రభుత్వం కూడా ఇప్పుడు స్ట్రిక్ట్గా చర్యలు తీసుకుంటున్నారు. కానీ ఇలా ఎదుటివారికి ప్రమాదం కలిగించేలా కాకపోయినా వాహనాలను కొంచెం వింతగా వాడే మనుషులు కూడా ఉంటారు. అంతేకాకుండా రోడ్లు, బ్రిడ్జీలు లాంటి వాటిని తమకు అనుగుణంగా వాడుకుంటారు.వాటికి కొన్ని ఉదాహరణలు ఇప్పుడు చూద్దాం.
#1 ఎవరు చెప్పారు సాహస వీరులు పురాతన కాలంలోనే ఉండేవాళ్ళు అని. బహుశా వాళ్ళు ఇతని చూసి ఉండరు.
#2 ఈ మిత్రుడికి నిజంగానే వేచిచూసే అంత సమయం లేదు.
#3 ఓహో! ఒక బండి మీద ముగ్గురు కూర్చోవాలంటే ఇలా కూడా కూర్చోవచ్చు అన్నమాట
#4 ఆటో ముందా? స్కూటీ ముందా?
#5 ఆ ఇటుకలతో గోడ అలా కడతానని మనందరికీ చూపిస్తున్నాడు.
#6 ఇలాంటివి ఏమైనా జరిగితే అందరికీ తెలిసేలా చేయడం సోషల్ రెస్పాన్సిబిలిటీ. కాదు కాదు “సోషల్ మీడియా” రెస్పాన్సిబిలిటీ.
#7 ఎందుకు అలా చూస్తున్నారు? అవి మన పూర్వీకులు తెలుసా?
#8 అంటే ట్రాలీ కూడా ఒక టు వీలరే కదా?
#9 బెంజ్ అయినా బస్ అయినా ట్రాఫిక్ లైట్ చెప్తే ఆగాల్సిందే.
#10 ఓడలు బళ్ళు అవుతాయి బళ్ళు ఓడలు అవుతాయి అంటారు కదా. దాంట్లో బండ్లు ఓడలు అవ్వడం అంటే ఇదే.
#11 ఇప్పుడు ఆ అమ్మాయి రిక్షా సహాయంతో వచ్చింది కదా? రిక్షా అతను ఆ అమ్మాయి దగ్గర డబ్బులు తీసుకుంటాడు అంటారా?
#12 స్పీడ్ తగ్గించడానికి స్పీడ్ బ్రేకర్ కట్టమంటే ఏకంగా బండినే ఆపేసే స్పీడ్ బ్రేకర్ కట్టారు.
#13 రోడ్డు మీద దీపాలు వెలిగించలేదు. అది ట్రాఫిక్ జామ్.
#14 ఆటోలలో నేనా ఇలా ఇరుక్కుని కూర్చునేది?
#15 బండా? ప్రిటెండింగా? ఏం ఆపాలి ?
#16 ఇంకేంటి? నెక్స్ట్ ఏసీ ఏ గా?
#17 ఇదేంటి? బస్సుల కోసం తయారుచేసిన హెల్మెట్టా?
#18 ఎటు వెళ్లాలో సరిగ్గా చెప్పకపోతే ఎలా వెళ్తారు?
#19 మిషన్ మంగళ్ యాన్ 2
#20 వాట్ యాన్ ఐడియా సర్దార్ జీ!
#21 ఇంకొద్దిగా పెట్రోల్ ధరలు పెరిగితే అందరూ ఇదే పని చేస్తారు
#22 నిజంగానే చాలా సీరియస్ విషయం చెప్పారు కాబట్టి నో కామెంట్స్.
#23 ఎవరు లిఫ్ట్ అడిగారు అన్నది ముఖ్యం కాదు. లిఫ్ట్ ఇచ్చామా లేదా అనేదే ముఖ్యం.
#24 ఈ సార్ కి పెట్రోల్ పోస్తే డబ్బులు ఇవ్వరు.
#25 పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఈజ్ ఫర్ ఎవ్రీ వన్.
End of Article