Ads
తమిళ్ హీరోలకి తెలుగు ఇండస్ట్రీలో ఎంత క్రేజ్ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. డబ్బింగ్ సినిమాలను కూడా చాలా వరకు మన తెలుగు సినిమాలతో సమానంగా ప్రేక్షకులు ఆదరిస్తారు. ఇంక సూర్య సినిమాలు వస్తే మాత్రం ఒక తెలుగు సినిమాలాగానే చూస్తారు.
Video Advertisement
సూర్య మాత్రమే కాకుండా, మరి కొంతమంది తమిళ్ హీరోలు అయిన విజయ్, అజిత్, అలాగే సీనియర్ హీరోలు అయిన కమల్ హాసన్, రజనీకాంత్ కి కూడా తెలుగులో చాలా మంచి క్రేజ్ ఉంది.
రెమో, సీమ రాజా వంటి సినిమాలతో సుపరిచితులు అయ్యి ఇప్పుడు డాక్టర్ సినిమాతో తెలుగు ఇండస్ట్రీలో కూడా ఫ్యాన్ సంపాదించుకున్న హీరో శివ కార్తికేయన్. దసరా కానుకగా విడుదలైన డాక్టర్, తెలుగులో వరుణ్ డాక్టర్ పేరుతో డబ్ అయ్యింది. ఈ సినిమా తెలుగులో కూడా సూపర్ హిట్ విజయం సాధించింది. ఈ సినిమాకి నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వం వహించారు. ప్రియాంక అరుల్ మోహన్ ఇందులో హీరోయిన్ గా నటించారు.
ఈ సినిమాలో పాటలు కూడా చాలా పెద్ద హిట్ అయ్యాయి. అయితే, ఈ సినిమాలో ఒక పాటలో ఒక సీన్ కి సంబంధించిన ఒక విషయం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అదేంటంటే, ఇందులో సో బేబీ పాటలో హీరో, హీరోయిన్ తో ఉన్నప్పుడు క్యారెట్ తినడానికి వెళ్తారు. అక్కడ హీరో,హీరోయిన్ ఒకరి ముఖాలు ఒకరు చూసి నవ్వుకుంటారు. దాంతో సోషల్ మీడియాలో ఒకరు, “అసలు వాళ్ళిద్దరు నవ్వుకోడానికి కారణం ఏంటి?” అని అడిగారు.
అందుకు ఒక నెటిజన్ ఈ విధంగా సమాధానం ఇచ్చారు. “క్యారెట్ తింటే కళ్ళకు మంచిది. హీరోకి సైట్ ఉంది కదా? మళ్లీ హీరోయిన్ కి కూడా సైట్ రాకూడదు అని క్యారెట్స్ తినమని చూపిస్తున్నాడు” అని సమాధానం ఇచ్చారు. నిజంగా ఆ సీన్ వెనకాల ఇంత కారణం ఉందా? లేదా వేరే ఏదైనా కారణం ఉందా? ఇది డైరెక్టర్ కే తెలియాలి.
End of Article