Punith Raj Kumar: ఎన్టీఆర్ ని చూడగానే కన్నీళ్లు పెట్టేసుకున్న శివరాజ్‌కుమార్‌..!

Punith Raj Kumar: ఎన్టీఆర్ ని చూడగానే కన్నీళ్లు పెట్టేసుకున్న శివరాజ్‌కుమార్‌..!

by Anudeep

Ads

కన్నడ స్టార్ నటుడు పునీత్ రాజ్‌కుమార్ గుండెపోటు కారణంగా మరణించారు. పునీత్ కి కేవలం కన్నడలో ఇండస్ట్రీలో మాత్రమే కాకుండా, ఇతర భాషల ఇండస్ట్రీలలో కూడా చాలా ఫాలోయింగ్ ఉంది. శుక్రవారం ఉదయం జిమ్ లో వ్యాయామం చేస్తున్నప్పుడు పునీత్ ఒక్కసారిగా కిందపడిపోయారు. ఆస్పత్రికి వెళ్లే సరికి పునీత్ పరిస్థితి చాలా విషమంగా ఉంది అని డాక్టర్లు చెప్పారు. చికిత్స అందించిన కొంతసేపటి తర్వాత పునీత్ తుది శ్వాస విడిచారు.

Video Advertisement

ntr

ఆయన మరణంతో అటు కన్నడ ఇండస్ట్రీనే కాదు.. తెలుగు ఇండస్ట్రీ కూడా విషాదంలో మునిగిపోయింది. టాలీవుడ్ సెలెబ్రిటీలు సైతం ఆయన మృతిపై తమ దిగ్భ్రాంతిని తెలిపారు. తాజాగా.. పునీత్ రాజ్ కుమార్ అంత్యక్రియలకు ఎన్టీఆర్ హాజరు అయ్యారు. ఎన్టీఆర్ కు పునీత్ ప్రాణ స్నేహితుడు అన్న సంగతి తెలిసిందే. ఆయన మరణవార్త తెలియగానే.. శనివారం ఎన్టీఆర్ బెంగళూరుకు చేరుకున్నారు. పునీత్ అంత్యక్రియలలో పాల్గొన్నారు. ఆ సమయంలో ఎన్టీఆర్ ను చూడగానే అన్న శివ రాజ్ కుమార్ కన్నీళ్లు పెట్టేసుకున్నారు. తారక్ ని అంత ఎమోషనల్ గా చూస్తుంటే అక్కడ ఉన్న వారికి కన్నీళ్లు ఆగడం లేదు.


End of Article

You may also like