Ads
సినిమాల విషయంలో ప్రేక్షకుల అభిప్రాయం గత కొద్ది కాలంగా చాలా డిఫరెంట్ గా ఉంటుంది. కాన్సెప్ట్ నచ్చితే చాలు అది ఏ జోనర్ చిత్రమైన విపరీతంగా ఆదరిస్తున్నారు. ముఖ్యంగా చాలామంది ఇంటి వద్దనే సుఖంగా కూర్చుని ఓటీటీలో డిఫరెంట్ జోనర్స్ కు సంబంధించిన సినిమాలు, వెబ్ సిరీస్ చూడడానికి ఉత్సాహం చూపిస్తున్నారు. ఇది అర్థం చేసుకున్న డైరెక్టర్స్ కూడా విభిన్నమైన కాన్సెప్ట్స్ తో చిత్రాలను తెరకెక్కిస్తున్నారు.
Video Advertisement
ఇలా టైం ట్రావెలింగ్ నేపథ్యంలో తెరకెక్కిన సరికొత్త కాన్సెప్ట్ చిత్రం 7:11 PM అప్పుడే ఓటీటీలోకి వచ్చేసింది.
తెలుగులో సైన్స్ ఫిక్షన్, టైం ట్రావెల్ కాన్సెప్ట్ తో వచ్చిన సినిమాలు చాలా తక్కువ అని చెప్పవచ్చు.ఆదిత్య 369, సూర్య 24, ప్రశాంత్ వర్మ అ!, ఒకే ఒక జీవితం, బింబిసార.. ఇలా టైం ట్రావెల్ కాన్సెప్ట్ తో వచ్చిన చిత్రాలలో చాలా వరకు సక్సెస్ సాధించాయి. ఇదే నేపథ్యంలో జూలై 7న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన 7:11 PM సినిమా మిశ్రమ ఫలితాన్ని సొంతం చేసుకుంది.
ఆకట్టుకునే అంశాలు ఉన్నప్పటికీ కూడా ఈ చిత్రానికి ఓవరాల్ గా మిక్స్డ్ టాక్ వచ్చింది. ఈ మూవీకి సంబంధించి ఓటీటీ స్ట్రీమింగ్ గురించి కూడా ఎటువంటి ప్రకటన రాలేదు. ఈ నేపథ్యంలో సడన్గా ఇప్పుడు ఇది అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ సిద్ధమైంది అన్న వార్త వైరల్ అయింది. కొన్ని సినిమాలు స్క్రీన్ పైన పెద్దగా ఆడకపోయినా ఓటీటీ లో మాత్రం మంచి రెస్పాన్స్ తెచ్చుకుంటాయి. మూవీ కూడా అదే కేటగిరీకి వస్తుంది అని పలువురు ఆశిస్తున్నారు.
End of Article