Pushpaka Vimanam Review : ప్రొడ్యూసర్ గా “విజయ్ దేవరకొండ” సక్సెస్ అయ్యారా..? స్టోరీ, రివ్యూ & రేటింగ్.!

Pushpaka Vimanam Review : ప్రొడ్యూసర్ గా “విజయ్ దేవరకొండ” సక్సెస్ అయ్యారా..? స్టోరీ, రివ్యూ & రేటింగ్.!

by Mohana Priya

Ads

  • చిత్రం : పుష్పక విమానం
  • నటీనటులు : ఆనంద్ దేవరకొండ, గీత్ సైని, శాన్వి మేఘన.
  • నిర్మాత : గోవర్ధన్ రావు దేవరకొండ, ప్రదీప్ ఎర్రబెల్లి, విజయ్ మిట్టపల్లి.
  • దర్శకత్వం : దామోదర
  • సంగీతం : రామ్ మిరియాల
  • విడుదల తేదీ : నవంబర్ 12, 2021

pushpaka vimanam movie review

Video Advertisement

 

స్టోరీ :

చిట్టిలంక సుందర్ (ఆనంద్ దేవరకొండ)కి, మీనాక్షి (గీత్ సైని)తో వివాహం జరుగుతుంది. వివాహం జరిగిన మరుసటిరోజు మీనాక్షి ఇంట్లో నుండి వెళ్లిపోతుంది. సుందర్ ఈ విషయాన్ని దాచిపెట్టడానికి చాలా కష్టపడుతూ ఉంటాడు. తన భార్యలాగా నటించడానికి సుందర్ ఒక ఆర్టిస్ట్ (శాన్వి మేఘన)ని మాట్లాడుకుంటాడు. తర్వాత, ఒక అనుకోని సంఘటన వల్ల సుందర్ పోలీసుల చేతికి చిక్కుతాడు. పోలీస్ ఇన్స్పెక్టర్ అయిన సునీల్, సుందర్ ని ఇన్వెస్టిగేట్ చేస్తూ ఉంటాడు. అసలు ఏమైంది? మీనాక్షి ఎందుకు వెళ్ళిపోయింది? సుందర్ ని పోలీసులు ఎందుకు అరెస్ట్ చేశారు? చివరికి మీనాక్షి మళ్ళీ తిరిగి వచ్చిందా? ఇదంతా తెలియాలంటే మీరు సినిమా చూడాల్సిందే.

pushpaka vimanam movie review

రివ్యూ :

2019 లో వచ్చిన దొరసాని తర్వాత, మళ్లీ థియేటర్లలో విడుదల అయిన ఆనంద్ దేవరకొండ సినిమా ఇది. నటనపరంగా ఆనంద్ దేవరకొండ ముందు సినిమాల కంటే చాలా మెరుగుపడ్డారు. హీరోయిన్లుగా నటించిన గీత్ సైని, శాన్వి మేఘన కూడా బాగా నటించారు. సహాయ పాత్రల్లో నటించిన హర్షవర్ధన్, సునీల్ కూడా తమ పాత్రలకు న్యాయం చేశారు. దర్శకుడు దామోదర రాసుకున్న కథ బాగుంది. కానీ సినిమా చాలా ల్యాగ్ చేసినట్టు అనిపిస్తుంది. సెకండ్ హాఫ్ లో అయితే కొన్నిచోట్ల ప్రేక్షకుడి సహనానికి పరీక్ష పెట్టినట్టు అనిపిస్తుంది. ఇంక క్లైమాక్స్ కి వచ్చేటప్పటికీ సినిమా చాలా డల్ గా అయిపోయింది.

pushpaka vimanam movie review

ఆనంద్ దేవరకొండ హీరోగా నటించిన మిడిల్ క్లాస్ మెలోడీస్ సినిమా డైరెక్ట్ అమెజాన్ ప్రైమ్ లో విడుదల అయ్యింది. ఆ సినిమాని ప్రేక్షకులు కూడా ఆదరించారు. బహుశా పుష్పక విమానం థియేటర్లలో కాకుండా ఓటీటీలో విడుదల అయితే పాజిటివ్ టాక్ వచ్చేదేమో. కానీ ఇప్పుడు మాత్రం సినిమా బాగున్నా కూడా కలెక్షన్స్ పరంగా ఎలా ఉంటుందో చెప్పడం కష్టం.

ప్లస్ పాయింట్స్ :

  • నటీనటుల పెర్ఫార్మెన్స్
  • అక్కడక్కడ నవ్వించే కామెడీ సీన్స్

మైనస్ పాయింట్స్:

  • చాలా స్లోగా నడిచే స్టోరీ
  • బలహీనంగా చిత్రీకరించిన కొన్ని సీన్స్

రేటింగ్ :

2.5/5

ట్యాగ్ లైన్ :

కథ బాగున్నా కూడా, సినిమా చాలా స్లోగా నడుస్తుంది. సినిమాని ఒకసారి అయితే చూడొచ్చు. థియేటర్లలో కంటే ఓటీటీలో మంచి టాక్ వచ్చే అవకాశం ఉంది.


End of Article

You may also like