Ads
కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ హఠాన్మరణం చెందారు. ఈరోజు ఉదయమే ఆయనకు గుండెనొప్పి రావడంతో ఆయనను ఆసుపత్రికి తీసుకెళ్లారు. కానీ, ఆయనకు గుండె నొప్పి వచ్చి పరిస్థితి విషమించడంతో మరణించారు. పునీత్ చెన్నైలో పుట్టారు. తనకి ఆరు సంవత్సరాల వయసున్నప్పుడు కుటుంబమంతా మైసూర్ కి వెళ్ళిపోయారు. పునీత్ తండ్రి రాజ్ కుమార్ గారు కన్నడ స్టార్ హీరో. పునీత్ తన తోబుట్టువులు అందరిలో చిన్నవారు. పునీత్ చైల్డ్ ఆర్టిస్ట్ గా కెరీర్ మొదలు పెట్టారు. దాదాపు 20 సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించారు. ఉత్తమ బాల నటుడిగా నేషనల్ అవార్డ్ కూడా అందుకున్నారు.
Video Advertisement
2002లో అప్పు సినిమాతో హీరోగా పరిచయం అయ్యారు. ఈ సినిమా ఇడియట్ సినిమా రీమేక్. ఈ సినిమాలో కూడా రక్షిత హీరోయిన్ గా నటించారు. తర్వాత ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించారు. ఫ్యాన్స్ అందరూ పునీత్ ని అప్పు, పవర్ స్టార్ అని పిలుస్తారు. పునీత్ మంచి నటుడు మాత్రమే కాకుండా మంచి డాన్సర్ అలాగే మంచి సింగర్ కూడా. తన సినిమాల్లో ఎన్నో పాటలు పాడారు. ఆయన మరణ వార్త తెలియడం తో కర్ణాటక విషాదంలో కూరుకుపోయింది. పునీత్ సామాజిక సేవా కార్యక్రమాల్లో కూడా ముందుంటారు. ఆయన ఎన్నో స్కూల్స్ ని, అనాధాశ్రమాలని, గోశాలలను నిర్వహిస్తున్నారు.
అంతే కాదు, 1800 ల మంది విద్యార్థులకు ఉచితంగా చదువు చెప్పిస్తున్నారు. తన రెండు నేత్రాలను కూడా పునీత్ దానం చేసారు. ఇటువంటి గొప్ప వ్యక్తిని కోల్పోవడంతో కన్నడ ప్రజలు విచారంలో మునిగిపోయారు. గతంలో కూడా పునీత్ రాజ్ కుమార్ అన్న శివ రాజ్ కుమార్ కూడా ఇలానే గుండెపోటుకు గురయ్యారు. ప్రస్తుతం పునీత్ రాజ్ కుమార్ కూడా ఇలాంటి పరిస్థితినే ఎదుర్కొన్నారు. అయితే.. పరిస్థితి విషమించడంతో ఆయన ఈ లోకాన్ని వీడి వెళ్లిపోయారు. అప్పుడు అన్నకి.. ఇప్పుడు తమ్ముడికి.. పునీత్ కుటుంబంలోనే ఇలా ఎందుకు జరుగుతోందో అని ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు.
End of Article