Ads
రోజు రోజుకు మూఢనమ్మకాల నుంచి దూరం అవ్వాల్సింది పోయి మరింతగా అంధకారంలోకి మునిగిపోతున్నాం. సైంటిఫిక్ జ్ఞానాన్ని అందించాల్సిన వైద్యులు కూడా మూఢ నమ్మకాలను నమ్ముతుండడం మరింత ఆశ్చర్యం కలిగించే విషయం. ఈ వైద్యుడు కూడా తనకి ఉన్న మూఢ నమ్మకాల కారణంగా తన భార్యను హత్య చేసాడు. అది హత్య కాదు అని అనుమానం రాకుండా ఉండడం కోసం తన వైద్య విద్యని ఉపయోగించాడు.
Video Advertisement
ఈ వైద్యుడు చేసిన పని ఏంటో తెలిస్తే కడుపు తరుక్కుపోతుంది. పూర్తి వివరాలలోకి వెళితే.. దావణగెరె జిల్లా, న్యామతి తాలూకా లో రామేశ్వరానికి చెందిన చెన్నేశప్ప., శిల్ప భార్యా భర్తలు. 2005 లోనే వీరికి వివాహం అయ్యింది. వీరికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. చెన్నేశప్ప వైద్య వృత్తిలో ఉన్నారు. శిల్ప గత కొంతకాలం గా బిపి సమస్యతో బాధపడుతున్నారు. ఆమెకు చెన్నేశప్పే వైద్యం చేసేవారు. ఆమె ఆరోగ్యంగా ఉండడం కోసం ఆమెకు ఇంజెక్షన్స్ ఇచ్చేవారు.
వృత్తిరీత్యా డాక్టర్ అయినా చెన్నేశప్పకు మూఢనమ్మకాలు ఎక్కువగా ఉండేవి. క్షుద్ర పూజలు, చేతబడులు చేసేవారిని నమ్మేవాడు. ఈ క్రమంలో ఓ వ్యక్తి మనిషిని బలిస్తే సంపదలు పొందుతావు అని చెన్నేశప్పకు చెప్పడంతో.. అది నమ్మి మనిషిని బలి ఇవ్వాలని అనుకున్నాడు. అందుకు అనారోగ్యంతో బాధ పడుతున్న తన భార్యే మార్గంగా కనిపించింది.
అయితే.. తాను హత్య చేసినట్లు ఎవ్వరికి అనుమానం రాకూడదని అనుకున్నాడు. అందుకు పధకం రచించాడు. తన భార్యకు డేక్సామెథసోన్ ఇంజక్షన్ ఓవర్ డోస్ ను ఇచ్చాడు. అది తీసుకుంటే బిపి తగ్గుతుంది అని చెప్పి భార్యను నమ్మించాడు. పరిస్థితి ఇబ్బందిగా ఉండడంతో ఆమె భర్త మాటలను విశ్వసించి ఆ ఇంజక్షన్ ను తీసుకుంది. అది తీసుకున్నాక ఆమె పరిస్థితి మరింత విషమించింది. ఆమెను ఆసుపత్రికి తీసుకెళ్తానని చెప్పి డ్రామా ఆడాడు. ఆమె ఆసుపత్రికి తీసుకెళ్లే లోపే మరణిస్తుంది అని ముందే తెల్సి.. నాటకం ఆడాడు.
తీరా ఆమె మరణించడంతో.. ఇంటికి తీసుకువచ్చేసాడు. తన భార్య మరణించింది అని మొసలి కన్నీరు కార్చాడు. కానీ ఆసుపత్రికి తీసుకెళ్లకుండా ఇంటికి తీసుకురావడంతో ఆ అమ్మాయి తల్లితండ్రులకు అనుమానం వచ్చింది. ఆమె ఎడమ భుజంపై ఇంజెక్షన్ చేసిన గుర్తులు అలానే ఉన్నాయి. ఆమె నోటినుంచి రక్తపు నురగ వచ్చినట్లు కూడా కనిపించడంతో ఆ తల్లితండ్రులకి అనుమానం వచ్చి పోలీసులను ఆశ్రయించారు. వారి ఫిర్యాదు మేరకు పోలీసులు విచారణ జరుపగా.. ఈ నిజాలు బయటకి వచ్చాయి.
End of Article