Ads
కన్నడ స్టార్ నటుడు పునీత్ రాజ్‌కుమార్ గుండెపోటు కారణంగా మరణించారు. పునీత్ కి కేవలం కన్నడలో ఇండస్ట్రీలో మాత్రమే కాకుండా, ఇతర భాషల ఇండస్ట్రీలలో కూడా చాలా ఫాలోయింగ్ ఉంది. శుక్రవారం ఉదయం జిమ్ లో వ్యాయామం చేస్తున్నప్పుడు పునీత్ ఒక్కసారిగా కిందపడిపోయారు. ఆస్పత్రికి వెళ్లే సరికి పునీత్ పరిస్థితి చాలా విషమంగా ఉంది అని డాక్టర్లు చెప్పారు. చికిత్స అందించిన కొంతసేపటి తర్వాత పునీత్ తుది శ్వాస విడిచారు. పునీత్ జీవితానికి సంబంధించిన కొన్ని ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.
Video Advertisement
#1 పునీత్ చెన్నైలో పుట్టారు. తనకి ఆరు సంవత్సరాల వయసున్నప్పుడు కుటుంబమంతా మైసూర్ కి వెళ్ళిపోయారు. పునీత్ తండ్రి రాజ్ కుమార్ గారు కన్నడ స్టార్ హీరో. పునీత్ తన తోబుట్టువులు అందరిలో చిన్నవారు.
#2 పునీత్ చైల్డ్ ఆర్టిస్ట్ గా కెరీర్ మొదలు పెట్టారు. తనకి ఆరునెలల వయసు ఉన్నప్పుడే పునీత్ మొదటిసారిగా కెమెరా ముందు కనిపించారు. దాదాపు 20 సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించారు. ఉత్తమ బాల నటుడిగా నేషనల్ అవార్డ్ కూడా అందుకున్నారు.
#3 2002లో అప్పు సినిమాతో హీరోగా పరిచయం అయ్యారు. ఈ సినిమా ఇడియట్ సినిమా రీమేక్. ఈ సినిమాలో కూడా రక్షిత హీరోయిన్ గా నటించారు. తర్వాత ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించారు.
#4 పునీత్ మంచి నటుడితో పాటు మంచి సింగర్ కూడా. చిన్నప్పటినుంచి పునీత్ ఎన్నో పాటలు పాడారు. దాదాపు పునీత్ నటించిన చాలా సినిమాల్లో తాను పాడిన పాటలు కచ్చితంగా ఉంటాయి. ఇటీవల వచ్చిన యువరత్న సినిమాలో కూడా ఒక పాట పాడారు.
#5 పునీత్ డాన్స్ కి భారతదేశం అంతటా చాలా క్రేజ్ ఉంది. భారత దేశంలో టాప్ డాన్సర్స్ లో ఒకరిగా గుర్తింపు సంపాదించారు పునీత్.
#6 తెలుగులో సూపర్ హిట్ అయిన దూకుడు సినిమాని, కన్నడలో పవర్ పేరుతో రీమేక్ చేశారు. అందులో పునీత్ హీరోగా నటించారు. త్రిష హీరోయిన్ గా నటించారు. ఈ సినిమా కన్నడలో కూడా బ్లాక్ బస్టర్ అయ్యింది.
#7 పునీత్ సామాజిక కార్యక్రమాల్లో కూడా ముందుంటారు. 45 ఉచిత స్కూల్స్ కట్టించారు. 26 అనాధాశ్రమాలని, 16 వృద్ధాశ్రమాలని, 19 గోశాలలని కూడా నిర్మించారు. ఇవన్నీ మాత్రమే కాకుండా 1800 మంది విద్యార్థులకు విద్యని అందించారు.
#8 ఇవన్నీ మాత్రమే కాకుండా 1800 మంది విద్యార్థులకు విద్యని అందించారు. చనిపోయేముందు కూడా తన రెండు కళ్ళను దానం చేశారు పునీత్. ఆయన ఎంత గొప్ప వ్యక్తి అనేది చెప్పడానికి ఇవే ఉదాహరణలు.
#9 అంతే కాకుండా కొత్త టాలెంట్ ని ప్రోత్సహించడంలో కూడా ముందుంటారు. తన నిర్మాణంలో వచ్చే సినిమాల క్వాలిటీ కోసం ఎక్కడ వెనకాడరు. అలా ఎన్నో మంచి సినిమాలను పునీత్ నిర్మించారు.
#10 పునీత్ కి మన తెలుగు ఇండస్ట్రీ నటులతో కూడా చాలా మంచి స్నేహం ఉంది. జూనియర్ ఎన్టీఆర్, పునీత్ చాలా మంచి మిత్రులు. పునీత్ నటించిన చక్రవ్యూహ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ ఒక పాట కూడా పాడారు. అలాగే పవర్ సినిమా ఆడియో లాంచ్ ఈవెంట్ కి మహేష్ బాబు అతిథిగా హాజరయ్యారు. వీరిద్దరూ మాత్రమే కాకుండా రామ్ చరణ్, అల్లు అర్జున్, చిరంజీవి, సూర్య వంటి నటులు కూడా పునీత్ కి మంచి స్నేహితులు.
పునీత్ మృతిపై సినిమా రంగానికి, అలాగే ఇతర రంగాలకు చెందిన పలువురు ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. చిరంజీవి, వెంకటేష్, జూనియర్ ఎన్టీఆర్, రానా దగ్గుబాటి, నందమూరి బాలకృష్ణ, యష్ వంటి నటులు బెంగళూరుకి వెళ్లి పునీత్ పార్థివ దేహాన్ని సందర్శించారు.
End of Article