Ads
బాగా పాపులర్ అయిన పాటల్ని సినిమాలకు టైటిల్స్ గా కూడా పెడుతూ ఉంటారు. అయితే చాలా సినిమా పేర్లు పాటల వల్ల వచ్చాయి. ఆ సినిమాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం.
Video Advertisement
#1. సోగ్గాడే చిన్ని నాయన:
అక్కినేని నాగేశ్వరరావు హీరోగా నటించిన ఆస్తిపరులు చిత్రంలో ‘సోగ్గాడే చిన్ని నాయన ఒక పిట్ట నైనా కొట్టలేదు సోగ్గాడే’ పాట నుండి నాగార్జున చిత్రానికి పేరు వచ్చింది.
#2. చలో:
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పరుగు సినిమాలో వున్న ‘చల్ చల్ ఛలో’ పాట నుండి నాగ శౌర్య చలో సినిమా పేరు వచ్చింది.
#3. కెవ్వు కేక:
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గబ్బర్ సింగ్ లోని “కెవ్వు కేక” పాట నుండి అల్లరి నరేష్ కెవ్వు కేక చిత్రం పేరు వచ్చింది.
#4. A వచ్చి B పై వాలే:
సాయిరాం నటించిన ఈ చిత్రం పేరు ప్రభాస్ ఛత్రపతి మూవీ సాంగ్ నుండి రావడం జరిగింది.
#5. బంగారు కోడి పెట్ట:
స్వాతి, నవదీప్ నటించిన ఈ చిత్రానికి పేరు చిరంజీవి బంగారు కోడి పెట్ట నుండి వచ్చింది. అలానే ఈ పాట మగధీరలో కూడా వుంది.
#6. సంథింగ్ సంథింగ్:
నువ్వొస్తానంటే నేనొద్దంటానా చిత్రంలో వున్న సంథింగ్ సంథింగ్ పాట నుండి సిద్ధార్థ్ సంథింగ్ సంథింగ్ సినిమాకి టైటిల్ వచ్చింది.
#7. ప్రియతమా నీవచట కుశలమా:
గుణ సినిమాలోని ప్రియతమా నీవచట కుశలమా పాట ఎంతో అద్భుతంగా ఉంటుంది. ఆ పాట ద్వారా వరుణ్ సందేశ్ సినిమా ప్రియతమా నీవచట కుశలమాకి టైటిల్ వచ్చింది.
#8. ఎటో వెళ్ళిపోయింది మనసు:
నాగ్గార్జున నిన్నే పెళ్లాడుతాలో ఎటో వెళ్ళిపోయింది మనసు పాట నుండి నాని చిత్రం అయిన ఎటో వెళ్ళిపోయింది మనసు చిత్రానికి టైటిల్ ని పెట్టడం జరిగింది.
#9. వస్తాడు నా రాజు:
అల్లూరి సీతారామ రాజు సినిమా లో పాట ఆధారంగా ఈ వస్తాడు నా రాజు చిత్రం టైటిల్ ని తీసుకొచ్చారు.
#10. మళ్లీ మళ్లీ ఇది రాని రోజు:
చిరంజీవి మళ్లీ మళ్లీ ఇది రాని రోజు పాట బాగా ఫేమస్ అయ్యింది. అయితే ఈ పాట నుండి శర్వానంద్ మళ్లీ మళ్లీ ఇది రాని రోజు టైటిల్ తీసుకొచ్చారు.
#11. ఆహా నా పెళ్లంట:
మాయాబజార్ లోని ఆహా నా పెళ్లంట పాట పేరుతో రాజేంద్ర ప్రసాద్ సినిమా వచ్చింది. ఈ సినిమా మంచి హిట్ ని కూడా అందుకుంది.
#12. Mr పర్ఫెక్ట్:
అల్లు అర్జున్ ఆర్య 2 లో Mr పర్ఫెక్ట్ పాట ఆధారంగా ప్రభాస్ Mr పర్ఫెక్ట్ సినిమాకి టైటిల్ ని ఇచ్చారు.
#13. కాటమరాయుడు:
అత్తారింటికి దారేది సినిమాలో “కాటమరాయుడా” పాటతో పవన్ కళ్యాణ్ కాటమరాయడు చిత్రం టైటిల్ పెట్టారు.
#14. నమో వెంకటేశా:
ఘంటసాల పాడిన “నమో వెంకటేశా” పాత నుండి విక్టరీ వెంకటేష్ నమో వెంకటేశా చిత్రానికి టైటిల్ వచ్చింది. పైగా ఇది మంచి హిట్ అందుకున్నారు కూడా.
#15. నువ్వు వస్తానంటే వద్దంటానా:
వర్షంలో “నువ్వు వస్తానంటే వద్దంటానా” పాట అప్పట్లో ఎంతగానో ఆకట్టుకుంది. ఆ తర్వాత సిద్ధార్ద్ నువ్వు వస్తానంటే వద్దంటానా చిత్రం వచ్చింది.
#16. సినిమా చూపిస్తా మామ:
రేసుగుర్రం చిత్రం లోని సినిమా చూపిస్తా మామ పాట అదిరిపోయింది. ఈ పాటతో రాజ్ తరుణ్ సినిమా చూపిస్తా మామ చిత్రం టైటిల్ ని పెట్టారు.
#17. కుందనపు బొమ్మ:
ఏ ఆర్ రెహమాన్ కంపోజ్ చేసిన కుందనపు బొమ్మ పాట ద్వారా వరా ముళ్లపూడి దర్శకత్వంలో యువ నటీనటులు చాందిని చౌదరి, సుధాకర్ లతో తెరకెక్కించిన సినిమాకి కుందనపు బొమ్మ పేరు పెట్టారు.
#18. బంతిపూల జానకి:
బాద్ షా సినిమాలోని బంతిపూల జానకి పాట బాగా ఫేమస్ అయ్యింది. హాస్యనటుడు ధన్ రాజ్ తన సినిమాకి బంతిపూల జానకి అని టైటిల్ ఇచ్చారు.
#19. ఎవడే సుబ్రహ్మణ్యం:
“కొంచెం ఇష్టం కొంచెం కష్టం” లో ఎవడే సుబ్రహ్మణ్యం పాట ఉంటుంది. తరవాత ఆ పేరుతోనే నాని సినిమా వచ్చింది.
#20. సాహసం శ్వాసగా సాగిపో:
ఒక్కడు సినిమాలో “సాహసం శ్వాసగా సాగిపో” పాట ఉంటుంది. ఆపాటని నాగ చైతన్య సినిమాకి టైటల్ కింద పెట్టడం జరిగింది.
#21. చిత్రం భళారే విచిత్రం:
దాన వీర సూర కర్ణ సినిమాలో “చిత్రం భళారే విచిత్రం” సూపర్ హిట్ అయ్యింది. అయితే ఆ పాట తో పాతికేళ్ల క్రితం నరేష్ సినిమా వచ్చింది. సూపర్ హిట్. తాజాగా ఓ హారర్ థ్రిల్లర్ మూవీకి కూడా ఇదే టైటిల్ పెట్టారు.
#22. ఎక్కడికి పోతావు చిన్నవాడా:
నాగేశ్వరరావు నటించిన ఆత్మబలం చిత్రంలోని “ఎక్కడికి పోతావు చిన్నవాడా” పాట నుండి నిఖిల్ ఎక్కడికి పోతావు చిన్నవాడా సినిమాకి టైటిల్ వచ్చింది.
#23. హలో గురూ ప్రేమ కోసమే:
నిర్ణయం సినిమాలో హలో గురూ ప్రేమ కోసమే పాట వుంది. ఆ పాట పేరుతోనే అఖిల్ సినిమాకి టైటిల్ వచ్చింది.
End of Article