83 Movie Review : “కపిల్ దేవ్” జీవితం ఆధారంగా రూపొందిన 83 హిట్టా? ఫట్టా? స్టోరీ, రివ్యూ & రేటింగ్.!

83 Movie Review : “కపిల్ దేవ్” జీవితం ఆధారంగా రూపొందిన 83 హిట్టా? ఫట్టా? స్టోరీ, రివ్యూ & రేటింగ్.!

by Mohana Priya

Ads

  • చిత్రం : 83
  • నటీనటులు : రణ్‌వీర్ సింగ్, దీపికా పదుకొనే, జీవా.
  • నిర్మాత : దీపికా పదుకొనే, కబీర్ ఖాన్
  • దర్శకత్వం : కబీర్ ఖాన్
  • సంగీతం : ప్రీతమ్
  • విడుదల తేదీ : డిసెంబర్ 24, 2021

83 movie review

Video Advertisement

స్టోరీ :

ఇంగ్లాండ్‌తో 1983లో వరల్డ్‌కప్ జరిగినప్పుడు టీం ఇండియా ఎలాంటి పరిస్థితుల్ని ఎదుర్కొంది అనే అంశం చుట్టూ సినిమా కథ నడుస్తుంది. ఇందులో అప్పటి కెప్టెన్ కపిల్ దేవ్‌గా రణ్‌వీర్ సింగ్ నటించారు. కపిల్ దేవ్ భార్య రోమి దేవ్‌గా దీపిక పదుకొనే నటించారు.

83 movie review

రివ్యూ :

ఈ సినిమా నిజ జీవిత సంఘటనల ఆధారంగా తెరకెక్కింది అనే విషయం తెలిసిందే. భారత దేశం మొత్తం గర్వించదగ్గ విషయంపై ఈ సినిమా ఉండడంతో, హిందీతో పాటు తెలుగు, తమిళ్, మలయాళం, కన్నడ భాషల్లో కూడా సినిమా విడుదల చేశారు. తెలుగులో అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ పై నాగార్జున ఈ సినిమాని విడుదల చేశారు. అంతే కాకుండా, కపిల్ దేవ్‌ పాత్ర పోషించిన రణ్‌వీర్ సింగ్ కి, తెలుగులో సుమంత్ డబ్బింగ్ చెప్పారు. కపిల్ దేవ్‌గా రణ్‌వీర్ సింగ్ చాలా బాగా నటించారు. కపిల్ దేవ్ మేనరిజమ్స్, మాటలు, అన్నీ కూడా చాలా ఒరిజినల్ గా అనిపిస్తాయి. ఒక రకంగా చెప్పాలంటే రణ్‌వీర్ ఈ పాత్రలో జీవించారు. అలాగే కృష్ణమాచార్య శ్రీకాంత్ గా నటించిన జీవా పాత్ర కూడా సినిమాకి మరో హైలైట్ గా నిలిచింది.

83 movie review

కపిల్ దేవ్ భార్య రోమి దేవ్‌గా నటించిన దీపిక పదుకొనే, అలాగే మిగతా పాత్రల్లో నటించిన వారు కూడా తమ పాత్రల పరిధి మేరకు బాగా నటించారు. ఈ సినిమాకి అతి పెద్ద ప్లస్ పాయింట్ VFX. ఆ సమయంలో జరిగిన సెలబ్రేషన్ అంతా చాలా బాగా చూపించారు. నిజంగా అప్పుడు అలాగే జరిగిందేమో అని అనిపిస్తుంది. అంత సహజంగా ఉంది. కానీ సినిమా నిడివి మాత్రం చాలా ఎక్కువగా ఉంది. ఫస్ట్ హాఫ్ లో కథని ఇంకా బాగా చెప్పే అవకాశం ఉంది. కానీ చాలా మామూలుగా వెళ్ళిపోతుంది. ఇంటర్వెల్ తర్వాత కథలో వేగం మొదలవుతుంది.

ప్లస్ పాయింట్స్ :

రణ్‌వీర్ సింగ్

VFX

మైనస్ పాయింట్స్:

చాలా స్లోగా నడిచే ఫస్ట్ హాఫ్

రేటింగ్ :

3/5

ట్యాగ్ లైన్ :

ఎటువంటి ఎక్స్పెక్టేషన్స్ లేకుండా వెళ్తే క్రికెట్ అభిమానులకి సినిమా ఎమోషనల్‌గా చాలా కనెక్ట్ అవుతుంది.


End of Article

You may also like