IIT స్టూడెంట్ తో రిక్షా నడిపే వ్యక్తి సంభాషణ… ఈ ఒక్క సంభాషణ అతని ఆలోచనల్నే మార్చేసింది..!

IIT స్టూడెంట్ తో రిక్షా నడిపే వ్యక్తి సంభాషణ… ఈ ఒక్క సంభాషణ అతని ఆలోచనల్నే మార్చేసింది..!

by Megha Varna

Ads

ఒక ఐఐటీ విద్యార్ధి తన ప్రియురాలితో కలిసి బెనారస్ వెళ్ళాడు. అయితే వాళ్లు సంకట్ మోచన్ ఆలయానికి వెళ్లాలని అనుకున్నారు. అందుకు రిక్షా కోసం చూస్తున్నారు. ఇంతలో ఒక ఇరవై సంవత్సరాల కుర్రవాడు రిక్షా తీసుకుని వచ్చాడు. సంకట్ మోచన్ ఆలయానికి వెళ్లాలని ఆ ఐఐటీ విద్యార్థి రిక్షా నడిపే అతనికి చెప్పాడు. 50 రూపాయలు అవుతుందని రిక్షావాడు చెప్పాడు.

Video Advertisement

Rikshawala on Behance

లేదు 30 ఇస్తాను అని ఐఐటి విద్యార్థి అన్నాడు. ఆఖరికి నలభై రూపాయలకి భేరం కుదుర్చుకుని ఐఐటి విద్యార్థి తన గర్ల్ ఫ్రెండ్ తో పాటు రిక్షా ఎక్కాడు. ఇంతలో రిక్షా నడిపేవాడు మీరేం చేస్తున్నారు అని అడిగాడు. ఉద్యోగం చేస్తున్నాను అని బదులిచ్చాడు ఐఐటి విద్యార్థి. ఇంతలో వాళ్ళ ఇద్దరి మధ్య సంభాషణ ఎలా ఇలా అయింది.

రిక్షావాల: ఉద్యోగం చేస్తారు సార్ మీరు
IIT స్టూడెంట్: సాఫ్ట్ వేర్ జాబ్ చేస్తున్నాను.
రిక్షావాల: నేను కూడా అదే చేయాలనుకుంటున్నాను.
IIT స్టూడెంట్: (ఆశ్చర్యంతో) అవునా…
రిక్షావాల: ఇంజనీరింగ్ సీట్ కోసం గురు గోవింద్ సింగ్ ఇంద్రప్రస్థ యూనివర్సిటీలో దరఖాస్తు కూడా చేసుకున్నాను సార్. ఆ కాలేజీ బాగుంటుందా..?
IIT స్టూడెంట్: హా అది చాలా మంచి కళాశాలే.

riksha vala 4
రిక్షావాల: JEE పరీక్షని నేను నిన్నే వ్రాసా.
IIT స్టూడెంట్: IIT JEE పరీక్ష నువ్వు రాశావా..?
రిక్షావాల: అవునండి నేను పరీక్ష రాసాను. జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ రాసాను.
రిక్షావాల: ఎగ్జమ్ నిజంగా టఫ్ గా వుంది సార్. చాలా ముందైతే రెండేళ్ల నుండి కష్టపడుతున్నారట.
రిక్షావాల: ఇంతకీ మీరేం చదివారు, ఏ కాలేజ్ లో చదివారు?
IIT స్టూడెంట్: డిల్లీ లో నేను ఇంజనీరింగ్ IIT చేసా. అలానే MBA కూడా చేశాను.
రిక్షావాల: అవునా సార్. మీరు ముప్పయ్యే ఇవ్వండి నాకు.
రిక్షావాల: మీ ప్రధాన సబ్జెక్ట్ ఏమిటి సార్..?
IIT స్టూడెంట్: నా సబ్జెక్ట్ కెమిస్ట్రీ.
రిక్షావాల: ఒకే సార్. మెండలీఫ్ మూలకాల పట్టికలో ఎన్ని మూలకాలుంటాయి?
IIT స్టూడెంట్: 70 నుండి 80 ఉంటాయి.
రిక్షావాల: తప్పు సార్ అవి అరవైమూడు ఉంటాయి. సార్ అత్యధిక ఋణవిద్యుదాత్మకత కలిగిన మూలకం ఏది?
IIT స్టూడెంట్: నాకు గుర్తులేదు.

riksha vala 1
రిక్షావాల: ప్లోరిన్ సార్. మరి ఎలక్ట్రాన్ ఎఫినిటీ కలిగిన మూలకం ఏది?
IIT స్టూడెంట్: లేదు గుర్తులేదు.
రిక్షావాల: సార్ క్లోరిన్. మీరు ఇంకేం సబ్జెక్ట్ లో ఎక్స్పర్ట్ సార్?
IIT స్టూడెంట్: ఫిజిక్స్.
రిక్షావాల: న్యూటన్ రెండవ ఫార్ములా చెప్పండి సార్?
IIT స్టూడెంట్: F=ma.
రిక్షావాల: ఫిజిక్స్ అంటే అప్లై చెయ్యడమే కదా.. అందుకు అలా చెప్పండి సార్.
IIT స్టూడెంట్: ద్రవ్యరాశి….. బలం…త్వరణం…లో బలం…మిగితా వాటికి అనులోమానుపాతంలో .
రిక్షావాల: కాదు సార్…నేను రిక్షా నా బలంతో తొక్కుతున్న,అది అలా రోడ్ల మీద పరుగులు పెడుతుంది కదా అలా..

riksha vala

IIT స్టూడెంట్: తప్పకుండా ఇంజినీర్ అవుతావు అంటూ రిక్షా దిగేసాడు.
రిక్షావాల: 30 రూపాయిలు తీసుకుని థాంక్యూ సార్. (హైడ్రోజన్, హీలియం, లీథియం, బెరీలియం అంటూ ఓ పాటలాగా పాడుకుంటూ వెళ్లిపోయాడు రిక్షా నడుపుతూ..)

ఇలాంటి ఆసక్తికర విషయాలు డైరెక్ట్ గా మీ వాట్సాప్ లో చదవాలనుకుంటే మా వాట్సాప్ నెంబర్ 7997192411 కు START అని మెసేజ్ చేయండి.

 


End of Article

You may also like