Ads
డైరెక్టర్ తీసే ప్రతి సినిమా హిట్ అవ్వడం.. ఆడియన్స్ ని ఇంప్రెస్ చేయడం ప్రతిసారీ సాధ్యం కాదు. కొన్ని సినిమాలు హిట్ అయితే మరికొన్ని సినిమాలు హిట్ అవ్వలేకపోవచ్చు. ఒకసారి డైరెక్టర్ మంచి హిట్ సినిమా అందించిన తర్వాత ఆ డైరెక్టర్ మీద అంచనాలు ప్రేక్షకులకి భారీగా ఉంటాయి. దీనితో డైరెక్టర్లు కూడా కాస్త తికమక పడి ఫ్లాప్ సినిమాలు ఇస్తూ ఉంటారు. కానీ కొందరు డైరెక్టర్లు మాత్రం చాలా తక్కువ ఫ్లాప్ సినిమాలనే ఇస్తూ ఉంటారు. సాధారణంగా మంచి సినిమాలని ఇచ్చి కొందరు డైరెక్టర్లు ఆడియన్స్ ని బాధపెట్టకుండా ఉంటారు మరి ఆ డైరెక్టర్లు ఎవరో ఇప్పుడు చూద్దాం.
Video Advertisement
#1. రాజమౌళి:
రాజమౌళి తీసిన 11 సినిమాలు కూడా హిట్టే. ఆడియన్స్ కి రాజమౌళి సినిమాలపై అంచనాలు భారీగా ఉంటాయి. ఆయన దర్శకత్వంలో వచ్చిన పదకొండు సినిమాలు కూడా హిట్లు కొట్టాయి.
#2. కొరటాల శివ:
కొరటాల శివ దర్శకత్వంలో మిర్చి, శ్రీమంతుడు, జనతా గ్యారేజ్, భరత్ అనే నేను సినిమాలు వచ్చాయి. అయితే ఈ నాలుగు కూడా మంచి హిట్లు కొట్టాయి. కొరటాల శివ కూడా ఆడియన్స్ ని ఏ మాత్రం బాధపెట్టరు.
#3. త్రివిక్రమ్ శ్రీనివాస్:
ఈ దర్శకుడు తీసిన అజ్ఞాతవాసి సినిమాని పక్కన పెడితే మిగిలినవన్నీ కూడా మంచి సినిమాలు. మహేష్ బాబు ఖలేజా సినిమా ఫ్లాప్ అయినప్పటికీ ఎప్పుడు ఈ సినిమా క్లాసిక్ ఏ.
#4. అనీల్ రావిపూడి:
అనీల్ రావిపూడి కూడా చాలా తక్కువగా బాధపెడుతూ ఉంటారు. పటాస్, సుప్రీమ్, రాజా ది గ్రేట్, ఎఫ్ 2, సరిలేరు నీకెవరు ఇవన్నీ కూడా మంచి సినిమాలే.
#5. వంశీ పైడిపల్లి:
మున్నా మూవీ ఇచ్చిన ఎక్స్పీరియన్స్ వల్ల తర్వాత వచ్చిన నాలుగు సినిమాలు బాక్సాఫీస్ దగ్గర హిట్ కొట్టాయి. బృందావనం, ఎవడు, ఊపిరి, మహర్షి ఇవన్నీ కూడా హిట్ సినిమాలే.
#6. సుకుమార్:
సుకుమార్ జగడం, 1 నేనొక్కడినే, ఆర్య 2 వంటివి థియేటర్ లో ఆడకపోయినా ఈ సినిమాకి ఫ్యాన్స్ ఎక్కువ. పైగా ఈయన సినిమాలు చాలా ఇంట్రెస్టింగ్ గా కొత్తగా ఉంటాయి.
#7. క్రిష్ జాగర్లమూడి:
గమ్యం, వేదం, కృష్ణం వందే జగద్గురం, కంచె, గౌతమీపుత్ర శాతకర్ణి సినిమాలు ఆడియన్స్ ని డిసప్పాయింట్ చేయలేదు. కానీ తర్వాత వచ్చిన ఎన్టీఆర్ బయోపిక్స్ కొంచెం డిసప్పాయింట్ చేశాయి.
#8. సురేందర్ రెడ్డి:
సురేందర్ రెడ్డి కూడా ఇంచుమించు మంచి సినిమాలు తీస్తూ ఉంటారు కానీ ఆయన దర్శకత్వంలో వచ్చిన కొన్ని సినిమాలు డిసప్పాయింట్ చేశాయి.
End of Article