Ads
బాలీవుడ్ ప్రముఖ నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఇంట్లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. సుశాంత్ సింగ్ కుటుంబానికి చెందిన ఆరుగురు వ్యక్తులు రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. ఈ దుర్ఘటన సుశాంత్ అభిమానులను మరింతగా కలచివేస్తోంది.
Video Advertisement
బీహార్ లోని లఖిసరాయ్ జిల్లాలో మంగళవారం ఉదయం ఈ దుర్మరణం చోటు చేసుకుంది. సుశాంత్ కు చెందిన కుటుంబ సభ్యులు సుమోలో ప్రయాణం చేస్తుండగా ఈ దుర్ఘటన చోటు చేసుకుంది.
ఈ సుమోలో మొత్తం పది మంది ఉన్నారట. పదిమందిలో ఆరుగురు అక్కడికక్కడే చనిపోయారు. మరో నలుగురికి తీవ్రంగా గాయాలు అయ్యాయి. మరణించిన వారిలో సుశాంత్ మేనల్లుడు, బావ కూడా ఉన్నారు. వీరు కాక, హర్యానా ఐపీఎస్ ఓం ప్రకాష్ సింగ్ బంధువులు కూడా ఉన్నారు.
గతేడాది జూన్ లో సుశాంత్ ముంబైలోని తన ఫ్లాట్ లో ఆత్మహత్యకి పాల్పడ్డ సంగతి తెలిసిందే. ఈ కేసు అనేక మలుపులు తిరిగింది. ప్రియురాలు మోసం చేసిందని, మనస్థాపం వల్లే ఆత్మహత్య చేసుకున్నాడని ఇలా రకరకాల కారణాలు భావించారు. చివరకు డ్రగ్స్ మాఫియాకు కూడా సంబంధం ఉందేమోనని ఆ కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేసారు. ఈ కేసుపై ఇప్పటివరకు వివరణ రాలేదు. అంతలోనే ఈ ఘోరం జరగడం సుశాంత్ కుటుంబానికి తీరని షాక్ అనే చెప్పాలి. ఈ దుర్వార్తతో సుశాంత్ అభిమానులు కూడా విషాదంలో మునిగిపోయారు.
End of Article