భారత దేశం ఒకప్పుడు ఉమ్మడి కుటుంబ వ్యవస్థతో వెలుగుతూ ఉండేది. కాలం మరే కొద్ది మారుతున్న పరిస్థితులు,  అవసరాల వల్ల ఉమ్మడి కుటుంబం అనేది విఛ్చిన్నమైంది. బంధాల మధ్య అడ్డుగోడలు ఏర్పడ్డాయి. అపార్థాలతో గొడవలు మొదలై  పరువు, ప్రతిష్ట అనుకుంటూ గిరి గీసుకుని బ్రతుకుతున్నారు. ఇంకా పగ, ప్రతీకారాలతో రగిలిపోతూ  తమకు తామే మనశ్శాంతిని దూరం చేసుకున్నారు.

Video Advertisement

ప్రాథమిక కుటుంబంలో కూడా ఎవ్వరికి పడడం లేదు. అన్న దమ్ములు, అక్కా తమ్ముడు, అన్నా చెల్లెల మధ్య ఉండే సంబంధాలు తెగిపోతున్నాయి. ఇటీవల విడుదల అయిన ఒక చిత్రం చాలా మందిని ప్రభావితం చేసింది. ఆ మూవీని చూసిన చాలా మంది తమ మధ్య ఉన్న పగ, కోపం మర్చిపోయి కలిసిపోతున్నారు. ఆ చిత్రమే బలగం. ఈ చిత్రంలో కుటుంబ సభ్యుల మధ్య బంధాలు, బంధుత్వం గురించి చక్కగా చూపించారు.
తాజాగా ఈ చిత్రం పగతో పదిహేనేళ్ళ పాటు కనీసం ఒకరి ముఖం ఒకరు చూసుకొని దాయాదుల ఫ్యామిలీని కలిపింది సంగారెడ్డి జిల్లాలో ఈ సంఘటన జరిగింది. సంగారెడ్డి జిల్లాలో మాసన్ పల్లి చెందిన ఎనిమిది నాయి బ్రాహ్మణ కుటుంబాలు ఊర్లో ఉండే సమయంలో ఇంటి స్థలాల, భూ తగాదాలతో ఏర్పడిన పగతో దూరంగా ఉండే వారు. అయితే  వారి పరిస్థితులు బాలేక కొంతమంది హైదరాబాద్ నగరానికి వలస వెళ్లారు. అక్కడే బ్రతుకుతూ ఎవరికి వారు ఉండేవారు. పెద్దవాళ్లే కాకుండా  పిల్లలు కూడా పగతో, కక్షతో దూరంగా ఉండేవారు. ఈక్రమంలో ఇటీవల విడుదలైన బలగం సినిమాను చూశారు. ఈ చితంలో గ్రామీణ ప్రాంతాల్లోని పరిస్థితుల గురించి  తీసిన విషయం అందరికి తెలిసిందే. వీరంతా ఈ చిత్రంలోని సన్నివేశాలను చూసి చలించి, ఇ న్నేళ్ళు అర్ధం లేని పగ పెంచుకుని తప్పు చేశామని తెలుసుకున్నారు. అంతా కలసి హైదరాబాద్‌లో నుండి తమ సొంతూరు మాసన్ పల్లికి సోమావారం వెళ్లారు. దాయాదుల కుటుంబాల వారంతా కలసి ఉండాలని నిర్ణయించుకున్నారు. మంగళవారం నాడు అందరూ విందు చేసుకున్నారు. బలగం మూవీ తీసిన వారికి కృతజ్ఞతలు తెలిపారు.

Also Read: “సమంత” తో పాటు… “శకుంతల” పాత్రలో నటించిన 10 హీరోయిన్స్..!