Ads
చాలా మంది నటీనటులు వేరే ఇండస్ట్రీలోకి కూడా వెళ్లి నటిస్తూ ఉంటారు. అక్కడ వాళ్లకి అవకాశాలు వచ్చి.. అదృష్టం కలిసి వస్తే ఆ ఇండస్ట్రీలో సెటిల్ అయిపోతారు. చాలా మంది నటీనటులు ఈ విధంగానే ఉంటారు. అయితే కన్నడ నటులై తెలుగు ఇండస్ట్రీలోకి వచ్చిన వారి గురించి ఇప్పుడు చూద్దాం.
Video Advertisement
ఐశ్వర్యరాయ్, దీపికా పదుకొనె లాంటి అందాల తారలు కన్నడకి చెందిన వాళ్ళు అయినా సరే బాలీవుడ్ లో సెటిల్ అయిపోయారు. అలాగే కొంతమంది కన్నడ తారలు తెలుగు ఇండస్ట్రీలోకి వచ్చారు.
#1. సౌందర్య:
సౌందర్య ఎన్నో అద్భుతమైన పాత్రల్ని చేశారు. తెలుగు చిత్ర పరిశ్రమలో అత్యంత ప్రసిద్ధి చెందిన నటులలో ఈమె ఒకరు. రాజా, జయం మనదేరా, అమ్మోరు, పవిత్ర బంధం ఇలా ఎన్నో సినిమాల్లో సౌందర్య నటించారు.
#2. ప్రేమ:
కన్నడ నటి అయిన ఈమె తెలుగులో మంచి పాపులారిటీని పొందింది. అయోధ్య, అంజనీ పుత్రుడు, సుందరకాండ ఇలా ఎన్నో అద్భుతమైన సినిమాల్లో ప్రేమ నటించారు.
#3. రక్షిత:
కన్నడ నటి రక్షిత తెలుగులో కూడా అద్భుతమైన సినిమాలు చేసి మంచి పాపులారిటీ పొందింది. ఇడియట్, నిజం, లక్ష్మీనరసింహ ఆంధ్రావాలా వంటి తెలుగు సినిమాల్లో ఈమె నటించి మెప్పించింది.
#4. అనుష్క:
అనుష్క గురించి చెప్పక్కర్లేదు. అందరికి అనుష్క సుపరిచితమే. సూపర్, అరుంధతి,బాహుబలి మొదలైన ఎన్నో అద్భుతమైన తెలుగు చిత్రాల్లో అనుష్క నటించిన మెప్పించింది. తెలుగు చిత్ర పరిశ్రమలో ఈమె మంచి ఫాలోయింగ్ ని కూడా పొందింది.
#5. ప్రణీత సుభాష్:
ప్రణీత కూడా తెలుగు సినిమాల్లో నటించి పాపులర్ అయ్యింది. అత్తారింటికి దారేది, బావ, పాండవులు పాండవులు తుమ్మెద, రభస మొదలైన తెలుగు చిత్రాలలో నటించింది.
#6. పూజా హెగ్దే:
పూజా హెగ్డే కూడా తెలుగులో అనేక సినిమాల్లో నటించింది. టాలీవుడ్ ప్రేక్షకుల్ని ఎంతగానో ఈమె తన నటనతో మెప్పించింది. ఒక లైలా కోసం, ముకుందా, దువ్వాడ జగన్నాథం, అల వైకుంఠపురం, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ ఇలా ఎన్నో సినిమాల్లో ఈమె నటించింది.
#7. రష్మిక మందన్న:
గీత గోవిందం, కిరాక్ పార్టీ, అంజనీ పుత్ర, ఛలో, భీష్మ , సుల్తాన్ మొదలైన సినిమాల్లో నటించింది. ఫిలిం ఫేర్ అవార్డు మరియు సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డు కూడా ఈమె పొందింది.
#8. నిత్యా మీనన్:
నిత్యా మీనన్ తన నటనతో బాగా పాపులర్ అయ్యింది. కన్నడ, మలయాళం, తమిళ్, తెలుగులో కూడా ఈమె నటించింది. మూడు ఫిలిం ఫేర్ అవార్డులు, రెండు నంది అవార్డుని కూడా నిత్యా మీనన్ పొందింది.
#9. నభా నటేష్:
నాభా నటేష్ తెలుగు, కన్నడ సినిమాల్లో నటించింది. ఇస్మార్ట్ శంకర్, నన్ను దోచుకుందువటే, సోలో బ్రతుకే సో బెటర్ వంటి తెలుగు సినిమాల్లో నాభా నటేష్ నటించి మెప్పించింది.
End of Article