పది రోజుల్లో పెళ్లి పీటలు ఎక్కాల్సింది.. చితి పైకి చేరిన లేడీ కానిస్టేబుల్.. ఈ దారుణం ఎలా జరిగిందంటే..?

పది రోజుల్లో పెళ్లి పీటలు ఎక్కాల్సింది.. చితి పైకి చేరిన లేడీ కానిస్టేబుల్.. ఈ దారుణం ఎలా జరిగిందంటే..?

by Anudeep

Ads

ఆమె పేరు పరసా శ్రీరమ(21). కృష్ణాజిల్లా ఉంగుటూరు మండలం నందమూరి గ్రామంలో తల్లితండ్రులతో కలిసి నివసిస్తోంది. అజిత్‌సింగ్‌నగర్‌ పోలీస్‌స్టేషన్‌లో ఆమె మహిళా కానిస్టేబుల్ గా విధులు నిర్వర్తిస్తున్నారు. 19 ఏళ్ల వయసులోనే శ్రీ రమ కానిస్టేబుల్ గా ఉద్యోగం సంపాదించింది.

Video Advertisement

2020 బ్యాచ్‌ లో శిక్షణ పూర్తి చేసుకున్న శ్రీరమ గతేడాది సెప్టెంబర్ లో అజిత్ సింగ్ నగర్ పోలీస్ స్టేషన్ లో మహిళా కానిస్టేబుల్ గా వృత్తి జీవితం ప్రారంభించింది. ఈ క్రమంలో ఆమెకు పెళ్లి చేస్తే మరింత సంతోషంగా ఉంటుందని ఆమె తల్లి తండ్రులు భావించారు.

lady constable 1

అందుకే ఆమెకు మంచి సంబంధం కూడా చూసారు. అన్ని కుదిరి.. పది రోజుల్లో వివాహం ఉందనగా.. ఆమెను విధి కాటేసింది. విగత జీవిగా మారి తల్లితండ్రులకు తీరని శోకాన్ని మిగిల్చింది. గత పది రోజులనుంచి రమ అనారోగ్యంతో బాధపడుతోంది. ఓ రోజు విధుల్లో ఉండగా.. ఉన్నట్లుండి ముక్కునుంచి, చెవుల నుంచి రక్తం బయటకు వచ్చి అక్కడికక్కడే కుప్పకూలిపోయింది.

lady constable 2

స్టేషన్ సిబ్బంది ఆమెను హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. ఆ తరువాత మెరుగైన వైద్యం అందించడం కోసం హైదరాబాద్ కు కూడా తీసుకెళ్లారు. రెండు రోజుల పాటు ఆసుపత్రిలోనే ప్రాణం కోసం పోరాడింది. గురువారం అర్ధరాత్రి దాటాక చివరి శ్వాస విడిచింది. ఆమె మరణవార్తతో గ్రామం విషాదంలో మునిగిపోయింది.

 


End of Article

You may also like