70 ఏళ్ల వయసులో సైకిల్ పై గడ్డిమోపు తెచ్చి…కష్టాలున్నాయనుకునే ప్రతి ఒక్కరు ఈ బామ్మ గురించి చదవండి!

70 ఏళ్ల వయసులో సైకిల్ పై గడ్డిమోపు తెచ్చి…కష్టాలున్నాయనుకునే ప్రతి ఒక్కరు ఈ బామ్మ గురించి చదవండి!

by Mohana Priya

Ads

ఎగ్జామ్స్ లో ఫెయిల్ అయితే సూసైడ్. ప్రేమ విఫలమైతే సూసైడ్. జీవితంలో ఏం చేయాలో అర్థం కాక పోతే సూసైడ్. సూసైడ్ చేసుకోవడానికి రకరకాల కారణాలున్నాయి. కొంతమంది బెదిరించడానికి కూడా సూసైడ్ కారణం వాడతారు. అది వేరే విషయం. ఎవరైనా మనల్ని బలవంతంగా మనకు ఇష్టం లేని పనిచేయిస్తే వాళ్లకి మనకు ఇష్టం లేదని చెప్తాం, కోపం ఎక్కువ అయితే తిడతాం.

Video Advertisement

representative image

అలా బలవంతంగా ఇష్టం లేని పని చేయలేని మనం క్షణికావేశం లో బలవంతంగా మనల్ని మనమే చంపుకుంటున్నాం. ఒక్కసారి మనం అనుకున్నది అనుకున్నట్టు అవ్వకపోతే జీవితమే అయిపోయింది అన్ని రేంజిలో బాధపడతాం.ఒక్కసారి ఎల్లమందమ్మ కథ వింటే మనిషి తలుచుకుంటే కచ్చితంగా ఎన్ని రోజులైనా కష్టపడుతూ బతకగలడు అని అనిపిస్తుంది.

ఎల్లమందమ్మ వయసు 70 సంవత్సరాలు. అంత వయసు వాళ్ళు మామూలుగా నడవడమే కష్టం. కానీ ఎల్లమందమ్మ సైకిలే నడుపుతుంది. అలా  తను నివాసముండే గుంటూరు నుండి సైకిల్ మీద నాలుగు కిలోమీటర్లు ప్రయాణించి, గడ్డిమోపు ను తీసుకొచ్చి వంద రూపాయలకు అమ్ముతుంది. ఇలా ఎల్లమందమ్మ నాలుగు సంవత్సరాల నుండి చేస్తుంది.

representative image

దారి మధ్యలో సైకిల్ తొక్కడానికి రోడ్డు సరిగా లేకపోవడంతో, రోజుకి మూడు రైళ్లు మాత్రమే ప్రయాణించే తెనాలి స్టేషన్ రైలు పట్టాల మీద సైకిల్ని తోసుకుంటూ తీసుకెళుతుంది. ఎల్లమందమ్మ కి ఒక కొడుకు ఉన్నాడు. అతను తనని చూసుకుంటాను అని చెప్పినా కూడా తనకి శక్తి ఉంది, ఓపిక ఉంది, ఉపాధి కూడా ఉంది తన పని తను చేసుకునే ధైర్యం ఉంది అని అతని సహాయం తీసుకోకుండా జీవనం సాగిస్తోంది ఎల్లమందమ్మ.

డెబ్భై ఏళ్ళు అయినా తన పని తాను చేసుకుంటూ ఎవరి మీదా ఆధారపడకుండా బ్రతుకుతున్న ఎల్లమందమ్మ కథ విన్న ప్రతి ఒక్కరికి ఆవిడ కాళ్ళకి నమస్కరించాలని ఉంటుంది. ఒకసారి మీరే ఆలోచించండి. అనుకున్నది అవ్వకపోతే చనిపోవాలా? ఇన్ని రోజులు ప్రయత్నించినవాళ్ళం ఇంకా కొన్ని రోజులు ప్రయత్నించలేమా? మన లక్ష్యాన్ని వదలకుండా అలాగే గట్టిగా ప్రయత్నిద్దాం.

సమయం అంటూ ఒకటి ఉంటుంది. మనకి నచ్చినప్పుడు కాదు అది రావాల్సి వచ్చినప్పుడు వస్తుంది అన్నమాట మీరు చాలా సార్లు వినే ఉంటారు. కానీ అదే నిజం. ఇది దృష్టిలో పెట్టుకొని మీ ప్రయత్నం లో ఎటువంటి లోపం లేకుండా ప్రయత్నించండి. ఎప్పుడైనా మీకు నిరాశ గా అనిపిస్తే ఎల్లమందమ్మ కథని గుర్తు తెచ్చుకోండి. ఆవిడని స్పూర్తిగా తీసుకొని మళ్లీ లేచి కష్టపడి మీ లక్ష్యం కోసం పని చేయండి.

 


End of Article

You may also like