Ads
ఈమె గురించి చూస్తే చప్పట్లు కొట్టకుండా ఉండలేరు. నిజంగా ఈమె జీవితం ఎంతో స్ఫూర్తిదాయకం. ఈమెను కనుక ఎవరైనా ఆదర్శంగా తీసుకుంటే కచ్చితంగా సరైన మార్గంలో నడుస్తారు.
Video Advertisement
ఆమె ఆలోచనని విన్న తల్లిదండ్రులు తప్పుపట్టారు. అయినప్పటికీ తాను అనుకున్నది సాధించింది. ఆమె అనుకున్నది ఎలా సాధించింది..?, ఎలా ఆమె సక్సెస్ ని అందుకుంది అనేది ఇప్పుడు మనం చూద్దాం.
ఆమె బాగా చదువుకుంది. కానీ ఎంత శ్రమించినా ఉద్యోగం మాత్రం రాలేదు. దీంతో ఆమెకి ఒక ఆలోచన వచ్చింది. తల్లిదండ్రులకు ఆమె యొక్క ఆలోచన గురించి చెప్పింది. ఆమె ఆలోచన విన్న తల్లిదండ్రులు అస్సలు ఒప్పుకోలేదు. ఆమెను నిరాశ పరచిన ఆమె వెనుకకు మాత్రం వేయలేదు తాను అనుకున్నది సాధించాలని ముందడుగు వేసింది. ఆమె ఉద్యోగం కోసం ప్రయత్నాలు చేస్తున్నప్పుడు కరోనా మహమ్మారి వచ్చింది.
దీనితో ఉద్యోగం రాలేదు. అందుకని ఆమె పశ్చిమ బెంగాల్ లోని హెబ్రా రైల్వేస్టేషన్లో ఒక చిన్న షాపు అద్దెకి తీసుకుని టీ స్టాల్ ను మొదలు పెట్టింది. మొదటి రోజు వచ్చిన కష్టమర్స్ అందరికీ ఆమె టీ ని ఫ్రీ గా ఇచ్చింది. తను షాప్ కి ”మా ఇంగ్లీష్ చాయ్ వాలా” అనే పేరు కూడా పెట్టింది. పేరు కాస్త విభిన్నంగా ఆకట్టుకునేలా ఉండడంతో ఆ షాప్ బాగా ఫేమస్ అయిపోయింది.
ఆమె ఉద్యోగం లో ఫెయిల్ అయినా సంపాదించాలనే కలను మాత్రం నిజం చేసింది. ఉద్యోగం రాలేదని నిరాశ పడి చాలా మంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. కానీ ఈమె మరొక దారి వెతుక్కుంది. సంపాదించడానికి చక్కటి మార్గం ఎంచుకుని స్ఫూర్తిగా నిలిచింది. నిజంగా ఇలాంటి వాళ్లు ఎందరికో ఆదర్శం.
End of Article