90 రూపాయలు పెట్టి చాకొలేట్ కొని.. “50 లక్షలు” డిమాండ్ చేసాడు.. అసలు స్టోరీ ఏంటంటే?

90 రూపాయలు పెట్టి చాకొలేట్ కొని.. “50 లక్షలు” డిమాండ్ చేసాడు.. అసలు స్టోరీ ఏంటంటే?

by Anudeep

Ads

చాక్లెట్ అనే పేరు వినగానే అందరి నోట్లో నీళ్లు ఊరుతాయి ఉంటాయి. పిల్లల నుంచి పెద్దల వరకు చాక్లెట్ ని తిననివారే ఉండరు. ఇప్పుడు మార్కెట్లో అనేక రకాల చాక్లెట్లు అనేక రకాల రుచులతో వచ్చేస్తున్నాయి. చాక్లెట్ ప్రియులకు అందుబాటులో ఉన్నాయి.

Video Advertisement

ఈ విషయం పక్కన ఉంచితే, ఇప్పుడు చాక్లెట్ పేరు ఎత్తగానే జనాల్లో రకమైన భయం మొదలవుతుంది. అప్పటిలో ఎక్కువ నట్స్ తో కూడిన ఒక బ్రాండ్ చాక్లెట్ పై కొన్ని విమర్శలు వచ్చాయి. ఆ బ్రాండ్ చాక్లెట్ లో పురుగులు ఉన్నాయంటూ కొందరు కొనుగోలుదారులు పిర్యాదు చేసారు. తాజాగా ఇలాంటి ఘటన ఒకటి కర్ణాటక రాజధాని అయినా బెంగళూరులో ఎదురయ్యింది.

Case of cadbury chocolate

కొనుగోలు చేసిన చాక్లెట్ లో పురుగులు రావడంతో సదరు వ్యక్తి ఏకంగా 50 లక్షలు నష్టపరిహారాన్ని కోరాడు. బెంగళూరులో హెచ్.ఆర్.ఎస్ లే అవుట్ లో నివాసముంటున్న ముకేష్ కుమార్ కెడియా, తాను స్థానికంగా ఉన్నా MK రిటైల్ సూపర్ మార్కెట్ లో క్యాడ్బరీ ఫ్రూట్స్ అండ్ నట్స్ చాక్లెట్ ని  89 రూపాయల చొప్పున రెండు కొనుగోలు చేశాడు. ఆ చాక్లెట్ బార్ అనే విప్పిచూడగా దానిలో పురుగులు ఉన్నట్లు గుర్తించాడు.

దాంతో క్యాడ్బరీ కస్టమర్ కేర్ కి ఫోన్ చేసి అసలు విషయాన్ని చెప్పాడు. విషయం తెలుసుకున్న సిబ్బంది పురుగులు ఉన్న చాక్లెట్లు తమకు ఈ తిరిగి ఇవ్వమని కోరగా ముఖేష్ కుమార్ నిరాకరించాడు. ఆ పురుగులు ఉన్న చాక్లెట్ ని ఫోటో తీసి వాళ్లకు పంపించాడు. తను చేసిన ఫిర్యాదుపై క్యాడ్బరీ సంస్థ స్పందించకపోవడంతో 2016  అక్టోబర్ 26న అర్బన్ జిల్లా వినియోగదారుల కోర్టును ఆశ్రయించాడు ముఖేష్ కుమార్.

క్యాడ్బరీ చాక్లెట్ తయారీ సమస్త యాజమాన్యంపై నా మరియు Mk రిటైల్ బ్రాంచ్ పైన సేవా లోపం కింద కోర్టులో ఫిర్యాదు నమోదు చేశాడు. 89 రూపాయల విలువైన చాక్లెట్ లో పురుగులు ఉండడంతో 20 నుంచి 50 లక్షల రూపాయల నష్టపరిహారాన్ని కోరాడు.

Court hammer

చాక్లెట్ లో పురుగులు ఉన్న విషయం వినియోగదారుల కోర్టు అంగీకరించింది. ఇంత భారీ నష్టపరిహారం తమ పరిధిలోకి రాదు అని కేవలం ఐదు లక్షల రూపాయలు వరకు ఉన్న విచారణ మాత్రమే అనుమతిస్తామని కోర్టు తేల్చిచెప్పేసింది. దీని కోసం రాష్ట్ర వినియోగదారుల కోర్టుకు వెళ్ళమని ఆదేశించింది. రాష్ట్ర వినియోగదారుల కోర్టు దాదాపు కోటి రూపాయల విచారణ వరకు కేసులను అనుమతిస్తుంది. తాజాగా ఆరేళ్ల తర్వాత ఏప్రిల్ 8 వ తారీఖున ఈ మేరకు కోర్టు తీర్పు ఇచ్చింది.


End of Article

You may also like