Ads
- చిత్రం : రాజా విక్రమార్క
- నటీనటులు : కార్తికేయ, తాన్య రవిచంద్రన్, తనికెళ్ళ భరణి.
- నిర్మాత : 88 రామా రెడ్డి
- దర్శకత్వం : శ్రీ సరిపల్లి
- సంగీతం : ప్రశాంత్ ఆర్ విహారి
- విడుదల తేదీ : నవంబర్ 12, 2021
Video Advertisement
స్టోరీ :
విక్రమ్ (కార్తికేయ), కొత్తగా జాయిన్ అయిన NIA ఆఫీసర్. హోమ్ మినిస్టర్ సుకుమార్ (సాయి కుమార్) కి రక్షణ కల్పించే బాధ్యతని విక్రమ్ కి ఇస్తారు. ఈ క్రమంలో విక్రమ్ హోమ్ మినిస్టర్ కూతురు అయిన కాంతి (తాన్య రవిచంద్రన్) తో ప్రేమలో పడతాడు. అనుకోని విధంగా కాంతి కిడ్నాప్ అవుతుంది. అసలు ఎవరు కిడ్నాప్ చేశారు? హోమ్ మినిస్టర్ కి ఎవరి నుండి అపాయం ఉంది? విక్రమ్ కాంతిని కాపాడుతాడా? అనేది మీరు తెరపై చూడాల్సిందే.
రివ్యూ :
రాజా విక్రమార్క అలియాస్ విక్రమ్ గా కార్తికేయ బాగా చేశారు. కార్తికేయ బాడీ లాంగ్వేజ్, మేనరిజమ్స్, మాట్లాడే విధానం అన్నీ కూడా పాత్రకి తగ్గట్టుగా బాగా మార్చుకున్నారు. డైరెక్టర్ శ్రీకి ఇది మొదటి సినిమా. ఇలాంటి సినిమాలని మనం హాలీవుడ్లో చాలా సార్లు చూశాం. రాజా విక్రమార్క చాలా హాలీవుడ్ సినిమాల నుండి ఇన్స్పైర్ అయ్యి తీశారు ఏమో అని అనిపిస్తుంది. ప్రతి సీన్ లో కామెడీ యాడ్ చేయడానికి ప్రయత్నించారు.
అది కొన్ని చోట్ల బానే ఉన్నా కూడా, కొన్నిచోట్ల, “అనవసరంగా ఈ సీన్ ఉందేమో” అనిపిస్తుంది. చాలా చోట్ల యాక్షన్, కామెడీ రెండు కలపడానికి ప్రయత్నించారు. కానీ అది వర్కౌట్ అవ్వలేదు. తాన్య రవిచంద్రన్ తన పాత్ర వరకు బానే చేశారు. తనికెళ్ళ భరణి, సాయి కుమార్, హర్షవర్ధన్, లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ ఫేమ్ సుధాకర్ కి కూడా మంచి పాత్రలు పడ్డాయి. ప్రశాంత్ విహారి అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగుంది.
ప్లస్ పాయింట్స్ :
- కార్తికేయ పర్ఫామెన్స్
- బ్యాక్ గ్రౌండ్ స్కోర్
మైనస్ పాయింట్స్:
- ఎక్కువగా అనిపించిన కామెడీ సీన్స్
- ఎడిటింగ్
రేటింగ్ :
2.25/5
ట్యాగ్ లైన్ :
ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ లేకుండా ఒక సినిమా చూద్దాము అని వెళ్తే రాజా విక్రమార్క ఒక సారి చూడొచ్చు.
End of Article