Ads
ఈ మధ్యకాలంలో ఎల్పీజీ గ్యాస్ వినియోగం విపరీతంగా పెరిగిపోయింది. మన పూర్వీకులను చూసుకుంటే కట్టెలను వంట కోసం ఉపయోగించేవారు.
Video Advertisement
ముఖ్యంగా పల్లెటూళ్లలో ఎక్కువగా కట్టెలను వంట కోసం ఉపయోగిస్తూ ఉండేవారు. కానీ ఇప్పుడు మాత్రం కట్టెలను ఎక్కడా వాడడం లేదు. ఎల్ఫీజి గ్యాస్ వినియోగం ఇప్పుడు బాగా ఎక్కువ అయ్యింది. ఏది ఏమైనా ఇంధన వనరులను జాగ్రత్తగా వాడుకోవాలి.
ఈ ఉద్దేశంతోనే ఒక బామ్మ మంచి ఆలోచనతో ముందడుగు వేశారు. ఈ 77 ఏళ్ల బామ్మ తానే సొంతంగా గ్యాస్ ని తయారు చేసుకుంటున్నారు . వివరాల్లోకి వెళితే.. పూణేలోని కార్వే నగర్ లో 77 ఏళ్ల విమల్ దిఘే అనే ఒక బామ్మ పాతిక సంవత్సరాల నుండి వంట గ్యాస్ ని సగానికి పైగా ఆదా చేస్తున్నారు.
వంట కోసం కట్టెలని ఉపయోగించకుండా బయోగ్యాస్ ను తయారు చేస్తున్నారు. సొంతంగా మనం తయారు చేసుకోవడం వల్ల ఎంతో ఇంధనం ఆదా అవుతుంది. ఆమె తన ఇంటికి అవసరమైన 50 శాతంకు పైగా బయో గ్యాస్ ను సొంతంగా తయారు చేసుకుంటున్నారు.
పైగా దీనిని తయారు చేసుకోవడం అంత కష్టమేమీ కాదు అని అంటున్నారు ఆమె. ఏది వృధాగా పోనివ్వనని..అందుకే ఈ ఆలోచనతో నేను ముందడుగు వేశానని విమల దిఘే అన్నారు. రెగ్యులర్ గా ఇంట్లో కుళ్ళిపోయిన ఆహార పదార్థాలు చాలా ఉంటాయి. అటువంటి వాటిని తీసుకుని బయోగ్యాస్ కి సంబంధించిన విషయాలు నేను తెలుసుకొని మొదలు పెట్టాలని అన్నారామె.
వ్యర్థ పదార్థాలను కాస్త నీటిలో కలిపి బయో గ్యాస్ తయారు చేయడం తో పాటు ఎక్కువ వ్యర్ధాలను స్టోర్ చేయడానికి ట్యాంక్ ని కూడా ఏర్పాటు చేసారు. ప్రతినెలా కూడా ఇలా చేయడం వలన 50 శాతంకు పైగా ఎల్పీజీ గ్యాస్ ని ఆదా చేస్తున్నారీమె. అందరూ కూడా ఇదే దారిలో వెళ్తే కచ్చితంగా 50 శాతం గ్యాస్ ఆదా చేసుకోవచ్చు.
End of Article