Ads
పెళ్లి తర్వాత ఉద్యోగం చేయడం ఇష్టం లేదని తన భర్త చెప్పినది కాదనకుండా ఈమె ఉద్యోగాన్ని మానేసింది. అలాగే తన భర్త ఫోన్ నెంబర్ కూడా మార్చేయమన్నాడు. దానికి కూడా ఆమె సరే అంది. ఫేస్ బుక్ వద్దన్నాడు. దానికి కూడా ఆమె ఊకొట్టింది. మగ వాళ్లతో స్నేహం చేయొద్దు అన్నాడు. ఆమె భర్త మాట విని ఆమె మగవాళ్ళతో స్నేహం మానేసింది. లెగ్గిన్స్ వద్దన్నా, హై హీల్స్ వద్దన్నా, కిటికీ జాకెట్లు వద్దన్నా ఆమె సరే అంది.
Video Advertisement
లిప్ స్టిక్ వేసుకొద్దంటే ఆమె పాండ్స్ పౌడర్ రాసుకోవడం కూడా మానేసింది. బ్యూటీ పార్లర్ కి వెళ్ళద్దంటే కూడా ఆమె సరే అని చెప్పింది. ఇలా తన భర్త చెప్పే ప్రతి దానికి కూడా ఆమె అడ్డు చెప్పకుండా పాటిస్తూ వచ్చింది. కొన్ని రోజులు సంతోషంగా గడిచాయి. అప్పుడె పిల్లలు వద్దు అన్నాడు. దానితో మాత్రలని కూడా కంటిన్యూ చేసింది. ఒక రోజు ఒక అమ్మాయి ఒంటి గంటకి ఇంటికి చేరిపోయాను అని మెసేజ్ చేసింది.
తన భర్త ఫోన్ కి ఇలాంటి మెసేజ్ రావడం చూసి ఆశ్చర్య పోయింది. ఉదయాన్నే ఎవరు అని అడిగితే.. ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ అని జవాబిచ్చాడు. ఆమెని వదిలేయమని చెప్పింది. కానీ తన భర్త కుదరదు అని చెప్పాడు. నీకు నేను ఉన్నాను కదా ప్రయత్నం చేయండి మర్చిపోవడానికి అని ఆమె చెప్పింది. ఇద్దరు ఒకటి కాదని తన భర్త చెప్పాడు.
మీకోసం ఇన్ని మానేశాను నాకోసం ఇది ఒకటి చేయలేరా అని అడిగింది. కుదరదు అని తను చెప్పాడు. అయితే నాకు కూడా ఒక ట్రూ లవ్ ఉందని ఆమె చెప్పింది. ఆ తర్వాత ఆమె తిరిగి మళ్లీ ఫేస్ బుక్ వాడడం మొదలు పెట్టింది. కిటికీ జాకెట్లు వేసుకోవడం మొదలుపెట్టింది. ఉద్యోగంలో కూడా జాయిన్ అయిపోయింది. ఇలా మందు మానేసిన ప్రతిదీ కూడా మళ్ళీ ఈమె మొదలుపెట్టింది.
స్నేహితులతో మాటలు… వీకెండ్ పార్టీలు ఇలా ఈమెలో కూడా చాలా మార్పు వచ్చింది.చాటుగా ఫోన్ మాట్లాడుకోవడం కూడా మొదలుపెట్టింది. భర్త ఇవి చూసి అనుమానపడ్డాడు. ఇంకేముంది ఈమె చేసే పనులు కనిపెట్టాలని ఆమెపై ధ్యాస పెంచాడు. బయటకు వెళ్లడం మానేసాడు. సెలవు రోజుల్లో కూడా ఇంట్లోనే ఉండి గమనించడం మొదలు పెట్టాడు.
ఎలా అయినా తన ప్రియుడిని కనిపెట్టాలని మొండి పట్టు పట్టాడు. కానీ ఎప్పటికీ కనిపెట్టలేడు అని తన భార్యకి తెలుసు. దీనికి గల కారణం ఏమిటంటే అసలు ఆమెకి ప్రియుడు లేడు. ఆమె ప్రియుడుని వెతికే క్రమంలో తన ప్రియురాలికి దూరమయ్యాడు. ఈమెని కనిపెడుతూ కూర్చుని ఆమెని మర్చిపోయాడు. ఆమెని పూర్తిగా మర్చిపోయి ఈమెకి సొంతమయ్యే వరకు కూడా ఆమెకి లవర్ ఉన్నాడు అని ఆమె అనుకుంటోంది.
Note: Photos in this article are for reference purposes only. They are not the actual characters.
End of Article