Ads
ప్రస్తుతం పవన్ కళ్యాణ్ భీమ్లా నాయక్ సినిమాతో బిజీ గా ఉన్నారు. ఇది కాకుండా ఆయన వరుసగా సినిమాలు ఒప్పుకుంటున్న సంగతి తెలిసిందే. క్రిష్ దర్శకత్వంలో “హరిహర వీరమల్లు” సినిమాలో కూడా పవన్ నటిస్తున్నారు. వీటి తరువాత అనిల్ రావిపూడి దర్శకత్వంలో కూడా పవన్ ఓ సినిమా చేయబోతున్నారు.
Video Advertisement
రెగ్యులర్ గా తీసే మాస్ కమర్షియల్ సినిమాలు కాకుండా.. ఓ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ సినిమాను తీయాలని పవన్ కళ్యాణ్ అనిల్ రావిపూడి కండిషన్ పెట్టారట. ఫ్యామిలీ ఆడియన్స్ ను దృష్టిలో ఉంచుకుని.. సరదాగా సాగే , కామెడీ మరియు ఎంటర్టైన్మెంట్ ప్రధానంగా ఉండే సినిమా తీయాలని కోరారట. ప్రస్తుతం అనిల్ రావిపూడి పవన్ కళ్యాణ్ కు అలాంటి కథని సిద్ధం చేసే పనిలో బిజీ అయ్యారు.
End of Article