“సమంత” తో పాటు… “శకుంతల” పాత్రలో నటించిన 10 హీరోయిన్స్..!

“సమంత” తో పాటు… “శకుంతల” పాత్రలో నటించిన 10 హీరోయిన్స్..!

by kavitha

Ads

సమంత ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం ‘శాకుంతలం’. డైరెక్టర్ గుణశేఖర్‌ ఈ చిత్రానికి దర్శకతవం వహించాడు. మహా కవి కాళిదాసు ఐదవ శతాబ్దంలో రచించిన అభిజ్ఞాన శాకుంతలం కథ ఆధారంగా గుణశేఖర్ ఈ సినిమాని తెరకెక్కించాడు. నీలిమ గుణ, దిల్ రాజు ఈ మూవీని భారీ బడ్జెట్ తో ప్రతిష్టాత్మకంగా నిర్మించారు.

Video Advertisement

ఈ సినిమా ద్వారా మలయాళ నటుడు దేవ్ మోహన్ టాలీవుడ్ లో ఎంట్రీ ఇస్తున్నాడు.ఈ సినిమా ఏప్రిల్ 14న తెలుగు, తమిళ, కన్నడ,మలయాళ, హిందీ భాషల్లో ఏకకాలంలో విడుదల కానుంది. ఈ నేపద్యంలో సమంత తన సోషల్ మీడియా ఖాతాలో తన కన్నా ముందు శకుంతల పాత్రను పోషించిన నటీమణులకు సంబంధించిన ఫోటోను షేర్ చేసింది. మరి సమంతాకన్నా ముందు శకుంతల పాత్రలో వివిధ భాషలలో నటించి, ఆకట్టుకున్న హీరోయిన్స్ ఎవరో ఇప్పుడు చూద్దాం..
9-heroines-played-shakuntala-role1. డోరతి కింగ్డన్ – శకుంతల:
సుచేత్ సింగ్ దర్శకత్వంలో తెరకెక్కిన శకుంతల సినిమాలో ‘డోరతి’శకుంతలగా నటించారు.1920 లో వచ్చిన ఈ చిత్రం హిందీలో తెరకెక్కింది.
2. కమలాబాయి – శకుంతల:
సర్వోత్తం బాదామి దర్శకత్వం వహించిన శకుంతల తెలుగు చిత్రంలో కమలాబాయి శకుంతల పాత్రలో నటించారు. ఈ చిత్రం 1932 లో రిలీజ్ అయ్యింది.
3. MS సుబ్బులక్ష్మి – శకుంతలై:
తమిళంలో ఎల్లిస్ ఆర్ దుంగన్ దర్శకత్వం వహించిన శకుంతలై సినిమాలో MS సుబ్బులక్ష్మి శకుంతలగా నటించారు. ఈ చిత్రం 1940 లో విడుదల అయ్యింది.
4. జయశ్రీ – శకుంతల:
హిందీలో వి శాంతారామ్ దర్శకత్వంలో తెరకెక్కిన శకుంతల సినిమాలో జయశ్రీ శకుంతల పాత్రలో నటించారు.ఈ చిత్రం 1943 లో రిలీజ్ అయ్యింది.
5. సంధ్య – శకుంతల:
హిందీలో వి శాంతారాం దర్శకత్వంలో వచ్చిన స్త్రీ అనే సినిమాలో సంధ్య శకుంతలగా నటించారు. ఈ చిత్రం 1961 లో రిలీజ్ అయ్యింది.
6.కేఆర్ విజయ – శకుంతల:
మలయాళంలో కుంచాకో దర్శకత్వంలో తెరకెక్కిన శకుంతల సినిమాలో కేఆర్ విజయ శకుంతలగా నటించారు. ఈ చిత్రం 1965 లో విడుదల అయ్యింది.
7. బి సరోజాదేవి – శాకుంతల:
తెలుగులో కమలాకర కామేశ్వరరావు దర్శకత్వంలో వచ్చిన శాకుంతల సినిమాలో బి సరోజాదేవి శకుంతలగా నటించారు.ఈ చిత్రం 1966 లో రిలీజ్ అయ్యింది.
8. జయప్రద – కవిరత్న కాళిదాస:
కన్నడలో రేణుకా శర్మ దర్శకత్వంలో తెరకెక్కిన కవిరత్న కాళిదాస చిత్రంలో జయప్రద శకుంతలగా ఆకట్టుకున్నారు. ఈ చిత్రం 1983 లో విడుదల అయ్యింది.
shakuntala-samantha-vs-jayaprada29. పాయల్ శెట్టి – శాకుంతలం ఓటీటీ మూవీ:
సంస్కృతం లో దుష్యంత్ శ్రీధర్ దర్శకత్వం వహించిన శాకుంతలం చిత్రంలో పాయల్ శెట్టి శకుంతల పాత్రలో నటించారు. ఈ 2021లో ఓటీటీలో విడుదల అయ్యింది.
10.సమంత – శాకుంతలం
గుణశేఖర్ దర్శకత్వంలో స్టార్ హీరోయిన్ సమంత శకుంతలగా నటినంచిన చిత్రం ‘శాకుంతలం’ ఏప్రిల్ 14న ఐదు భాషల్లో పాన్ ఇండియా మూవీగా విడుదలకానుంది.

Also Read: “విక్కీ కౌశల్” కంటే ముందు… “కత్రినా కైఫ్” రిలేషన్‌షిప్‌లో ఉన్న 5 మంది హీరోలు..!


End of Article

You may also like