“పద్మశ్రీ” గెల్చుకున్న పండ్లు అమ్ముకునే వ్యక్తి..! ఈ స్టోరీ తెలిస్తే హ్యాట్సాఫ్ అంటారు..!

“పద్మశ్రీ” గెల్చుకున్న పండ్లు అమ్ముకునే వ్యక్తి..! ఈ స్టోరీ తెలిస్తే హ్యాట్సాఫ్ అంటారు..!

by Mohana Priya

Ads

ఇటీవల పద్మశ్రీ పురస్కారాలు జరిగాయి. అందులో కర్ణాటకలోని మంగళూరుకి చెందిన ఒక పండ్ల విక్రేతకి పద్మశ్రీ ఇచ్చి సత్కరించింది జాతీయ ప్రభుత్వం. ఆ వ్యక్తి పేరు హరెకేళ హజజ్బా. ఆయనకి 66 సంవత్సరాలు. హరెకేళ హజజ్బా 1977 నుంచి మంగళూరులో నారింజ పండ్లు అమ్ముతూ ఉన్నారు. ఆయన ఎప్పుడు స్కూల్ కి వెళ్ళలేదు. 1978 సంవత్సరంలో ఒక విదేశీయులు వచ్చి నారింజ పండ్ల ధర ఎంత అని అడిగారు. అప్పుడు డు హరెకేళ హజజ్బాకి భాష అర్థం కాక పోవడంతో, జవాబు ఇవ్వలేకపోయారు. ఆయనకి కన్నడ ఒక భాష మాత్రమే తెలుసు. ఇంగ్లీష్, హిందీ లాంటివి తెలియదు.

Video Advertisement

Story of padmashree awardee harikela hajabba

దాంతో ఆయన ఫారినర్ కి సమాధానం చెప్పలేక పోయాను అని బాధపడ్డారు. అప్పుడే తన ఊరిలో పాఠశాల నిర్మించాలి అనే ఆలోచన వచ్చింది. ఈ ఆలోచన దాదాపు రెండు దశాబ్దాల తర్వాత రూపం దాల్చింది. మాజీ ఎమ్మెల్యే UT ఫరీద్, హజబ్బాని అక్షర శాంత అనే బిరుదుతో  సత్కరించారు. ఆయనే హజబ్బాకి పాఠశాల నిర్మించడానికి 2000 సంవత్సరంలో అనుమతి ఇచ్చారు. ఆ పాఠశాల 28 మంది స్టూడెంట్స్ తో మొదలయ్యింది. ఇప్పుడు దాదాపు 175 మంది విద్యార్థులు ఉన్నారు.

Story of padmashree awardee harikela hajabba

ఇప్పుడు వివిధ అవార్డుల ద్వారా గెలుచుకున్న డబ్బులు అని తన ఊరిలో ఇంకా పాఠశాలలు నిర్మించడం కోసం వెచ్చించాలి అని నిర్ణయించుకున్నారు హజజ్బా. దీనిపై హరెకేళ హజజ్బా మాట్లాడుతూ, “మా ఊరిలో ఎన్నో పాఠశాలలు, కాలేజీలు నిర్మించడమే నా లక్ష్యం. చాలా మంది డబ్బులని దానం చేశారు. అలాగే నేను గెలుచుకున్న మొత్తాన్ని స్కూల్స్, కాలేజెస్ నిర్మించడానికి వెచ్చిస్తున్నాను. నేను ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని మా ఊరిలో ఒక ప్రీ యూనివర్సిటీ నిర్మించమని కోరాను” అని తెలిపారు.


End of Article

You may also like