Ads
- చిత్రం : 777 చార్లీ
- నటీనటులు : రక్షిత్ శెట్టి, చార్లీ, సంగీత శృంగేరి.
- నిర్మాత : రక్షిత్ శెట్టి, జిఎస్ గుప్తా
- దర్శకత్వం : కిరణ్ రాజ్ కె
- సంగీతం : నోబిన్ పాల్
- విడుదల తేదీ : జూన్ 10, 2022
స్టోరీ :
Video Advertisement
ధర్మ (రక్షిత్ శెట్టి) ఒక సాధారణ జీవితం గడిపే వ్యక్తి. అలాంటి వ్యక్తి జీవితంలోకి చార్లీ (చార్లీ) వస్తుంది. వారిద్దరూ కలిసి చేసిన పనులు ఏంటి? చార్లీ వచ్చాక ధర్మ జీవితం ఎలా మారుతుంది? వారిద్దరికీ స్నేహం ఎలా ఏర్పడింది? వారిద్దరూ ఒకరికొకరు ఎలా సహాయ పడ్డారు? ఇలాంటివన్నీ తెలియాలంటే మీరు సినిమా చూడాల్సిందే.
రివ్యూ :
కన్నడలో ఎంతో పేరు సంపాదించుకున్న స్టార్ హీరో రక్షిత్ శెట్టి. కిరిక్ పార్టీ సినిమాతో తెలుగు వారికి కూడా రక్షిత్ శెట్టి సుపరిచితులు అయ్యారు. రక్షిత్ శెట్టి హీరోగా నటించిన అతడే శ్రీమన్నారాయణ పాన్ ఇండియన్ సినిమాగా విడుదల అయ్యింది. ఇప్పుడు ఈ సినిమా కూడా పాన్ ఇండియన్ సినిమాగా విడుదల అయ్యింది. ఒక మనిషికి, ఒక కుక్కకి మధ్య ఉండే స్నేహం ఎంత స్వచ్చంగా ఉంటుందో ఈ సినిమాలో చూపించారు.
సినిమాలో ఎమోషనల్ సీన్స్ చాలా ఉన్నాయి. చాలా సీన్స్ చూస్తూ ఉంటే నిజంగా ఒక జంతువు ప్రేమ ఇంత స్వచ్ఛంగా ఉంటుందా అని అనిపిస్తూ ఉంటుంది. సినిమాలో హీరో హీరోయిన్స్ రక్షిత్ శెట్టి, చార్లీ ఏమో అని అనిపిస్తూ ఉంటుంది. వారిద్దరి మధ్య వచ్చే సీన్స్, అలాగే వారి కెమిస్ట్రీ కూడా అంత బాగుంది. అక్కడక్కడా కొన్ని సీన్స్ అనవసరంగా ఉన్నాయేమో అనిపించినా కూడా, సినిమా మొత్తం ఎక్కడా బోర్ కొట్టకుండా ఉంటుంది.
ప్లస్ పాయింట్స్ :
- హీరోకి, చార్లీకి మధ్య వచ్చే సీన్స్
- నిర్మాణ విలువలు
- అక్కడక్కడ వర్కౌట్ అయిన కామెడీ
- ఎమోషనల్ సీన్స్
మైనస్ పాయింట్స్:
- అనవసరంగా ఉన్నాయి అనిపించే కొన్ని సీన్స్
రేటింగ్ :
3/5
ట్యాగ్ లైన్ :
అక్కడక్కడా కొన్ని సీన్స్ ల్యాగ్ అయినట్టు ఉన్నా కూడా ఎక్కడా బోర్ కొట్టదు. 777 చార్లీ సినిమా ఒక మంచి ఎమోషనల్ విలువలు ఉన్న సినిమాగా నిలుస్తుంది.
End of Article