Home Filmy Adda “90s” వెబ్ సీరీస్ లో నటించిన ఈ ముగ్గురు బాలనటులు ఎవరో తెలుసా.? వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటంటే.?

“90s” వెబ్ సీరీస్ లో నటించిన ఈ ముగ్గురు బాలనటులు ఎవరో తెలుసా.? వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటంటే.?

by Sainath Gopi

ఇటీవల కాలంలో వెబ్ సిరీస్‌లకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రతి వారం రిలీజ్ అవుతున్న వెబ్ సిరీస్ ల కోసం, ఆడియెన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఒకప్పుడు హిందీ, విదేశీ భాషల్లో రిలీజ్ అయ్యే  వెబ్ సిరీస్ మాత్రమే పాపులర్ అయ్యేవి.

కానీ ప్రస్తుతం తెలుగులో సైతం మంచి కంటెంట్ తో వెబ్ సిరీస్‌లు తెరకెక్కుతున్నాయి. అలా రీసెంట్ గా ‘90స్’ అనే వెబ్ సిరీస్ ప్రముఖ ఓటీటీ ఈటీవీ విన్‌లో రిలీజ్ అయ్యింది. ఈ సిరీస్ కు ఆడియెన్స్ నుండి మంచి స్పందన వస్తోంది. ఈ సిరీస్ లో నటించిన బాలనటులకు కూడా మంది గుర్తింపు వచ్చింది. వారి బ్యాగ్ గ్రౌండ్ ఏమిటో ఇప్పుడు చూద్దాం..
90 s a middle class biopic streaming dateతెలుగు సీనియర్ నటుడు, బిగ్ బాస్ ఫేమ్ శివాజీ, వాసుకి లీడ్ రోల్స్ లో నటించిన వెబ్ సిరీస్ ’90s ఏ మిడిల్ క్లాస్ బయోపిక్’. జనవరి 5 నుండి ఈ సిరీస్ ‘ఈటీవీ విన్’ లో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ సిరీస్ కు ఆదిత్య హాసన్ దర్శకత్వం వహించారు. 90లలో ఉన్న మధ్యతరగతి పిలల్ల జీవితాల్ని ఈ సిరీస్ లో అద్భుతంగా చూపించారు.
90 s a middle class biopic streaming dateశివాజీ, వాసుకి భార్యభర్తలుగా చక్కగా నటించగా, వారి ముగ్గురు పిల్లలకు మంచి పేరు వచ్చింది. వీరిలో పెద్ద అబ్బాయిగా నటించిన బాలనటుడి పేరు మౌళి తనుజ్ ప్రశాంత్. ఇప్పటికే మౌళి సోషల్ మీడియా వేదిక ఇన్ స్టాగ్రామ్ లో సెలబ్రిటీ. అతన్ని 4 లక్షల మందికి పైగా ఫాలో అవుతున్నారు. మౌళి టాక్స్ అనే యూట్యూబ్ ఛానల్ సైతం ఉంది. ఇదివరకే ‘హాస్టల్ డేస్’ సిరీస్ లో నటించాడు.
శివాజీ చిన్న అబ్బాయి ఆదిత్యగా నటించి, పాపులర్ అయిన బాల నటుడి పేరు రోహన్ రాయ్. ఇప్పటికే పలు సీరియల్స్, సినిమాలలో నటించాడు. ఈ సిరీస్ తో మరింత పాపులర్ అయ్యారు. శివాజీ కూతురు దివ్యగా నటించిన వాసంతిక సలార్ మూవీలో చైల్డ్ ఆర్టిస్ట్ గా చేసింది. ఈ సిరీస్ తో మంచి గుర్తింపు తెచ్చుకుంది.

Also Read:  “90S” సీరీస్ లో శివాజీ చిన్న కొడుకుగా నటించిన ఈ అబ్బాయి ఎవరో తెలుసా..?

You may also like