రియల్ స్టోరీ: రైల్లో చూసి ప్రేమించాడు.. మూగదని తెలిసేసింది..చివరికి ఏమైందంటే…?

రియల్ స్టోరీ: రైల్లో చూసి ప్రేమించాడు.. మూగదని తెలిసేసింది..చివరికి ఏమైందంటే…?

by Megha Varna

Ads

ప్రేమ అనేది ఎంతో మధురమైనది. సినిమాల్లోనైనా, బయటైనా ప్రేమకథలు ఎంతో విచిత్రంగా ఉంటాయి. అంతే కాదు అటువంటి ప్రేమకధలు జీవితాంతం గుర్తుండిపోతాయి.

Video Advertisement

ఈ ప్రేమ కథ ఒక రైల్వే స్టేషన్లో మొదలైంది. అందరికీ తెలిసినదే రైల్వేస్టేషన్ ఎప్పుడూ హడావిడిగానే ఉంటుంది పైగా కొంతమంది ఆలస్యంగా రావడం వల్ల ఇంకా హడావుడి చేస్తారు. అలాంటప్పుడే రైల్వే స్టేషన్ లోకి ఒక యువకుడు కంగారుగా వచ్చాడు. అతను ఎక్కాల్సిన ట్రైన్ అప్పటికే మొదలయ్యింది.

ట్రైన్ రన్నింగ్ లో ఎక్కాడు, ఆ తరువాత ఖాళీగా ఉన్న సీట్ వద్ద కూర్చున్నాడు. తనకు దగ్గర్లో ఒక అమ్మాయి వచ్చి కూర్చుంది. ఆ అమ్మాయిని చూసి ఎంతో ఆశ్చర్యపోయాడు యువకుడు. ఏమీ ఆలోచించకుండా మాటలు కలిపాడు. యువకుడు ఏం మాట్లాడినా సరే ఆ అమ్మాయి మాత్రం నవ్వుతూ సమాధానం ఇస్తోంది. కానీ తిరిగి ఇంకొక మాట మాట్లాడలేదు. ఇలా ఏమీ మాట్లాడటం లేదని చాలా నిరుత్సాహపడ్డాడు.

Attractive Woman Talking to a Stock Footage Video (100% Royalty-free) 12415493 | Shutterstock

అయినా సరే చాలా ధైర్యం చేసి వెంటనే ఐ లవ్ యు చెప్పేసాడు. ఆ సమయంలోనే ఆ అమ్మాయికి వీడియో కాల్ రావడం జరిగింది. అయితే వీడియో కాల్ లో ఆ అమ్మాయి మాట్లాడకుండా సైగలతో సమాధానమిచ్చింది. అప్పుడు ఆ యువకుడు అమ్మాయి మూగదని అనుకున్నాడు. ఈ విధంగా నిరుత్సాహ పడుతుంటే అమ్మాయి మాత్రం యువకుడి ఫోన్ నెంబర్ ఇవ్వమని అడిగింది.

ఫోన్ నెంబర్ తీసుకున్న వెంటనే, నేనంటే ఇప్పుడు కూడా నీకు ఇష్టమేనా అని మెసేజ్ పెట్టింది. దానికి బదులుగా యువకుడు ఈ విధంగా సమాధానం ఇచ్చాడు. నువ్వు మాట్లాడలేవు అని తెలిసిన వెంటనే బాధపడటం నిజమే. కానీ నేను ఇష్టపడింది నిన్ను కాబట్టి నీలో ఏ లోపం ఉన్నా నాకు ఇష్టమే. కాబట్టి నువ్వు ఒప్పుకుంటే నేను పెళ్లి చేసుకుంటానని అన్నాడు.

ఈ సమయంలోనే స్టేషన్ మాస్టర్ వచ్చి టికెట్ అడిగాడు అయితే సమయం లేకపోవడంతో జనరల్ టికెట్ మాత్రమే తీసుకున్నా అని చెప్పగా ఫైన్ కట్టమన్నారు. అతని వద్ద డబ్బులు లేకపోవడంతో ఆ అమ్మాయి ఫైన్ కట్టేసింది. ఆ తరవాత తను దిగాల్సిన స్టేషన్ రావడంతో ట్రైన్ నుండి దిగిపోయింది. దాంతో ఎంతో బాధపడుతుంటే ఈ మెసేజ్ వచ్చింది.

ఈ రోజు నేను మౌనవ్రతం. అందుకే నీతో మాట్లాడలేకపోయాను, ఐ లవ్ యు టూ అని చెప్పింది. ఆనందానికి హద్దులు లేవు, ట్రైన్ డోర్ దగ్గరకు పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆ అమ్మాయిని చూసాడు, తను కూడా తిరిగి చూసింది. ఇద్దరూ ఎంతో సంతోషంగా ఫీల్ అయ్యారు.


End of Article

You may also like