Ads
మనం ఏదైనా ప్రదేశానికి టూర్ కి వెళ్ళినపుడు అక్కడ చౌక గా దొరికే వాటిని కొని తెచ్చేసుకుంటాం. అయితే ఏదైనా శృతి మించకుండా చూసుకుంటాం. ఎందుకంటే, మనం ఆల్రెడీ ఎంతో కొంత లగేజీ ను తీసుకు వెళ్తాము. ఇంకా ఏమైనా కొంటె.. వాటిని తిరిగి మోసుకు రావడం కష్టం కాబట్టి, చూసుకుని కావాల్సినవి మాత్రమే కొనుక్కుంటూ ఉంటాం.
Video Advertisement
ఇంకో రీజన్ ఏంటి అంటే.. మనం విదేశాలకు వెళ్ళినపుడు అక్కడ లగేజి ఛార్జెస్ కూడా చెల్లించాల్సి ఉంటుంది. ఇవంతా కలిసి ఖర్చు తడిసి మోపెడవుతుంది. అయితే, ఈ ఖర్చులను తగ్గించుకోవడానికి ఒక్కొక్కరు ఒక్కొక్కలా ప్రయత్నాలు చేస్తారు. కానీ, చైనా యునాన్ ప్రావిన్స్ కు వచ్చిన ప్రయాణికులు చేసినట్లు గా మరెవరు చేయలేరేమో. చైనా యునాన్ ప్రావిన్స్ లో ఓ నలుగురు స్నేహితులు వారి ప్రయాణం కోసం ఎయిర్ పోర్ట్ కు చేరుకున్నారు.వాంగ్ అనే వ్యక్తి స్నేహితులతో పాటు గా కున్మింగ్కు బిజినెస్ పని మీద వచ్చాడు.
అయితే, అక్కడ నారింజలు చాలా చౌక గా లభించాయి. 50 యువాన్లకే 30 కిలోల ఆరెంజ్లు దొరుకుండడం తో, వారు నలుగురు కలిసి కొనేసుకున్నారు. అంతవరకు బాగానే ఉంది. అక్కడే వచ్చింది అసలు చిక్కు. వాటిని మోసుకెళ్ళడం ఒక బాధ అయితే, వాటికి లగేజి చార్జీలు కట్టడం మరో బాధ. 300 యువాన్లను ఛార్జీలుగా చెల్లించాలని అక్కడి అధికారులు చెప్పడం తో షాక్ అవడం వారి వంతు అయింది.
దాదాపు ఆరు రేట్లు ఎక్కువ చెల్లించి వాటిని మోసుకెళ్ళ్లాల్సి ఉంటుంది. దీనితో వారు అక్కడే కూర్చుని వాటిని తినడం మొదలు పెట్టారు. ఉన్న అరగంట టైం లో ఆ 30 కేజీల నారింజలను తినేశారు. వారి నోరు పుండు పడిపోయింది కూడా. ఇక జీవితం లో మళ్ళీ నారింజలను తినమని వాంగ్ చేతులెత్తేశాడు. అదండీ సంగతి.. అందుకే ఎప్పుడు “అతి సర్వత్ర వ్యర్జయేత్” అన్న వాక్యాన్ని గుర్తు పెట్టుకోవాలి. అంటే, అన్ని చోట్లా అతిని పక్కన పెట్టాలి అని అర్ధం. ఈ వీడియో ఇప్పుడు నెట్టింట్లో వైరల్ అవుతోంది. అయితే, ఇంత కష్టపడే బదులు నలుగురు కలిసి వాటిని నాలుగు భాగాలు గా చేసుకుని క్యాబిన్లో తీసుకుని వెళ్లిపోవడం తేలిక కదా అని నెటిజన్లు కామెంట్ లు చేస్తున్నారు.
End of Article