Ads
అభిజిత్.. బిగ్ బాస్ కి ముందు ఈ పేరు యూత్ కి మాత్రమే పరిచయం. లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ లో కనిపించిన తరువాత అభిజిత్ పెద్ద గా సినిమాల్లో కనిపించలేదు. పెళ్లి గోల అనే వెబ్ సిరీస్ తో యూత్ లో మంచి క్రేజ్ ను సొంతం చేసుకున్నాడు. ఆ పాపులారిటీ నే అతన్ని బిగ్ బాస్ హౌస్ కి తీసుకొచ్చింది. చాలా తెలివైనవాడు తను. హౌస్ లో కి వచ్చే ముందే తానూ గెలుస్తాను..గెలవాలి అని ఫిక్స్ అయిపోయాడు. ఆ స్పిరిట్ ను గేమ్ చివరి వరకు చూపించాడు. ఓట్ల కోసం తాను ముందే బయట టీం ను సిద్ధం చేసి పెట్టుకున్నాడని, ఇలా రకరకాలుగా కధనాలు వచ్చాయి. తాను ముందు గా టీం ని పెట్టుకున్నా కూడా.. ఆటలో నాణ్యతను కనబరిచాడు.
Video Advertisement
ఎదో ఆడుతున్నాం.. అన్నట్లు ఉండదు అభిజిత్ ఆట. పైకి చాలా కూల్ గా కనిపిస్తూ బిగ్ బాస్ ఏ టాస్క్ ను ఇచ్చిన 100 % దాని వెనక ఉన్న లాజిక్ లను అంచనా వేస్తూ ముందుకెళ్లాడు తను. ఒక దశ లో బిగ్ బాస్ కె అభిజిత్ సవాల్ గా మారాడు. కొన్ని టాస్క్ లను అసలు చేయను అని ముక్కు సూటి గా చెప్పేసాడు. కూల్ నెస్, ధైర్యం, నిజాయితీ, వీటన్నిటిని మించి తెలివితేటలు.. ఇక అభిజిత్ కి తిరుగులేదు. అతని ఆట తీరు నచ్చి ఎందరో అతనికి ఫాన్స్ అయిపోయారు.
టాస్క్ లు సరిగా ఆడలేదంటూ చాలా విమర్శలు వచ్చాయి తనమీద. తాను తెలివి గా ఆడాడు. కండబలం అవసరమైన చోట మాత్రమే వాడాడు. చాలా సందర్భాల్లో “దట్ ఈజ్ అభిజిత్” అని సగటు బిగ్ బాస్ ప్రేక్షకుడికి అనిపించక మానదు. ఇవే అతన్ని విన్నర్ గా నిలబెట్టాయి. అభిజిత్ విన్నర్ గా నిలవడానికి గల కారణాలను మనం ఇక్కడ ప్రస్తావించుకుందాం.
హౌస్ లోకి వచ్చినప్పటి నుంచి చివరి నిమిషం వరకు అభిజిత్ తన కళ్ళల్లో కాన్ఫిడెంట్ గానే ఉన్నాడు. ఎన్ని గొడవలు వచ్చినా అవసరమైనంతవరకు ఆర్గ్యుమెంట్ చేసి తప్పుకున్నాడు. తన స్పిరిట్ ను కోల్పోలేదు. చివరకు హౌస్ నుంచి పంపించేస్తున్నాం అని బిగ్ బాస్ అభిజిత్ ఫోటో ను తగలబెట్టేసినపుడు కూడా “దిస్ఈజ్ నాట్ ఎండ్” అంటూ తనదైన శైలిలో అభిజిత్ నిలబడ్డాడు. అక్కడే అభిజిత్ ప్రేక్షకులకు మరింత లోతు గా కనెక్ట్ అయ్యాడు.
#1. నడక దగ్గరనుంచి మాట తీరు వరకు అభిజిత్ హుందాతనాన్ని కనబరిచాడు. తాను విజేతను అవుతాను అన్నఆత్మవిశ్వాసం తో ఎక్కడ పొగరు ను ప్రదర్శించలేదు. హుందా గానే ప్రవర్తించాడు.
#2. ఇంకా, ప్రతి టాస్క్ లో తెలివి గా ఆడటం. బిగ్ బాస్ ఏదైనా టాస్క్ ఇస్తే ఎందుకు ఇచ్చాడు. దీనివలన నా క్యారెక్టర్ ఎలా డిస్ ప్లే అవుతుంది అన్న మినిమం సెన్స్ ను అభిజిత్ కనబరిచాడు. తన ఇమేజ్ ను కాపాడుకుంటూ తెలివి గా ఆడుతూ వచ్చాడు.
#3. ఎక్కడైనా పొరపాటు చేసాను అనిపించినపుడు.. దానిని వెంటనే గుర్తించేసి క్షమాపణ చెప్పడమో, లేక సరిదిద్దుకోవడమో చేసేవాడు. అభిజిత్ కి పట్టుదల వుంది. కానీ మొండి వైఖరి లేదు. ఆ రెండిటికి తేడా స్పష్టం గా తెలిసిన వాడు అభిజిత్.
#4. తనకు జరిగిన డామేజ్ ను వెంటనే గుర్తించాడు. మోనాల్ తో లవ్ ట్రై యాంగిల్ నడుస్తున్నపుడు జనం లోకి తన ఇమేజ్ ఎలా వెళ్తోందో త్వరగా గుర్తించగలిగాడు. వెంటనే ఆ తప్పు జరగకుండా ఎస్కేప్ అవ్వగలిగాడు. నాకు ఈ ట్రై యాంగిల్ వద్దు అంటూ క్లియర్ కట్ గా చెప్పగలిగాడు.
#5. తన తోటి కంటెస్టెంట్ లకు ధైర్యం నూరిపోశాడు. తనకు నచ్చిన వాళ్ళు, నచ్చని వాళ్ళు అనే తేడా లేకుండా కష్టం గా అనిపించినపుడు అందరికి తోడు గా ఉన్నాడు. అంతటి హుందా వ్యక్తిత్వమే అతన్ని విజేత గా నిలిపింది.
End of Article