Ads
కార్తీకదీపం సీరియల్ ఎంతటి క్రేజ్ ను సంపాదించుకుందో మనందరికీ తెలిసిన విషయమే. సాయంత్రం అయితే చాలు ఎపుడు వస్తుందా ఆ సీరియల్ అని ఎదురు చూస్తూ ఉంటారు.అత్యంత టాప్ రేటింగ్ ఉన్న సీరియల్ గా గుర్తింపు తెచ్చుకుని అందరి మన్ననలు పొందుతోంది.అయితే ఈ సీరియల్ తో మంచి గుర్తింపు తెచ్చుకున్న మలయాళ భామ ప్రేమి విశ్వనాధ్ వంటలక్క గా మనఇంట్లో మనిషి గా కలిసిపోయింది.
Video Advertisement
ఆమెకి ఉన్న క్రేజ్ ని చూస్తుంటే ఒక్కోసారి మైండ్ పోతుంది. ఇటీవల భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట కు చెందిన పాపిడి గూడెం అనే ఓ గ్రామంలో ఓ రైతు వంటలక్క ఫోటోను బ్యానర్ లా చేయించి పంట చేనులో పెట్టించాడు. మాములుగా పంట చేనులో దిష్టి బొమ్మలను పెడుతూ ఉంటారు. వీటికి బదులు అభిమానం కొద్దీ సినిమా హీరోయిన్ల ఫోటోలను పెట్టడం చూస్తూనే ఉన్నాం. ఈ రైతు మాత్రం సీరియల్ హీరోయిన్ ఫోటోను తన పంట చేనులో పెట్టుకోవడంతో ఈ ఫోటో వైరల్ అవుతోంది.
End of Article