Home Filmy Adda OTT లోకి రాబోతున్న మరొక కొత్త కామెడీ సిరీస్..! ఎప్పటినుండి చూడొచ్చు అంటే..?

OTT లోకి రాబోతున్న మరొక కొత్త కామెడీ సిరీస్..! ఎప్పటినుండి చూడొచ్చు అంటే..?

by Mohana Priya

ప్రతి వారం ఎన్నో కొత్త వెబ్ సిరీస్ లు, ఎన్నో సినిమాలు ఓటీటీ ద్వారా విడుదల అవుతూ ఉంటాయి. దాదాపు థియేటర్లలో విడుదల అవుతున్న సినిమాలకి లభిస్తున్న ఆదరణ వీటికి లభిస్తోంది. అందుకే తెలుగులో కూడా ఎంతో మంది ఎన్నో రకాల కొత్త కంటెంట్ ఉన్న సిరీస్, సినిమాలు విడుదల చేస్తున్నారు.

అలా ఇప్పుడు మరొక కొత్త సిరీస్ ఓటీటీలోకి రాబోతోంది. ఈ సినిమా పేరు 90స్ (నైంటీస్). ఎ మిడిల్ క్లాస్ బయోపిక్ అనేది దీని క్యాప్షన్.

90 s a middle class biopic streaming date

ఎన్నో సినిమాల్లో హీరోగా, సహాయ నటుడిగా నటించి, డబ్బింగ్ ఆర్టిస్ట్ గా కూడా చేసి, ఇటీవల బిగ్ బాస్ ప్రోగ్రాం ద్వారా గుర్తింపు మరింత పెంచుకున్న నటుడు శివాజీ ఈ సిరీస్ లో ముఖ్య పాత్ర పోషిస్తున్నారు.  శివాజీ పక్కన హీరోయిన్ గా తొలిప్రేమ సినిమాలో పవన్ కళ్యాణ్ చెల్లెలి పాత్రలో నటించిన వాసుకి ఆనంద్ నటిస్తున్నారు. మౌళి టాక్స్ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఫేమస్ అయిన మౌళి, రోహన్, వాసంతిక, స్నేహాల్ కామత్ ఇందులో ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.

90 s a middle class biopic streaming date

ఈ సిరీస్ ని నవీన్ మేడారం, రాజశేఖర్ మేడారం నిర్మించగా, ఆదిత్య హాసన్ దీనికి దర్శకత్వం వహించారు. పేరుకు తగ్గట్టే సిరీస్ మొత్తం నైంటీస్ కాలంలోనే సాగుతుంది. సురేష్ బొబ్బిలి ఈ సిరీస్ కి సంగీతం అందించారు. శివాజీ, వాసుకి దంపతులకు ముగ్గురు పిల్లలు అని, వీరందరూ మధ్య తరగతి కుటుంబానికి చెందినవారు అని ట్రైలర్ చూస్తే అర్థం అవుతోంది. చిన్నప్పుడు ఆ పిల్లలు ఎదుర్కొనే సమస్యలు, వాళ్లు చేసే అల్లరి, చదువు అంటే భయపడడం, స్నేహం ఇవన్నీ కూడా ఇందులో చూపించారు.

90 s a middle class biopic streaming date

అలాగే చిన్న వయసులో వచ్చే అట్రాక్షన్ లాంటివి కూడా ఇందులో చూపించినట్టు తెలుస్తోంది. ఈ సిరీస్ ఈటీవీ విన్ లో జనవరి 5వ తేదీ నుండి ప్రసారం అవుతుంది. ఈ సిరీస్ టీజర్ ని కొంత కాలం క్రితం వెంకటేష్ లాంచ్ చేశారు. ఇటీవల ఈ సిరీస్ ట్రైలర్ కూడా విడుదల చేశారు. ట్రైలర్ చూస్తూ ఉంటే లొకేషన్స్, వారి వేషధారణ ఇవన్నీ కూడా 90 ల కాలంలో ఉన్నట్టే రూపొందించారు అని అర్థం అవుతోంది. అంటే కాకుండా శివాజీ ఇందులో చంద్రశేఖర్ అనే మ్యాథ్స్ టీచర్ పాత్ర పోషిస్తున్నట్టు తెలుస్తోంది.

watch trailer :

ALSO READ : రామ్ చరణ్ తో సినిమా చేస్తా…. కానీ ఇప్పుడే కాదు…

You may also like