కత్రినా కైఫ్ తెలుగులో మొదట వెంకటేష్ సరసన ‘మల్లీశ్వరీ’ సినిమాలో నటించిన విషయం తెలిసిందే. ఆ తర్వాత బాలయ్య సరసన అల్లరి పిడిగులో కూడా మెరిసింది. తెలుగులో ఈ భామ నటించిన ఆ సినిమా పెద్దగా ఆడలేదు. దీంతో తిరిగి బాలీవుడ్‌ కి వెళ్లిపోయిన కత్రినా అక్కడ స్టార్ హీరోయిన్ గా ఎదిగింది.

Video Advertisement

ఇక బాలీవుడ్ యంగ్ హీరో విక్కీ కౌశల్ తో ప్రేమాయణం సాగించిన కత్రీనా కైఫ్ పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. అతికొద్ది మంది అతిథుల సమక్షంలో ఈ వివాహ వేడుక ఘనంగా జరిగింది.

list of katrina kaif's boyfriends..!!

మరో వైపు కత్రినా కెరీర్ పీక్స్ లో ఉన్న సమయం లో బాలీవుడ్‌లో పలువురు హీరోలతో లవ్‌ట్రాక్‌లు నడిపింది కత్రినా. ఇప్పుడు ఆ లిస్ట్ లో ఎవరెవరు ఉన్నారో చూద్దాం..

#1 అక్షయ్ కుమార్

2007లో కత్రినా కైఫ్ అక్షయ్ కుమార్‌తో కలిసి ‘నమస్తే లండన్’ అనే చిత్రం లో నటించారు. ఆ తర్వాత వీరిద్దరూ కలిసి వెల్‌కమ్, సింగ్ ఈజ్ కింగ్, దే దానా డాన్, బ్లూ, తీస్ మార్ ఖాన్ మరియు ఇటీవల సూర్యవంశీ చిత్రాల్లో నటించారు. దీంతో వీరిద్దరూ డేటింగ్ లో ఉన్నట్లు వార్తలు వచ్చాయి. కానీ అక్షయ్ కుమార్ వీటిని తోసిపుచ్చారు.

list of katrina kaif's boyfriends..!!

#2 సల్మాన్ ఖాన్

సల్మాన్, కత్రినా మధ్య ఉన్న బంధం పై ఇప్పటికీ ఏదోక వార్తలు వస్తూనే ఉన్నాయి. వీరిద్దరి ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ వర్కౌట్ అవ్వడం తో టైగర్, టైగర్ జిందా హై, భరత్, మైనే ప్యార్ క్యున్ కియా వంటి అనేక చిత్రాలు హిట్ అయ్యాయి. ఆ తర్వాత కొంత కాలానికి వీరి బంధం బీటలు వారింది.

list of katrina kaif's boyfriends..!!

#3 సిద్దార్థ్ మాల్యా

కత్రినా, సిద్దార్థ్ మాల్యా డేటింగ్ చేసినట్లు గతం లో చాలా వార్తలు వచ్చాయి కానీ.. దీనిపై అధికారిక ధ్రువీకరణ లేదు. కానీ బెంగళూరులో జరిగిన అనేక ఐపీయల్ మ్యాచ్‌లలో వీరిద్దరూ కలిసి కనిపించారు.

list of katrina kaif's boyfriends..!!

#4 రణ బీర్ కపూర్

కత్రినా, రణ బీర్ చాలా కాలం డేటింగ్ చేసారు. వీరిద్దరి బంధం బాలీవుడ్ లో హాట్ టాపిక్. వీరిద్దరూ కొన్నాళ్ల పాటు సహజీవనం కూడా చేసారు. వీరి బంధం పెళ్లి వరకు వచ్చింది కానీ కొన్ని కారణాల వల్ల విడిపోయారు.

list of katrina kaif's boyfriends..!!

#5 విక్కీ కౌశల్

సోనమ్ కపూర్ సోదరుడు హర్ష్ వర్ధన్ కపూర్ ఒక చిట్ చాట్ లో భాగం గా బాలీవుడ్ లోని ఒక రూమర్ గురించి ప్రశ్నించగా.. కత్రినా, విక్కీ కౌశల్ డేటింగ్ లో ఉన్నారని వెల్లడించారు. ఆ తర్వాత కొంత కాలానికే ఈ జంట పెళ్లి పీటలెక్కింది.

list of katrina kaif's boyfriends..!!